Site icon HashtagU Telugu

581 Cases : ఆ టైంలో పటాకులు కాల్చారని 581 మందిపై కేసులు

581 Cases

581 Cases

581 Cases : దీపావళి వేళ బాణసంచా కాల్చడానికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను ధిక్కరించిన వారిపై చెన్నై నగరంలో 581 కేసులు నమోదయ్యాయి. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య 90 డెసిబుల్స్ కంటే తక్కువ శబ్దంతో బాణసంచా కాల్చాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించింది. ఆ టైంలో గ్రీన్ క్రాకర్లను ఎక్కువగా ఉపయోగించాలని సూచించింది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే కోర్టు నిబంధనలను ఉల్లంఘించి ఆదివారం రాత్రి టైంలో పటాకుల దుకాణాలను తెరిచి ఉంచిన ఎనిమిది మందిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. 90 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దంతో పటాకులు కాల్చిన 19 మందిపైనా పోలీసు కేసు నమోదైంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన టైం తర్వాత కూడా ఆదివారం రాత్రి బాణసంచా కాల్చడం కంటిన్యూ చేశారనే అభియోగాలతో 554 కేసులను నమోదు చేయడం గమనార్హం. దీపావళి వేళ చెన్నైలో గాలి నాణ్యత పడిపోయిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పటాకులు కాల్చడం వల్లే ఇలా జరిగిందని పేర్కొన్నాయి. ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ.. చెన్నై నగర ప్రజల ఆరోగ్య భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోక తప్పదని తమిళనాడు సర్కారు చెప్పింది.

Also Read: APSRTC : శబరిమల, పంచారామ క్షేత్రాల దర్శనం.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు