తమిళనాడు (Tamilanadu) రాష్ట్రంలో అప్పు వసూలు (Debt collection) పేరుతో బలవంతపు చర్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి (Governor R.N. Ravi) ఆమోదం తెలిపారు. అప్పు ఇచ్చిన వారు రుణగ్రహితుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, శారీరకంగా బెదిరించడం వంటి చర్యలకు ఇకపై చట్టపరమైన గుణపాఠం చెప్పే విధంగా ఈ చట్టం రూపొందించబడింది.
ICRISAT : ఇక్రిశాట్ క్యాంపస్ కు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లినట్లు..?
ఈ బిల్లును తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (Deputy CM Udhayanidhi Stalin) ఈ ఏడాది ఏప్రిల్ 26న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అప్పు పేరుతో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను అరికట్టేందుకు చట్టబద్ధమైన చర్యలు అవసరమన్న భావనతో ఈ చట్టం రూపొందించారు. అసెంబ్లీలో బిల్లు సమ్మతించబడిన తర్వాత గవర్నర్ ఆమోదంతో అది ఇప్పుడు అమలులోకి వచ్చింది. ప్రజలను గౌరవంగా రుణ చెల్లింపులో ప్రోత్సహించడమే కాకుండా అక్రమ వసూళ్లను నియంత్రించడమే లక్ష్యంగా ఉంచారు.
Iran-Israel War : తగలబడిపోతున్న ఎయిర్పోర్ట్
ఈ చట్టం ప్రకారం..ఎవైనా రుణదాతలు బలవంతంగా రుణం వసూలు చేసినట్టయితే వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధించబడుతుంది. అంతేకాక ఈ కేసులో బెయిల్ కూడా లభించదు. రుణగ్రహితుల హక్కులను కాపాడే దిశగా తమిళనాడు ప్రభుత్వం చేసిన ఈ నిర్ణయాన్ని సామాజిక సేవా సంఘాలు, హక్కుల కార్యకర్తలు ప్రశంసిస్తున్నాయి. దేశంలో ఇతర రాష్ట్రాలకూ ఇది ఒక ఉదాహరణగా నిలవనుంది.