కేర‌ళ‌లో 41మంది గ‌ర్భిణిలు క‌రోనాతో మృతి

కోవిడ్ 19 రెండో విడ‌త కేర‌ళ రాష్ట్రంలో సుమారు 149 మంది భ‌యంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

  • Written By:
  • Publish Date - October 28, 2021 / 09:00 PM IST

కోవిడ్ 19 రెండో విడ‌త కేర‌ళ రాష్ట్రంలో సుమారు 149 మంది భ‌యంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వ‌చ్చిన నివేదిక‌ల ఆధారంగా 41 మంది గ‌ర్భిణిలు చ‌నిపోయారు. ఏడాదిన్న‌ర క్రితం ముంద‌స్తుగా తీసుకున్న చ‌ర్య‌ల కార‌ణంగా కేర‌ళ రాష్ట్రం కోవిడ్ ను విజ‌య‌వంతంగా అదుపు చేసింది. ఆ విష‌యాన్ని ఐసీఎంఆర్ అధ్య‌య‌నం చేసిన త‌రువాత వెల్ల‌డించింద‌ని కేర‌ళ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి వీణాజార్జి ఆ రాష్ట్ర అసెంబ్లీలో వేసిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు.
ఐసీఎం ఆర్ ఇచ్చిన నివేదిక ప్రకారం సెరో పాజిటివ్ రేట్ గ‌త ఏడాది 0.33, 0.88 నుంచి 11.6 శాతం వ‌రుస‌గా మే, ఆగ‌స్ట్‌, డిసెంబ‌ర్ నెల‌ల్లో న‌మోదు అయ్యాయి. అదే, ఈ ఏడాది ఒక్క మే నెల‌లోనే 44. 4శాతంగా సెరో పాజిటివ్ న‌మోదు అయ్యాయ‌ని కాంగ్రెస్ స‌భ్యుడు మ‌థ్యూ అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి జార్జి స‌మాధానం ఇచ్చాడు. రాష్ట్రం చేసిన స‌ర్వే ప్రకారం ఈ ఏడాది ఆగ‌స్ట్‌, సెప్టెంబ‌ర్ నెల‌లో 82.61 శాతం సెరో పాజిటివ్ గుర్తించ‌డం జ‌రిగింది. ఇదంతా ప్ర‌ణాళిక ప్రకారం రెండు డోసుల వ్యాక్సిన్ల‌ను ఇవ్వ‌డం వల‌న సాధ్యం అయింద‌ని మంత్రి వివ‌రించారు.
ప్ర‌స్తుతం కేర‌ళ రాష్ట్ర ప్ర‌జ‌లు సుమారు 80శాతానికి పైగా బ‌ల‌మైన యాంటీ బాడీస్ ను క‌లిగి ఉన్నారు. స‌ముద్ర తీరం వెంబ‌డి ఉండే వాళ్ల‌లో 95శాతంకు పైగా ర‌క్తం యాంటీబాడీస్ ఉన్నాయ‌ని కేర‌ళ అసెంబ్లీ వేదిక‌గా ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి కోవిడ్ వైర‌స్ ను అయినా ఎదుర్కొనే విధంగా వ్యాక్సిన్ల ద్వారా యాంటీబాడీస్ కేర‌ళ వాసుల శ‌రీరంలో ఉన్నాయ‌ని వివ‌రించారు.
కోవిడ్ నై ఐసీఎంఆర్ నివేదిక‌ల‌కు, కేర‌ళ రాష్ట్రం త‌యారు చేసిన రిపోర్ట్ ల మ‌ధ్య వ్య‌త్యాసం వుంది. ఆ విష‌యాన్ని అసెంబ్లీ వేదిక‌గా కాంగ్రెస్ స‌భ్యుడు మ‌థ్యూ అడిగిన ప్ర‌శ్న దుమారం రేపింది. రెండు నివేదిక‌ల మ‌ధ్య ఏది నిజమో తెలియ‌చేయాల‌ని స‌భ్యుడు కోరిన ప్ర‌శ్న‌కు ఆ రాష్ట్ర మంత్రి ఇచ్చిన స‌మాధానంలో కేర‌ళ రాష్ట్రం సేఫ్ గా ఉంద‌ని తేల్చారు. 95శాతానికి పైగా ప్ర‌జ‌లు యాంటీబాడీస్ బ‌లంగా క‌లిగి ఉన్నార‌ని అసెంబ్లీ స్ప‌ష్టం చేసింది.