4 Women Killed: తమిళనాడులో విషాదం.. తొక్కిసలాటలో నలుగురు మహిళల మృతి

తమిళనాడులో ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 4 మహిళలు మృతి (4 Women Killed) చెందారు. 12 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. తిరుప్పత్తూరు జిల్లాలోని వాణియంబాడి వద్ద జరిగే తైపూసం ఉత్సవం సందర్భంగా ఉచితంగా చీరలు, ధోవతులు పంపిణీ చేయడానికి టోకెన్లు జారీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

  • Written By:
  • Publish Date - February 5, 2023 / 07:36 AM IST

తమిళనాడులో ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 4 మహిళలు మృతి (4 Women Killed) చెందారు. 12 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. తిరుప్పత్తూరు జిల్లాలోని వాణియంబాడి వద్ద జరిగే తైపూసం ఉత్సవం సందర్భంగా ఉచితంగా చీరలు, ధోవతులు పంపిణీ చేయడానికి టోకెన్లు జారీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున CM స్టాలిన్ పరిహారం ప్రకటించారు.

తమిళనాడులోని తిరుపత్తూరులోని వాణియంబాడిలో తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు మరణించారు. తైపూసం ఉత్సవం సందర్భంగా ఒక వ్యక్తి ఉచిత దుస్తులు, చీరలను పంపిణీ చేస్తున్నాడు. దీని కోసం టోకెన్లు పొందడానికి ప్రజలు గుమిగూడారు. అప్పుడు తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు మరణించారు. తైపూసం అనేది తమిళ మాసంలో పౌర్ణమి రోజున హిందూ తమిళ సమాజం జరుపుకునే పండుగ. వాణియంబాడిలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళల కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై తిరుపత్తూరు ఎస్పీ మాట్లాడుతూ.. కేసును విచారిస్తున్నామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఈవెంట్ నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేదు అని ఆయన తెలిపారు. కేసు విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read: Rape Case : మ‌హిళ‌పై అత్యాచారం కేసులో న్యాయ‌వాది అరెస్ట్‌

మురుగన్ జయంతి రోజున తమిళ సమాజం తైపూసం పండుగను జరుపుకుంటుంది. మురుగన్ కార్తికేయుడు, శివుడు- పార్వతి దేవి చిన్న కుమారుడు. ఈ రోజున పార్వతీ దేవి తారకాసురుడు అనే రాక్షసుడిని, అతని సైన్యాన్ని చంపమని మురుగన్‌ను ఆదేశించిందని నమ్ముతారు. ఆ తర్వాత కార్తికేయుడు తారకాసురుడిని సంహరించాడు. తైపూసం పండుగను దాని ఆనందంలో జరుపుకుంటారు.