Hijab Issue : క‌ర్నాట‌క కాలేజిల్లో ‘డ్ర‌స్ కోడ్‌’ వివాదం

ముస్లిం విద్యార్థులు ధ‌రించే హిజాబ్ కు పోటీగా క‌ర్నాట‌క కాలేజిల్లోని హిందూ విద్యార్థులు క‌షాయ రంగు కండువాల‌ను ధ‌రిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 4, 2022 / 02:59 PM IST

ముస్లిం విద్యార్థులు ధ‌రించే హిజాబ్ కు పోటీగా క‌ర్నాట‌క కాలేజిల్లోని హిందూ విద్యార్థులు క‌షాయ రంగు కండువాల‌ను ధ‌రిస్తున్నారు. దీంతో కాలేజిల్లో విద్యార్థుల మ‌ధ్య వివాదం నెలకొంది. కాలేజిల్లో హిందూ, ముస్లిం వివాదంలాగా క‌ర్నాట‌క అంత‌టా వ్యాపించింది. కాలేజిల్లోని డ్ర‌స్ కోడ్ పై స్టేట‌స్ కో విధించిన త‌రువాత క‌ర్నాట‌క విద్యా సంస్థ‌ల్లో విచిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ఆయా కాలేజిల యాజ‌మాన్యం హిజాబ్ ధ‌రించిన విద్యార్థుల‌ను రానివ్వ‌డంలేదు. పైగా పోటీ క‌షాయ కండ‌వాల‌ను వేసుకుని హిందూ విద్యార్థులు వ‌స్తుండ‌డంతో యాజ‌మాన్యాల‌కు త‌ల‌నొప్పిగా మారింది.ప్ర‌శాంతంగా ఉండే క‌ర్నాట‌క రాష్ట్రంలో ఇటీవ‌ల మ‌త ప‌ర‌మైన సంఘ‌ట‌న‌లు పెరుగుతున్నాయి. తాజాగా ముస్లిం విద్యార్థులు ధ‌రించే హిజాబ్(త‌ల‌పాగ) మీద క‌షాయం తిర‌గ‌బ‌డింది. ముస్లింల వేష‌ధార‌ణ హిజాబ్. తొలి నుంచి బుర‌ఖాల‌ను ముస్లిం మ‌హిళ‌లు ధ‌రిస్తారు. పురుషులుహిజాబ్ పెట్టుకోవ‌డం ముస్లిం మ‌త ఆచారం. ఆ రాష్ట్రంలోని పురుష స్టూడెంట్స్ త‌ల‌టోపీ పెట్టుకుని కాలేజికి వ‌చ్చారు. దీనికి ప్ర‌తిగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు వేసుకుని రావ‌డంతో వివాదం నెల‌కొంది.

కర్ణాటకలోని కుందాపూర్ కళాశాల ఇప్పుడు ఆ వివాదానికి వేదిక అయింది. ముస్లిం స్టూడెంట్స్ హిజాబ్‌లు ధరించి రావ‌డాన్ని కాలేజి యాజ‌మాన్యం అంగీక‌రించ‌లేదు. వాళ్ల‌ను లోపల‌కు రానివ్వ‌కుండా గేట్ల‌ను క్లోజ్ చేసింది. దీంతో ప్ర‌భుత్వం ఎంట్రీ ఇవ్వ‌డంతోపాటు యూనిఫాం డ్రెస్ కోడ్‌పై ప్యానెల్‌ను ఏర్పాటు చేయనుంది. హిజాబ్ వర్సెస్ కాషాయ కండువా గొడవ కర్ణాటకలోని మరిన్ని కాలేజీలకు వ్యాపిస్తోంది. కుందాపూర్ కాలేజి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా అక్క‌డ వ్యాపించ‌డంతో క‌షాయ కండువాలు వేసుకుని హిందూ విద్యార్థులు కాలేజీల‌కు వ‌స్తున్నారు. ఆ విధంగా వ‌చ్చిన విద్యార్థుల‌కు ప్ర‌వేశం లేకుండా మ‌రో రెండు కాలేజిలు గేట్ల‌ను వేసివేయ‌డం ఉద్రిక్త‌త‌కు దారితీసింది.ప్రభుత్వ కళాశాలలు డ్రెస్ కోడ్‌పై ‘స్టేటస్ కో’ కొనసాగించాలని రాష్ట్ర విద్యా శాఖ కోరింది. అప్ప‌టి నుంచి ప‌లు కాలేజిల్లో ఇలాంటి వివాదాల‌కు ఆస్కారం ఏర్ప‌డింది. ఇంతకు ముందు అలాంటి పరిమితి లేదు. హఠాత్తుగా రూల్స్ మార్చారు?” ఆ విష‌యంపై ముస్లిం విద్యార్థులు కాలేజీ ప్రిన్సిపాల్ రామకృష్ణ ను నిల‌దీశారు. విద్యార్థుల ప్ర‌వేశాన్ని అడ్డుకుంటూ గేట్లను మూసివేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కుందాపూర్ కళాశాలలో, సుమారు 27 మంది ముస్లిం విద్యార్థులు హిజాబ్‌లు ధరించడాన్ని హిందూ విద్యార్థులు ధ‌ర్నాకు దిగారు. అంతేకాదు, 40 మందికి పైగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు పోటీగా ధరించారు. బ కుందాపూర్ లోని ప్రైవేటు కాలేజిగా భండార్కర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉంది. శివమొగ్గ జిల్లా భద్రావతిలోని సర్ ఎం విశ్వేశ్వరయ్య ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలోనూ ఇలాంటి ప‌రిణామం క‌నిపించింది.ఉడిపి జిల్లాలోని బాలికల ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ (పియు) కళాశాల ముస్లిం విద్యార్థులు కర్నాటక హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్ల వేశారు. హిజాబ్‌లు (తల కండువాలు) ధరించి తరగతులకు హాజరయ్యేందుకు మధ్యంతర ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని కోరారు. దీంతో హిందూ విద్యార్థులు పోటీగా కండువాలు భుజాన వేసుకుని రావ‌డం ప్రారంభించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 25 ప్రకారం హిజాబ్ ధరించడం ప్రాథమిక హక్కు. కానీ, హిజాబ్‌లు ధరించి ఉన్నందున గత నెలలో కళాశాలలో ప్రవేశం నిరాకరించార‌ని కోర్టులో ముస్లిం విద్యార్థులు పిటిష‌న్ దాఖ‌లు ప‌రిచారు. కర్నాటకలోని విద్యాసంస్థల్లో ఇలాంటి పోక‌డ ప్ర‌మాద‌క‌రంగా మారింది. మతపరమైన సున్నితమైన జిల్లాల్లో-హిజాబ్ వర్సెస్ కుంకుమపువ్వు స్కార్ఫ్ గొడవ నెల‌కొంది. ఉడిపి మహిళా పీయూ కళాశాలలో గత నెలలో హిజాబ్‌తో తరగతులకు హాజరుకాకుండా విద్యార్థులను నిషేధించడంతో ఇటీవల అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. . చిక్‌మగళూరు, మంగళూరులో ఆందోళనలు జరిగాయి. మ‌రిన్ని చోట్ల‌కు ఇలాంటి వివాదం పాకుతోంది.