Coronavirus : క‌ర్నాట‌క‌లో కొత్త క‌రోనా `ఓమిక్రాన్‌` ద‌డ

క‌రోనా కొత్త వేరియెంట్ `ఓమిక్రాన్ ` క‌ర్నాట‌క రాష్ట్రాన్ని వ‌ణికిస్తోంది. ఎస్డీఎం మెడిక‌ల్ కాలేజిలో 281 కేసులు న‌మోదు కావ‌డంతో ఆ రాష్ట్రం హ‌డ‌లెత్తిపోతోంది.

  • Written By:
  • Updated On - January 19, 2022 / 07:40 PM IST

క‌రోనా కొత్త వేరియెంట్ `ఓమిక్రాన్ ` క‌ర్నాట‌క రాష్ట్రాన్ని వ‌ణికిస్తోంది. ఎస్డీఎం మెడిక‌ల్ కాలేజిలో 281 కేసులు న‌మోదు కావ‌డంతో ఆ రాష్ట్రం హ‌డ‌లెత్తిపోతోంది. కాలేజిలో జ‌రిగిన సాంస్కృతిక ఉత్స‌వం త‌రువాత కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. కానీ, క‌ర్నాట‌క రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుధాక‌ర్ మాత్రం కొత్త వేరియెంట్ ర‌కం కేసులు కాద‌ని స్ప‌ష్టం చేస్తున్నాడు. క‌రోనా కేసులు పెరిగిన‌ప్ప‌టికీ లాక్ డౌన్ దిశ‌గా వెళ్ల‌లేమ‌ని తేల్చేశాడు.ధార్వాడ్ జిల్లాలోని SDM కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 281 ​​కేసులతో కోవిడ్ -19 క్లస్టర్‌గా మారింది. కాలేజికి 500 మీటర్ల వ్యాసార్థంలో పాఠశాలలు మరియు కళాశాలలను మూసివేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేశారు. ఎనిమిది అంబులెన్స్‌లు సిద్ధంగా అక్క‌డ ఉంచారు. కళాశాలకు సందర్శకుల ప్రవేశం పరిమితం చేస్తూ క‌ర్నాట‌క‌ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.దక్షిణాఫ్రికా దేశాల నుంచి కర్ణాటకకు వచ్చిన వ్యక్తులను గుర్తించాలని బెంగళూరు మహానగర మెట్రోపాలిటిన్ యంత్రాంగానికి హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆరు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లను ప్ర‌భుత్వం సిద్ధ చేసింది. ఓమిక్రాన్ నమూనాలు ప‌రీక్షిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ SARS-CoV-2 వేరియంట్ B.1.1.529ని “అత్యంత వ్యాప్తి చెందగల వైరస్‌గా ప్ర‌క‌టించింది. ఓమిక్రాన్ అనే కొత్త కరోనావైరస్ వేరియంట్ దక్షిణాఫ్రికా, హాంకాంగ్, ఇజ్రాయెల్ మరియు బోట్స్వానాలో ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్ వో ప్ర‌క‌టించింది. క‌ర్నాట‌క రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌త్యేక ఆంక్ష‌లు లేవు. వివాహాలు, ఇత‌ర కార్య‌క్ర‌మాలు య‌థాత‌దంగా జరుగుతున్నాయి. భవిష్య‌త్ లోనూ లాక్ డౌన్ విధించే ఆలోచన లేద‌ని మంత్రి సుధాక‌ర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.