Site icon HashtagU Telugu

Chennai Mayor: చెన్నైకి తొలి ఎస్సీ మహిళా మేయర్ ఈమె..!

R. Priya The First Dalit Woman To Become Mayor Of Chennai Imresizer

R. Priya The First Dalit Woman To Become Mayor Of Chennai Imresizer

చెన్నై కార్పొరేషన్‌కి చిన్న‌వ‌య‌సులో మహిళా మేయర్‌గా, ఎస్సీ వర్గానికి చెందిన తొలి మహిళా మేయర్‌గా డీఎంకే నాయ‌కురాలు ఎస్‌ఆర్‌ ప్రియ ఎన్నికై చరిత్ర సృష్టించనున్నారు. తిరువికా న‌గ‌ర్‌లోని 74వ వార్డు నుంచి పోటీ చేసిన 28 ఏళ్ల యువ‌తి గ‌త వారం నుంచి ఈ ప‌ద‌వికి పోటీ ప‌డుతున్న వారిలో ముందున్నారు. గురువారం పార్టీ అధికారికంగా ఆమెను మేయ‌ర్ గా ప్ర‌క‌టించింది. తారా చెరియన్ (1957-58), కామాక్షి జయరామన్ (1971-72) తర్వాత కార్పొరేషన్‌కు మూడవ మహిళా మేయర్‌గా ఆమె నిలిచారు.

ఎస్ ఆర్ ప్రియా తిరువికా నగర్‌లో వార్డు స్థాయి డిఎంకె కార్యకర్త ‘పెరంబూర్’ ఆర్ రాజన్ కుమార్తె. ఈయ‌న డీఎంకేలో 30 ఏళ్లుగా ఉన్నారు. డీఎంకే మాజీ ఎమ్మెల్యే ‘చెంగై’ శివం ఎస్ ఆర్ ప్రియాకు మేన‌మామ‌గా ఉన్నారు. ప్రియా 20 సంవత్సరాల వయస్సులో అధికారికంగా పార్టీలో చేరారని.. కానీ ఆమె చిన్నతనం నుండి త‌న‌ను, ఆమె మేన‌మామ‌ను రాజ‌కీయాల్లో ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం చూసింద‌ని ఆమె తండ్రి రాజ‌న్ తెలిపారు. మేయ‌ర్ గా ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాత నగరంలో నీటి ఎద్దడి సమస్యకు పరిష్కారాలను కనుగొనడం ఆమె జాబితాలోని ప్రాధాన్యతలలో ప్ర‌ధాన‌మైంది. చెన్నైలో పుట్టి పెరిగిన ప్రియ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్ట్స్ కాలేజీ ఫర్ ఉమెన్‌లో ఎంకామ్ పూర్తి చేసింది.

మరోవైపు 169వ వార్డు నుంచి పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి మహేశ్‌కుమార్‌ డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా ఎంపికయ్యారు. తాంబరంలో డిఎంకెకు చెందిన వసంత కుమారి (26) కెమికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, ఆమె కూడా ఎస్సీ వర్గానికి చెందినవారే. ఎన్నికైన తర్వాత కార్పొరేషన్‌కు మొదటి మేయర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆమె తన ప్రధాన ప్రాధాన్యతలలో రోడ్లు మరియు తాగునీటి సౌకర్యాల క‌ల్పించాల‌ని మొద‌టి ప్రాదాన్య‌త‌గా పెట్టుకున్నారు. తాంబరం కార్పొరేషన్ అయినప్పటికీ, చెన్నైలో ఉన్నంత సౌకర్యాలు ఇందులో లేవు. అనకాపుత్తూరు వంటి ప్రాంతాలు నీటి కొరతతో అలమటిస్తున్నాయని ఆమె అన్నారు. మేయర్‌గా మరియు కౌన్సిలర్‌గా కూడా ఇది త‌న‌కు మొదటి అనుభవ‌మ‌ని… తాను ప్రచారం చేసినప్పుడు ప్రజలుత‌న‌ను బాగా ఆదరించారని ఆమె తెలిపారు.

Exit mobile version