Site icon HashtagU Telugu

Hijab Issue : క‌ర్ణాట‌క‌లో `హిజాబ్`మార‌ణాయుధ ద‌డ

Hijab Issue

Hijab Issue

క‌ర్ణాట‌క రాష్ట్రంలో హిజాబ్ వ‌ర్సెస్ క‌షాయ కండువాల మ‌ధ్య వార్ కొన‌సాగుతోంది. ఆ రాష్ట్రంలోని ఉడిపి జిల్లా కుందాపూర్ లో ప్రారంభ‌మైన మ‌తాచారాల ఘ‌ర్ష‌ణ వేగంగా విస్త‌రిస్తోంది. కాలేజిల్లోని హిందూ, ముస్లిం విద్యార్థుల మ‌ధ్య ఎప్పుడు ఎలాంటి ఘ‌ర్ష‌ణ జ‌రుగుతుందోన‌న్న టెన్ష‌న్ అక్క‌డ నెల‌కొంది. కుందాపూర్ ప్ర‌భుత్వ కాలేజి వ‌ద్ద నిర‌స‌న తెలుపుతోన్న విద్యార్థుల వ‌ద్ద మ‌ర‌ణాయుధాలు ల‌భించ‌డంతో క‌ల‌క‌లం బ‌య‌లుదేరింది.
నిర‌స‌న కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ఐదుగురు అనుమానితుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇద్ద‌రిని అరెస్ట్ చేసి వాళ్ల నుంచి మార‌ణాయుధాల‌ను స్వాధీనం చేసుకున్నారు. హ‌త్యాయ‌త్నం,అల్ల‌ర్ల సృష్టించ‌డం, నేర‌పూరిత కుట్ర వంటి అభియోగాల‌తో కేసులు న‌మోదు చేసి ఐదుగురిపై కేసు పెట్టారు. ఈ కేసులో ఇద్ద‌రు అరెస్ట్ కాగా, మ‌రో ముగ్గురు పరారీలో ఉన్నారు. అరెస్టయిన వాళ్ల‌లో రజబ్, (41) మరియు అబ్దుల్ మజీద్ (32) ఉన్నారు. వాళ్ల‌పై ఇప్పటికే ఏడు కేసులు ఉన్న‌ట్టు పోలీసులు గుర్తించారు.

శనివారం కుందాపూర్‌లోని నిరసన ప్రదేశం నుండి కొంతమంది విద్యార్థులు కళాశాల యూనిఫామ్‌లపై కండువాలు ధరించి కళాశాలకు వెళ్లారు. అక్క‌డ ‘జై శ్రీరామ్’ అని అరుస్తున్నట్లు ఉండే వీడియోలు సోష‌ల్ మీడియాలో పెట్టారు. మార్కెట్ ఏరియా దగ్గర గుమిగూడిన కాషాయ వస్త్రాలు ధరించిన నిరసనకారులను పోలీసులు విచ్ఛిన్నం చేసే వీడియోలు కూడా వైర‌ల్ అయ్యాయి. కుందాపూర్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గేట్ల వద్ద 40 మంది విద్యార్థినులు హిజాబ్ ధరించి నిరసన తెలిపారు. కళాశాల సిబ్బంది బాలికలను క్యాంపస్‌లోకి అనుమతించలేదు.రాత్రిపూట హిజాబ్‌లపై నిషేధాన్ని ప్రకటించారు. మతపరమైన ఉద్రిక్తతలను నివారించడానికి, ముస్లిం విద్యార్థులు హిజాబ్ లేకుండా తరగతులకు హాజరు కావాలని కాలేజి యాజ‌మాన్యాలు కోరుతున్నాయి. విద్యార్థులు తరగతులకు హాజరయ్యేటప్పుడు హిజాబ్ లేదా కాషాయ కండువాలు ధరించకూడదని కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర వెల్ల‌డించాడు. ఈ నిరసనలు అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య రాజకీయ వివాదానికి దారితీసింది.