తమిళనాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల టేబుల్ టెన్నిస్ ప్లేయర్ విశ్వదీనదయాళన్ ఆదివారం మరణించాడు. గౌహతి నుంచి షిల్లాంగ్ కు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన జరిగినప్పుడు కారులో ఐదుగురు ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి 83వ సీనియర్ జాతీయ, అంతర్రాష్ట టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లకోసం…తన సహచరులతో కలిసి గౌహతి నుంచి షిల్లాంగ్ ప్రత్యేక వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
ఈ ఘటనలో విశ్వదీనదయాళన్ తోపాటు..డ్రైవర్ కూడా ఘటనా స్థలంలోనే మరణించారు. ఇదే కారులు ప్రయాణిస్తున్న మిగతావారికి తీవ్రగాయాలయ్యాయి. వీరికి చికిత్స అందిస్తున్న వైద్యులు పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ప్రమాదంలో టాక్సీ డ్రైవర్ అక్కడే మరణించగా…విశ్వ చనిపోయినట్లు నార్త్ ఈస్టర్స్ ఇందిరాగాంధీ రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది. మేఘాలయ సర్కార్ సహాయంతో నిర్వాహకులు విశ్వ అతని ముగ్గురు సహచరులను హస్పిటల్ కు తరలించారు. విశ్వ అనేక జాతీయ ర్యాంకింగ్ టైటిళ్లు, అంతర్జాతీయ పతకాలను సాధించాడు.
ఏప్రిల్ 27 నుంచి ఆస్ట్రియాలోని లింజ్ లోజరిగి డబ్ల్యూటీటీ యూత్ కంటెండర్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. విశ్వదీనదయాళ్ మరణం పట్ల మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా సంతాపం తెలిపారు. హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం ప్రకటించారు.