Site icon HashtagU Telugu

BJP MLAs : 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై 6 నెలలు సస్పెన్షన్ వేటు

Bjp Mlas Suspended Karnataka assembly  

BJP MLAs : ‘హనీ ట్రాప్‌’ వ్యవహారంపై  ఇవాళ (శుక్రవారం) కర్ణాటక అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ అంశాన్ని ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు లేవనెత్తడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ‘హనీ ట్రాప్‌’ అంశంపై  సీబీఐ దర్యాప్తు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. శాసనసభ కార్యకలాపాలకు అడ్డుపడిన 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ ఆరు నెలల పాటు  సస్పెండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్‌ చేయడాన్ని విమర్శిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యేలు(BJP MLAs) స్పీకర్‌ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. దీంతో వారి తీరుపై సీఎం సిద్ధరామయ్య ఫైర్ అయ్యారు. కేసు దర్యాప్తు జరిగి, హనీట్రాప్‌లో ప్రమేయం ఉన్నవారి పేర్లు బయటికి వస్తే కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సస్పెండైన ఎమ్మెల్యేలను మార్షల్స్‌ బలవంతంగా అసెంబ్లీ బయటకు తీసుకెళ్లారు. స్పీకర్ జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రకారం.. వేటుకు గురైన సభ్యులు అసెంబ్లీ హాల్‌, లాబీ, గ్యాలరీలలోకి ఆరు నెలల పాటు ప్రవేశించకూడదు. వారు ఏ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కూడా పాల్గొనకూడదు. అసెంబ్లీ ఎజెండాలో వారి పేర్లతో ఎలాంటి అంశం లిస్ట్ కాకూడదు. ఈ సమయంలో వారికి రోజూవారీ భత్యాలు కూడా అందవు.

Also Read :Baba Ramdev: గంగానదిలో స్పీడుగా ఈతకొట్టిన బాబా రాందేవ్.. ఎందుకంటే..

మంత్రుల వ్యాఖ్యలతో దుమారం.. 

Also Read :Viveka Murder case : వివేకా హత్య కేసు.. హైకోర్టులో సునీత పిటిషన్‌