Site icon HashtagU Telugu

Nepal Bus Accident : నదిలో పడిన ప్రయాణికుల బస్సు

14 Killed After Bus From In

14 Killed After Bus From In

శుక్రవారం ఉదయం నేపాల్‌ (Nepal )లో ఘోర ప్రమాదం (Bus Accident) చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది (40 people) భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్లంతా యూపీకి చెందినవారిగా అక్కడి అధికారులు చెబుతున్నారు. బస్సు కూడా యూపీకి చెందినదిగా గుర్తించారు. పొఖారా నుంచి ఖాట్మండు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు నదిలో పడిన సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

అందులో చిక్కుకున్న ప్రయాణికులను బయటికి తీస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మంది ప్రయాణికులు చనిపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖాట్మండు నుంచి పోఖారా వెళ్తున్న యూపీ ఎఫ్‌టీ 7623 నంబర్ ప్లేట్ ఉన్న బస్సు.. మర్స్యంగ్డి నదిలో పడిపోయినట్లు తనహున్ జిల్లా డీఎస్పీ దీప్‌కుమార్ రాయ వెల్లడించారు.

Read Also : Tirumala : శ్రీవారి సన్నిధానంలో గోల్డెన్ బాయ్స్ హల్చల్..భక్తుల చూపంతా వీరి బంగారంపైనే