తమిళనాడులో కల్తీ మద్యం (Spurious Liquor) పలువురు కుటుంబాల్లో విషాదం నింపింది. మంగళవారం రాత్రి పట్టణంలోని స్థానిక కరుణాపురంలో ఓ వ్యాపారి వద్ద కల్తీ మద్యం ప్యాకెట్లు కొంతమంది కొనుగోలు చేయగా.. ఆ కల్తీ మద్యం తాగిన తర్వాత, అందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తలనొప్పి, వాంతులు, వికారం, కడుపు నొప్పి, కళ్ల మంటలు వంటి లక్షణాలు ఎదుర్కోవడం తో వెంటనే కుటుంబ సభ్యులు పలు ప్రవైట్ హాస్పటల్స్ కు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఇప్పటివరకు 13 మంది మరణించారు. ఇక పలువురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెపుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
దీనిపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ మద్యం విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యవహారంపై సీబీ-సీఐడీ విచారణకు స్టాలిన్ ఆదేశించారు. అదే సమయంలో కలెక్టర్ శ్రావణ్‌కుమార్ జతావత్‌పై బదిలీ వేటు వేశారు. కళ్లకురిచ్చి జిల్లా కొత్త కలెక్టర్‌గా ఎంఎస్ ప్రశాంత్‌ను ప్రభుత్వం నియమించింది. అలాగే కళ్లకురిచ్చి ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్పీగా రజత్ చతుర్వేది నియమితులయ్యారు.
ఇక కల్తీ మద్యం తాగిన వారి నుండి రక్త నమూనాలను సేకరించి విల్లుపురం, జిప్మర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపించారు అధికారులు. ల్యాబ్ టెస్టుల్లో మద్యంలో మిథనాల్ అనే విషపదార్థం కలిపినట్లు తేలింది. కేసును క్షుణ్ణంగా విచారించాలని క్రైమ్ బ్రాంచ్- క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం(సీబీసీఐడీ)ని స్టాలిన్ ఆదేశించారు. కొన్నిరోజుల క్రితం, బిహార్‌లో మరోసారి కల్తీ మద్యం కలకలం సృష్టించింది. తూర్పు చంపారన్ జిల్లా పరిధిలో 22 మంది అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. కల్తీ మద్యం తాగడం వల్లే వీరంతా చనిపోయారని స్థానికులు ఆరోపించారు.
Read Also : Chandrababu : రేపు అమరావతి లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు