Kerala Rains: కేరళలో 10 జిల్లాల్లో రెడ్ అలెర్ట్.. భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం!

దేశవ్యాప్తంగా ప్రస్తుతం పలుచోట్లను భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Published By: HashtagU Telugu Desk
Kerala

Kerala

దేశవ్యాప్తంగా ప్రస్తుతం పలుచోట్లను భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికే ఈ భారీ వర్షాల కారణంగా వరదలతో ఎంతోమంది ప్రజలు మరణించారు. కాగా తాజాగా కేరళలో కూడా వరద మరొకసారి పోటెత్తింది. వరదలతో కేరళ అతలాకుతులమవుతోంది. ఈ వరదల కారణంగా తాజాగా మరొక ఆరు మంది మరణించారు. దీంతో మరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 12 కు పెరిగింది. వరదల కారణంగా మరణించిన వారిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉండడం బాధని కలిగించే విషయం. అదేవిధంగా ముగ్గులు జాలర్లు కూడా గల్లంతయ్యారు.

ఇక 11 జిల్లాలకు చెందిన రెండువేలమైంది పైగా సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. పది జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల ప్రజలను అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ విభాగం రెడ్ అలెర్ట్ ను జారీ చేసింది. కాగా కేరళలో పలు ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా ఆస్తి నష్టం సంభవించడంతోపాటు రాష్ట్రంలో 23 ఇళ్లకు పైగా పూర్తిగా ధ్వంసం గాక 71 ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరొకవైపు భారీ వర్షాల కారణంగా ఇడుక్కి,ముళ్ల పెరియార్ డ్యాముల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయిలకు చేరుకుంది. డ్యాములలో నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి అని చీఫ్ సెక్రటరీని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆదేశించారు.

అదేవిధంగా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. అదేవిధంగా భారీ వర్షాలు నేపథ్యంలో శబరిమల యాత్రికులు అంప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పంపానది స్నానాలకు భక్తులకు అనుమతించబోమని కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ తెలిపారు. ఇది వర్షాల కారణంగా నేడు కేరళలో జరగాల్సిన స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. అందుకు సంబంధించిన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.

  Last Updated: 04 Aug 2022, 12:05 AM IST