Site icon HashtagU Telugu

Denied Ambulance: అమానవీయం.. తమ్ముడి మృతదేహాన్ని మోసిన 10 ఏళ్ల బాలుడు!

Dead Body

Dead Body

భారత్ కు స్వాత్రంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు కావోస్తున్న అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓ 10 ఏళ్ల బాలుడు తన రెండేళ్ల సోదరుడి మృతదేహాన్ని చేతులతో మోసికెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ కుమార్ అనే బాలుడు ఆస్పత్రిలోని పోస్టుమార్టం ఇంటి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లిన వీడియోలో చూడొచ్చు. ఢిల్లీ-సహారన్‌పూర్ హైవేలోని బాగ్‌పట్‌లోని రెండేళ్ల బాలుడు అదే పనిగా ఏడుస్తుండటంతో సవతి తల్లి కారు కింద పడేసిందని ఆరోపణలున్నాయి.

చిన్నారిని కొట్టిందని తేలింది. ఈ విషయమై బాగ్‌పత్ సర్కిల్ అధికారి దేవేంద్ర కుమార్ శర్మ మాట్లాడుతూ..  “స్థానికులు మాకు సమాచారం అందించారు. మహిళపై కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశాం. బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రిలోని పోస్ట్‌మార్టం కు పంపాం. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని షామ్లీ జిల్లాలో రోజువారీ కూలీగా పనిచేస్తున్న అతని తండ్రి ప్రవీణ్ కుమార్‌కు అప్పగించాం’’ అని ఆయన చెప్పారు. ప్రవీణ్‌తో పాటు బంధువు రాంపాల్‌, కుమారుడు సాగర్‌ ఉన్నారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని తండ్రి ప్రవీణ్‌ పలుమార్లు ఆరోగ్యశాఖ అధికారిని వేడుకున్నాడు. అయితే వారు అతని అభ్యర్థనను పట్టించుకోకపోవడంతో పదేళ్ల బాలుడు తన తమ్ముడి డెడ్ బాడీని మోశాడు.

Exit mobile version