Site icon HashtagU Telugu

Karnataka BJP MLA: ఎమ్మెల్యేను పిచ్చకొట్టుడు కొట్టారు…10 మంది అరెస్టు..!!

Karnataka (1)

Karnataka (1)

కర్నాటకలోని హులమనే గ్రామస్థులు మదిగెరె ఎమ్మెల్యే కుమారస్వామిని పిచ్చకొట్టుడు కొట్టారు. బట్టలు చింపేశారు. ఈ ఘటనలో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తివివరాలు చూస్తే…ఏనుగుల దాడిలో ఓ మహిళ మరణించింది. దీనిపై ఎమ్మెల్యే స్పందించలేదని ఆ గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. గ్రామస్థుల నిరసన తర్వాత ఎమ్మెల్యే కుమారస్వామి ఘటనస్థలాన్ని సందర్శించారు.

అప్పటికే కోపంతో రగిలిపోతున్న గ్రామస్థులకు ఎమ్మెల్యే వ్యాఖ్యలు మరింత కోపాన్ని తెప్పించాయి. ఏనుగుల బెడదను ఏం చేయలేమని ఎమ్మెల్యే అనడంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేపై దుర్భాలాడుతూ కొట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో రాళ్లతో కొట్టారు. వెంటనే ఎమ్మెల్యేను వేరే వాహనంలో అక్కడి నుంచి తరలించారు పోలీసులు.

గ్రామస్థులపై లాఠీచార్జీ చేశారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.