Jallikattu:మ‌ధురై జ‌ల్లిక‌ట్లులో విషాదం.. ఒక‌రు మృతి, 80 మందికి గాయాలు

సంక్రాంతి సంద‌ర్భంగా తమిళ‌నాడు సంప్ర‌దాయ క్రీడ జ‌ల్లిక‌ట్టు ప్రారంభ‌మైంది. క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య మ‌ధురైలోని అవ‌నియాపురంలో జ‌రిగిన జ‌ల్లిక‌ట్టు కార్య‌క్ర‌మంలో ఒక ప్రేక్షకుడుని ఎద్దు పోడ‌వ‌డంతో చ‌నిపోయాడు. మ‌రో 80 మంది గాయపడ్డారు.

  • Written By:
  • Publish Date - January 15, 2022 / 10:03 AM IST

సంక్రాంతి సంద‌ర్భంగా తమిళ‌నాడు సంప్ర‌దాయ క్రీడ జ‌ల్లిక‌ట్టు ప్రారంభ‌మైంది. క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య మ‌ధురైలోని అవ‌నియాపురంలో జ‌రిగిన జ‌ల్లిక‌ట్టు కార్య‌క్ర‌మంలో ఒక ప్రేక్షకుడుని ఎద్దు పోడ‌వ‌డంతో చ‌నిపోయాడు. మ‌రో 80 మంది గాయపడ్డారు.

అవనియాపురంకు చెందిన 19 ఏళ్ల డి.బాలమురుగన్ ని ఒక్క‌సారిగా ఎద్దు పోడిచింది..దీంతో తీవ్రంగా గాయ‌ప‌డిన యువ‌కుడిని మదురైలోని రాజాజీ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. క‌రోనా మహమ్మారి దృష్ట్యా జ‌ల్లిక‌ట్టు కార్య‌క్ర‌మానికి సందర్శకుల ప్రవేశం లేదు.అయిన‌ప్ప‌టికీ స్థానికంగా నివాసం ఉంటున్న వారు ఈ కార్య‌క్ర‌మం చూడ‌టానికి బుల్ కలెక్షన్ పాయింట్ సమీపంలోని ప్రాంతంలో ఉన్నారు. వారిలో ఎక్కువ మంది మాస్క్‌లు ధరించకుండా..భౌతిక దూర నిబంధనలను సరిగా పాటించలేదు.

ఉదయం 7.30 గంటలకు మధురై ఎంపీ సు. వెంక‌టేష‌న్‌, తమిళనాడు మంత్రులు పళనివేల్ త్యాగ రాజన్, పి.మూర్తి, క‌లెక్ట‌ర్ ఎస్ అనీష్ శేఖ‌ర్ లు ఈ కార్య‌క్ర‌మాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఏడు రౌండ్లలో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో 652 ఎద్దులు పాల్గొన్నాయి. క‌రోనా పరీక్షలో నెగిటివ్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ కార్య‌క్రమానికి నిర్వాహాకులు అనుమ‌తించారు. ఈవెంట్‌లో పాల్గొనేవారికి RT-PCR పరీక్షలు, ఎద్దులకు ఫిట్‌నెస్ పరీక్షలు జరిగాయి.

దాదాపు సాయంత్రం 5. 30 గంటలకు ఈ కార్యక్రమం ముగిసింది. అవనియాపురంకు చెందిన కార్తీక్ 24 ఎద్దులను మచ్చిక చేసినందుకు మొదటి బహుమతిగా కారును గెలుచుకున్నాడు. దేవసహాయంకు చెందిన ఎద్దు ఉత్తమ ఎద్దుగా ఎంపికైంది. దీనికి బహుమతిగా టూ వీల‌ర్ ని అందించారు. ఈ కార్య‌క్ర‌మానికి భద్రత కోసం సరిపడా పోలీసు సిబ్బందిని నియమించారు. రెడ్‌క్రాస్ బృందం గాయపడిన వారికి చికిత్స అందించింది.పశుసంవర్ధక అధికారులు పోటీల్లో పాల్గోనే ఎద్దులను పరిశీలించారు. వేదిక వ‌ద్ద అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలను ఉంచారు.