Virupaksha Review: విరూపాక్ష‌ మూవీ రివ్యూ.. సాయి ధరమ్ తేజ్ కు గట్టి హిట్ పడినట్టేనా?

  • Written By:
  • Publish Date - April 21, 2023 / 12:06 PM IST

చాలా రోజుల తర్వాత మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ (Sai Dharam Tej) నుండి వ‌స్తున్న చిత్రం విరూపాక్ష‌ (Virupaksha). ఈ మూవీపై మెగాభిమానుల్లోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ భారీగా అంచనాలున్నాయి. సాయి తేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత ఆయన నుంచి వస్తున్న మూవీ కావడమే అందుకు కారణం. సాయిధరమ్ తేజ్ , సంయుక్త మీనన్ జంటగా ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దర్శకుడిగా పరిచయం కావడం హైలైట్. ట్రైలర్ (Trailer), లుక్స్ పరంగా ఈ మూవీ మంచి బజ్ సొంతం చేసుకుంది. విరూపాక్ష సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదువాల్సిందే

స్టోరీ
80వ దశకంలో జరిగిన ఈ కథ ఇది. రుద్రవరం (Rudravaram) అనే గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలు ఎంతో భయానకంగా ఉంటాయి. సూర్య గా సాయి ధరమ్ తేజ్ , నందిని గా సంయుక్త మీనన్ క‌నిపిస్తారు. అయితే రుద్ర‌వ‌రం అనే ఊరిలో అనుమానాస్పద మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. చేత‌బ‌డి వ‌ల‌న చ‌నిపోతున్నారా లేక మ‌రేదైన ఇత‌ర కార‌ణాల వ‌ల‌న చ‌నిపోతున్నారా అనే మిస్టరీని సాయి తేజ్ చేదిస్తాడు. ఆ మిస్టరీ డెత్స్ వెనకాల ఎవరున్నారు? ఆ ఊరిని పట్టిపీడుస్తున్న శక్తి ఏంటి? హీరో దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఆ ఊరుప్రజలకు ఎలాంటి విముక్తిని ఇచ్చాడు? హీరోలో ఉన్న పవర్స్ ఏంటనేది ఈ సినిమా క‌థ‌గా చెప్ప‌వ‌చ్చు,

నటీనటుల ప‌ర్‌ఫార్మెన్స్
రూపంలేని కన్నును విరూపాక్ష (శివుడి మూడో కన్ను) అంటారని.. ఈ సినిమాలో రూపంలోని శక్తి (Power)తో పోరాటం చేస్తారు కాబట్టి మూవీకి ‘విరూపాక్ష’ టైటిల్ పెట్టారు. సినిమాలో సూర్యగా సాయిధరమ్‌ తేజ్‌ చాలా కొత్తగా, ఫ్రెష్‌గా కనిపించాడు. ఆయన లుక్, యాక్టింగ్‌ స్టయిల్‌ కూడా కొత్తగా ఉంది. ద‌ర్శ‌కుడు క్రియేట్ చేసిన‌ పాత్రలో పూర్తిగా ఇన్‌వాల్వ్ అయి చేశాడు. చాలా సెటిల్డ్ గా నటించాడు. తేజూకి ఇది మంచి కమ్‌ బ్యాక్‌ (Come Back) మూవీ అని చెప్పాలి. ఇక నందినిగా కనిపించిన సంయుక్త మీనన్‌కి మంచి పాత్ర దక్కింది, ఆమె కూడా సినిమాకి ఓ పిల్లర్‌లా నిలుస్తుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రీ క్లైమాక్స్ లో ఇరగదీసింది. నటులు బ్రహ్మాజీ, సునీల్, రాజీవ్ కనకాల త‌మ పాత్ర‌ల‌కి న్యాయం చేశారు. అఘోరాగా న‌టుడు అజ‌య్ కూడా అల‌రించాడు. దర్శకుడు కార్తీక్‌ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశాడు.. ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేసేలా, కథలో ఇన్‌వాల్వ్ అయ్యేలా సినిమాని రూపొందించాడు. స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంది, అలానే సుకుమార్‌ (Sukumar) స్క్రీన్‌ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంది .

ప్ల‌స్ పాయింట్స్
న‌టీన‌టులు
బీజీఎం
స్క్రీన్‌ప్లే

మైన‌స్ పాయింట్స్:
క్లైమాక్స్
ల‌వ్ స్టోరీ
కొన్ని సాగ‌దీత స‌న్నివేశాలు

ఫైనల్ టచ్

సాయి ధరమ్ తేజ్ కు కమ్ బ్యాక్ మూవీ

Also Read: Tollywood Stars: టాలీవుడ్ స్టార్స్ కు ట్విట్టర్ షాక్.. బ్లూటిక్ మాయం!