Veera Simha Reddy Review: బాలయ్య ‘వీరసింహారెడ్డి’ ఫస్ట్ రివ్యూ!

  • Written By:
  • Updated On - January 12, 2023 / 03:32 PM IST

ఒకరు మాస్ కా బాప్.. మరొకరు మాస్ కమర్షియల్ అంశాలను అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్.. ఈ ఇద్దరు కలిస్తే భారీ అంచనాలు ఏర్పడటం ఖాయమే. మలినేని గోపిచంద్ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా ట్రైలర్స్, సాంగ్స్ కు మొదట్నుంచే ఆకట్టుకోవడంతో మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా ఉండటం వీరసింహారెడ్డిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్యాక్షన్ నేపథ్యంలోనూ రూపుద్దుకోవడం కూడా అందరి ద్రుష్టి ఆకర్షించింది. ఇక అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ మరో ద్విపాత్రాభినయం తర్వాత మరోసారి మాయ చేశాడు.

స్టోరీ ఇదే

వీరసింహా రెడ్డి(బాలకృష్ణ)కు తన చెల్లి భానుమతి(వరలక్ష్మీ శరత్​కుమార్) అంటే ప్రాణం. ఆమె మాత్రం అన్నగారిని అదే పనిగా ద్వేషిస్తూంటుంది. ఆమె భర్త ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్) తో కలిసి పగ సాధించే ప్రయత్నాల్లో ఉంటుంది. అయితే చెల్లెలు తనను ఎంత ద్వేషించినా ప్రతి ఏడాది ఆమెకు పంపాల్సిన సారె పంపుతూనే ఉంటాడు వీరసింహారెడ్డి. అంతేకాక తన బావ ప్రతాప్ రెడ్డి తనను చంపడానికి ప్రయత్నించినప్పటికీ.. చెల్లెలిపై ప్రేమ కారణంగా అతన్ని క్షమించి వదిలేస్తుంటాడు. ఇది గత 30 ఏళ్లుగా జరుగుతూనే ఉంటుంది. ఇదిలా నడుస్తూంటే..మరో ప్రక్క …వీరసింహారెడ్డికి భార్య  మీనాక్షి (హనీ రోజ్), కొడుకు జై సింహారెడ్డి (బాలకృష్ణ) వీటిన్నటికి దూరంగా ఇస్తాంబుల్‌లో జీవిస్తూంటారు. మీనాక్షి ఓ రెస్టారెంట్ నడుపూతూంటే, జై సింహా రెడ్డి ఓ కాలర్ డీలర్ షిప్ తీసుకుంటాడు.

అలాగే ఇషా (శృతీహాసన్)తో ప్రేమ వ్యవహారాలు నడిపిస్తూంటాడు. ఆమె తండ్రి…జై ని మీ నాన్నగారు పెళ్లి మాటలు మాట్లాడటానికి రమ్మనమని అంటాడు. అప్పుడు వీరసింహా రెడ్డి టర్కీలో దిగుతాడు.  అక్కడే కథ అనుకోని మలుపు తిరుగుపతుంది. వీరసింహా రెడ్డి గతం వెంటాడుతుంది.  వీరసింహారెడ్డిని టార్గెట్ చేసి భానుమతి, ప్రతాప్ రెడ్డి దాడి చేస్తారు. అసలు వీళ్లు ఇంతదూరం ఎందుకు వచ్చేసారు. అంతలా అన్నగారిపై చెల్లికి పగకు కారణం ఏమిటి..అసలు ఏమి జరిగింది..చివరకు ఆ పగ చల్లారిందా…ఇషా తో జై సింహా రెడ్డి వివాహం జరిగిందా…వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

దర్శకుడు గోపీచంద్ మలినేని ‘వీరసింహారెడ్డి’ని కూడా తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేశాడు. నందమూరి బాలకృష్ణ తన గత సినిమాల్లో చేసిన పాత్రల తరహాలో ఉన్నప్పటికీ అభిమానులను ఆకట్టుకోవడంలో మాత్రం ముందున్నాడు. ఓవర్-ది-టాప్ యాక్షన్ సీక్వెన్స్‌లు, బాలయ్య పంచ్ డైలాగ్‌లు వీరసింహారెడ్డిలో పుష్కలంగా ఉన్నాయి. బాలయ్య సినిమా నుండి ఆశించే విలక్షణమైన యాక్షన్ బ్లాక్‌లు ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాయి. రెండు పాత్రల్లో హీరో క్యారెక్టరైజేషన్ బాగా పండింది. వీరసింహా రెడ్డిలో కొన్ని బలమైన రాజకీయ డైలాగ్‌లు కూడా ఉన్నాయి. ప్రేక్షకులలో చాలా ఉత్సాహాన్ని నింపాయి. బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్, అతని వంశం గురించి మాట్లాడటం కనిపిస్తుంది. ఆపై, బాలయ్య తనను తాను ప్రశంసించుకున్నాడు. వీరసింహారెడ్డి కథలో కొత్తదనం ఏమీ లేదు. ప్రతీకారం ఒకరి తీర్పును ఎలా కప్పివేస్తుంది అనేది ఈ సినిమాలోని ప్రధాన అంశం. జై (బాలకృష్ణ)కి తల్లిగా నటిస్తున్న హనీ రోజ్‌ని చూసినప్పుడు, తల్లి క్యారెక్టర్ లో ప్రేక్షకులు ఆశించినంతగా నటించలేదు.

శృతి హాసన్ పాత్రను ఎవరైనా చేయగలరు. ఇక కామెడీ సీక్వెన్స్‌లు కూడా పాతవి. పెద్దగా కామెడీ పండలేదు. శృతి హాసన్ పాత్ర అరగంట తర్వాత అదృశ్యమవుతుంది. ఇక వరలక్ష్మి శరత్‌కుమార్‌కు వీరసింహా రెడ్డి సోదరి పాత్రలో కనిపించింది. ఎప్పటిలాగే తనదైన స్టయిల్ నటనను కనబర్చింది. దునియా విజయ్ విలన్ గా కనిపించాడు. అయితే బాలకృష్ణను ఎదుర్కొనే స్థాయిలో నటన ఆయన కనబర్చలేదు.

తమన్ ఈ సినిమాకి సెకండ్ హీరో ని చెప్పాలి. చాలా పేలవమైన సన్నివేశాలను కూడా తనదైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు. ఇక యాక్షన్ సీన్స్ కి తమన్ నేపధ్య సంగీతం తొడవ్వడంతో.. థియేటర్లలో పూనకాలు వచ్చాయి. పాటలు కూడా పర్వాలేదు అనేలా ఉన్నాయి. సాయిమాధవ్ బుర్రా మాటలు చాలా పదునుగా ఉన్నాయి. రాజకీయంగా ఆయన వేసిన పంచ్ డైలాగులకు మాత్రం థియేటర్ రెస్పాన్స్ అదిరిపోయింది. వీరసింహా రెడ్డి అనేది ఆలోచనలతో కూడిన సినిమా. అయితే కథలో సరైన డెప్త్ లేకపోవడం కామన్ ప్రేక్షకులను ఆశించినంత మేరకు మెప్పించలేకపోయింది.

ప్లస్ పాయింట్స్:

బాలకృష్ణ నట విశ్వరూపం

ఫ్యాక్షన్ నేపధ్యం

థమన్ సంగీతం

గోపీచంద్ మలినేని దర్శకత్వం

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు

ఫైనల్ పంచ్ : బాలయ్య బాబు ‘నట విశ్వరూపం’

రేటింగ్ : 3/5