Site icon HashtagU Telugu

Matka Review & Rating : మట్కా రివ్యూ & రేటింగ్

Varun Tej Matka Review & Rating

Varun Tej Matka Review & Rating

Matka Review & Rating మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన మూవీ మట్కా. కరుణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. సినిమాకు జివి ప్రకాష్ మ్యూజిక్ అందించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

బర్మా నుంచి వైజాగ్ వచ్చిన శరణార్ధిగా ఉంటున్న వాసు (వరుణ్ తేజ్) కు ప్రసాద్ (సత్యం రాజేష్) పరిచయం అవుతాడు. ఐతే అక్కడ ఒక గొడవ వల్ల జైలుకి వెళ్లిన అతను రిలీజ్ తర్వాత పూర్ణ మార్కెట్ లో అప్పల్ రెడ్డి (అజయ్ ఘోష్) దగ్గర వర్క్ చేస్తుంటాడు. ఆ తర్వాత కొబ్బరికాయలు అమ్మే వాసు మట్కా కింగ్ ఎలా మారాడు.. అతని జీవితంలోకి సుజాత (మీనాక్షి చౌదరి) ఎలా వచ్చింది. వాసు ప్రయాణంలో సోఫియా (నోరా ఫతేహి) ఎందుకొచ్చింది. వాసు కి సాహుతో ఉన్న వైరం ఏంటి..? చివరకు ఏమైంది అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

మెగా హీరోగా వరుణ్ తేజ్ తాను ఎంచుకున్న కథలు డిఫరెంట్ గా ఉన్నట్టు అనిపించినా స్క్రీన్ ప్లే రొటీన్ అవ్వడం లేదా ఆడియన్స్ కు సరిగా ఎక్కకపోవడం వల్ల విఫలమవుతూ వచ్చాయి. కొత్త ప్రయత్నం చేసినా కూడా వర్క్ అవుట్ కాకపోవడం అన్ లక్కీ అని చెప్పొచ్చు. ఐతే మట్కా విషయంలో మట్కా ఆటని తీసుకుని ఒక వ్యక్తి తాను ఎలా ఎదిగాడు అన్నదే చూపించాడు దర్శకుడు.

సినిమాను ఎక్కడ ఎంగేజింగ్ గా అనిపించేలా చేయలేదు సరికదా సినిమా చూస్తున్నంతసేపు సందర్భాలన్నీ ఆల్రెడీ మనం వేరే సినిమాల్లో చూసినవి అన్నట్టుగా అనిపిస్తాయి. సినిమాలో ప్రతి సీన్ ని మరొక సీన్ తో పోల్చేలా రిఫరెన్స్ లు స్పష్టంగా కనిపిస్తాయి. జీరో నుంచి హీరోగా మారిన వాసు కథగా తెరకెక్కించారు. ఐతే కథ రొటీన్ గా కాకుండా మట్కా ఆట మీద చేశారు.

మిగతా టెంప్లేట్ అంతా కూడా రొటీన్ గా తీసుకెళ్లాడు. పాటలు కూడా అంత ఎంగేజింగ్ గా అనిపించలేదు. కథ కథనాల్లో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది. ఐతే మట్కా విషయంలో దర్శకుడు ముందు నుంచి చూపించిన కాన్ ఫిడెన్స్ చూసి భారీ అంచనాలు పెట్టుకోగా తీరా సినిమా చూసిన వారికి నిరాశ కలిగిందని చెప్పొచ్చు.

సినిమా చూసిన ఆడియన్స్ మట్కా ఆట తప్ప ఇందులో కొత్తగా చెప్పింది ఏముంది అన్నట్టుగా చర్చిస్తున్నారు. ఫైనల్ గా మెగా ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కు కూడా మట్కా థ్రిల్ ఇవ్వలేదు.

నటన & సాంకేతిక వర్గం :

వరుణ్ తేజ్ ఎప్పటిలానే తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. వేరియేషన్స్ అన్ని చాలా బాగా చూపించాడు. ఐతే కథ కథనాల వల్ల అతని శ్రమ వృధా అయినట్టు అనిపించింది. మీనాక్షి చౌదరి జస్ట్ ఓకే అనిపించింది. నోరా ఫతేహి కూడా అంతే.. అజయ్ ఘోష్ సత్య రాజ్ష్, నవీన్ చంద్ర వీళ్లు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే ఏ కిషోర్ బాబు సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు కావాల్సిన మూడ్ కెమెరా వర్క్ తో ఇచ్చాడు. కలరింగ్ బాగుంది. జివి ప్రకాష్ మ్యూజిక్ కూడా ఇంప్రెస్ చేసింది. ఎటొచ్చి డైరెక్టర్ మాత్రం వాటిని సరిగా వాడుకోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

వరుణ్ తేజ్

బిజిఎం

కెమెరా వర్క్

సెట్స్

మైనస్ పాయింట్స్ :

స్టోరీ స్క్రీన్ ప్లే

ఊహాజనితంగా ఉండటం

ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోవడం

బాటం లైన్ :

వరుణ్ తేజ్ మట్కా.. ఆటలో గెలవలేకపోయాడు..!

రేటింగ్ : 2/5