Saakini Daakini Review: శాకిని డాకిని రివ్యూ : కొత్తదనం ఏమీలేదు..అంతా రొటీన్ కామెడీ..!!

  • Written By:
  • Updated On - September 18, 2022 / 08:36 AM IST

శాకిని డాకిని…రెజీనా, నివేద థామస్ లు హీరోయిన్స్ గా యాక్ట్ చేసిన ఈ సినిమాపై మొన్నటి వరకు పెద్దగా అంచనాలు లేవు. కానీ అనుహ్యంగా ఈ మూవీని చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేయడంతో అంచనాలు పెరిగాయి. కొరియన్ మూవీలో ఇద్దరు పురుషులు ఉంటే…తెలుగులో ఇద్దరు హీరోయిన్లతో మల్టీస్టారర్ అవ్వడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ప్రమోషన్స్ తో జనాల్లోకి అంతగా రాకపోయి…మగాళ్లు మ్యాగీలా రెండు నిమిషాల్లో అయిపోతారని రెజీనా చేసిన కామెంట్లతో ఈ సినిమాపై అందరి చూపు పడింది. మరి అంచనాలకు తగ్గట్లు ఈ మూవీ ఉందా..? లేదా ? రివ్యూలో చూద్దాం.

శాకిని డాకిని స్టోరీ:
శాలిని(నివేదా థామస్), దామిని(రెజీనా కసాండ్రా) వీరిద్దరూ కూడా రెండు భిన్న పరిస్థితుల నుంచి వచ్చి తెలంగాణలో పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ క్యాడెట్లుగా చేరతారు. శాలినికి తన జీవితం మీద ఆసక్తి ఉండదు. ఆమె ఎంత సేపు తిండి మీదే ద్యాస పెడుతుంది. దామిని మాత్రం తన పేరేంట్స్ పోలీస్ ఆఫీసర్లు కావడంతో తనను కూడా అనవసరంగా ఈ డిపార్ట్ మెంట్లో చేరుస్తున్నారన్న భావనతో ఉంటుంది. ఎలాగైనా బయటపడి అమెరికాలో చదువుకోవాలన్న ప్రయత్నంలో ఉంటుంది. ఇలా విభిన్న ఆలోచనలు ఉన్న వీరిద్దరికీ ఒకే రూమ్ వస్తుంది. మొదట గొడవలు పడుతుంటారు. తర్వాత వీరి పరిచయం మంచి స్నేహంగా ఏర్పడుతుంది. అలా మంచి ఫ్రెండ్స్ గా మారక ఒక రోజు పబ్ కు వెళ్తారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఒక కిడ్నాప్ జరుగుతుంది. ట్రైనింగ్ లో నేర్చుకున్న కొన్ని మెళకులవలతో ఆ అమ్మాయిని కాపాడానికి ఎంతగానో ప్రయత్నం చేసి విఫలం అవుతారు. మళ్లీ అకాడమీకి చేరుకుని…ట్రైనింగ్ తోపాటు బుర్రకు పనిచెబుతారు. ఎలాగైనా ఆ కిడ్నాప్ ముఠాను పట్టుకోవాలని బయలుదేరుతారు. ఆ కిడ్నాప్ ముఠాను పట్టుకుంటారా…!!ఆడపిల్లలే లక్ష్యంగా ఆ ముఠా కిడ్నాపులు ఎందుకు చేస్తున్నారు…!!వారిని ఏం చేస్తున్నారు…!!ఈ విషయాలన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే.!!

విశ్లేషణ:
తెలుగులో ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఎన్నో ఉన్నాయి. అలాంటిదే ఈ సినిమా కూడా. కానీ కొరియాలో సక్సెస్ గా నిలిచిన ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసారు. అలాని ఎంతో ఎక్స్ పెక్ట్ చేస్తే మాత్రం పొరపాటే. ఎందుకంటే…కొరియా మూవీలో నుంచి కొన్ని పాయింట్స్ తీసుకుని దాన్ని ఇండియన్ నేటివిటీకి తగ్గట్లుగా మార్చుకున్నారు దర్శకుడు. ఫస్ట్ ఆఫ్ అంతా కూడా క్యారెక్టర్స్ గురించి పరిచయం చేయడానికి సరిపోయింది. సెకండ్ ఆఫ్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సెకండ్ ఆఫ్ స్టార్ట్ అయ్యాక స్టోరీలో స్పీడ్ పెరుగుతుందనుకుంటే…అది కూడా నిరాశపరిచింది. అసలు ఫస్ట్ ఆఫ్ పూర్తయ్యే సరిగే…సినిమా పై సదరు ప్రేక్షకుడికి ఎలాంటి ఫీలింగ్ కలగదు. రెండో భాగం సాగదీసినట్లు అనిపిస్తుంది. అందరూ ఊహించినట్లుగా క్లైమాక్స్ కూడా ముగుస్తుంది. రీమేక్ మూవీ కాబట్టి…దానికి తగ్గట్లుగా కథను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు. కానీ కొత్తదనం ఏమీ కనిపించలేదు. ఎప్పటి నుంచో వస్తున్న సినిమాల మాదిరే…ఇది కూడా అనిపించింది. కానీ ఇందులో ఒక పాయింట్ ….దేనికి పనికారు అనుకున్న వాళ్లు అందరి అంచనాలను పక్కనపెడుతూ…పెద్ద ఘనకార్యం చేసి గొప్పతనాన్ని గుర్తించి మెచ్చుకోవడం…ఇది చాలా సినిమాల్లో చూసిందే. ఈ సినిమాలో అదే చూపించారు. మొత్తానికి ఈ మూవీ పాత అవకాయపచ్చకే పోపు యాడ్ చేశారని చెప్పుకోవాలి. చివరిగా సగటు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుందీ ఈ మూవీ..!!!

నటీనటులు:
తెలంగాణ యాసను ఇరగదీసింది శాలిని అలియాస్ నివేదా థామస్. తెలంగాణలో మాట్లాడుతూ ఆకట్టుకుంది. రెజీనా మాత్రం ఎప్పటిలాగే తన పాత్రకు న్యాయం చేసింది. నివేధా థామస్ కు మంచి స్కోప్ దొరికింది కానీ రెజీనాకు అంతంతమాత్రమే. రెజీనాను నివేదా థామస్ చాలా డామినేట్ చేసింది. ఆర్జే హేమంత్, సుదర్శన్ మెప్పించారు. రెండు సీన్లలో కనిపించిన రఘుబాబు నవ్వించే ప్రయత్నం మాత్రం చేశాడు.

టెక్నికల్ టీం:
ఈ మూవీ తీసింది దర్శకుడు సుధీర్ వర్మనేనా అనే అనుమానం తప్పకుండా కలుతుంది. సుధీర్ వర్మ గత సినిమాలు చూసినవారు…ఈ సినిమాపై భారీ అంచనాలతో థియేటర్ కు వెళ్తారు. కానీ సుధీర్ నిరాశపరిచాడు. ఇన్ పుట్ అంతగా లేదు. కొన్ని మార్పులు చేయాల్సింది. కొరియన్ మూవీని తెలుగులో చేయడం మాత్రం బాగుంది. మ్యూజిక్ గురించి మాట్లాడకపోవడం మంచిది. సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్. ఇక రెండోభాగంలో ఎడిటర్ ఇంకొంచెం కష్టపడితే బాగుండేదేమో.

మొత్తానికి…
థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి ఈ వీకేండ్ మంచి ఛాయిస్ ఈ మూవీ. అంత పెద్ద సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండవు కానీ సరదాగా సాగుతూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం ఒకసారి ఈ సినిమా చూడవచ్చు.

రేటింగ్.. 3/5