Gadar 2 Movie Review : దుమ్ము లేపిన సన్నీ డియోల్.. పాకిస్తాన్ జైలు చుట్టూ నడిచిన కథ

  • Written By:
  • Updated On - August 11, 2023 / 02:36 PM IST

Gadar 2 Movie Review : సిక్కు ట్రక్ డ్రైవర్ తారాసింగ్  పాత్రలో సన్నీ డియోల్  నటించిన  “గదర్2” మూవీ ఇవాళ రిలీజ్ అయింది.  2000 సంవత్సరంలో సన్నీ డియోల్, అమీషా పటేల్ నటించిన “గదర్”  చిత్రం అప్పట్లో ఒక సెన్సేషన్ సృష్టించింది. దాని ప్రతిధ్వని ఇప్పటికీ వినిపిస్తుంటుంది. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఉన్న రాజకీయ కుటుంబానికి చెందిన సకీనా (అమీషా పటేల్)  అనే ముస్లిం అమ్మాయితో తారా సింగ్  సాగించిన ప్రేమాయాణం చుట్టూ “గదర్”  మూవీ  స్టోరీ నడుస్తుంది. మళ్ళీ  23 సంవత్సరాల తర్వాత  డైరెక్టర్  అనిల్ శర్మ “గదర్2″తో ముందుకొచ్చారు.  సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించిన ఈ సీక్వెల్ మూవీలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

Also read : Pomegranate Prices: భారీగా తగ్గిన దానిమ్మ పండ్లు, ప్రస్తుత ధరలివే

ఒక కొడుకు, ఒక తండ్రి చుట్టూ నడిచే  కథ

గదర్ 2 మూవీ అనేది ఒక కొడుకు, ఒక తండ్రి చుట్టూ నడిచే  కథ. తారా సింగ్ (సన్నీ డియోల్), అతడి భార్య  సకీనా (అమీషా పటేల్) ప్రశాంతంగా జీవిస్తుంటారు. కట్ చేస్తే.. 17 సంవత్సరాల తర్వాత (1971 సంవత్సరంలో)  కథ కొన్ని మలుపులు తిరుగుతుంది. వారి కొడుకు చరణ్‌జీత్ సింగ్ (ఉత్కర్ష్ శర్మ) పెద్దవాడవుతాడు.  అదే టైంలో (1971 సంవత్సరంలో)  ఇండియా, పాకిస్తాన్ యుద్ధం మొదలవుతుంది.  పాకిస్తానీ సైన్యంతో పోరాడుతుండగా బార్డర్ లో చిక్కుకున్న ఒక ఆర్మీ యూనిట్‌కు సహాయం చేయమని తారా సింగ్ ను భారత ఆర్మీకి చెందిన  లెఫ్టినెంట్ కల్నల్ దేవేంద్ర రావత్ (గౌరవ్ చోప్రా) కోరుతారు. దీంతో తారా సింగ్  సాహసం చేసి భారత ఆర్మీ యూనిట్‌కు మందుగుండు సామగ్రిని అందించడమే కాకుండా శత్రువులతో ధైర్యంగా పోరాడుతాడు.ఈక్రమంలో తారాతో పాటు పలువురు భారతీయ సైనికులు, ట్రక్ డ్రైవర్లను పాకిస్తాన్ సైన్యం(Gadar 2 Movie Review) పట్టుకుంటుంది.

Also read : OMG 2 Movie Review : బాత్రూం ఘటనతో స్టార్ట్.. అక్షయ్ కుమార్ ఎంట్రీతో ఎండ్

పాకిస్తాన్‌ జైలు చుట్టూ.. 

తారా సింగ్ (సన్నీ డియోల్)ను పాకిస్తాన్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో బంధిస్తారు. దీంతో తారా సింగ్ భార్య సకీనా, కొడుకు చరణ్‌జీత్ సింగ్ తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. చరణ్‌జీత్ తన తల్లి పరిస్థితిని చూసి తట్టుకోలేక.. తండ్రిని ఇండియాకు తీసుకురావడానికి  నకిలీ పాస్‌పోర్ట్‌తో పాకిస్తాన్‌కు వెళ్తాడు. అతను గుల్ ఖాన్ (ముష్తాక్ ఖాన్), అబ్దుల్ అలీ (ఎహ్సాన్ ఖాన్)ని కలుస్తాడు. కోట్ లఖ్‌పత్ జైలులోకి చొరబడేందుకు వారి సహాయం కోరతాడు. తమ ప్రణాళికలో భాగంగా.. కుర్బన్ ఖాన్ (ముష్తాక్ కాక్) ఇంట్లో చరణ్‌జీత్ వంటవాడిగా పనిచేస్తాడు. ఈ టైంలో కుర్బన్ కూతురు ముస్కాన్ (సిమ్రత్ కౌర్)కు చరణ్‌జీత్  దగ్గరవుతాడు.  ఎట్టకేలకు జైలులోకి చరణ్‌జీత్ ప్రవేశించడం.. తన చివరి కోరిక ఏమిటో  కొడుకుకు తారా సింగ్ (సన్నీ డియోల్) చెప్పడం చాలా ఎమోషన్ ను పండించేలా ఉంటాయి.

Also read : Jailer Collections: జైలర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. సూపర్ స్టార్ ఊచకోత షురూ..!

30 నిమిషాలు సన్నీ డియోల్ గాయబ్ 

అనిల్ శర్మ డైరెక్షన్ బాగుంది. ఈ సినిమా చాలా పొడవుగా ఉంది. ఈ మూవీ  మొదటి పార్ట్ లో 30 నిమిషాల పాటు సన్నీ డియోల్ కనిపించకపోవడంతో బోరింగ్ గా అనిపిస్తుంది.  సెకండాఫ్ మాత్రం ధూమ్ ధామ్ గా స్టార్ట్ అవుతుంది.  పెర్‌ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే సన్నీ డియోల్ అద్భుతంగా నటించాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఎలక్ట్రి ఫైయింగ్‌గా ఉంది. ఈ వయస్సులో కూడా అతను ఎనర్జిటిక్‌గా నటించడం గ్రేట్.  అమీషా పటేల్ పాత్ర  చాలా తక్కువగా కనిపిస్తుంది. ఉత్కర్ష్ శర్మ తన బెస్ట్ షాట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. సిమ్రత్ కౌర్ చాలా అందంగా ఉంది. ఎహసాన్ ఖాన్, ముస్తాక్ ఖాన్, ముస్తాక్ కాక్ పత్రాలు పర్వాలేదు అనిపించాయి.

సెకండాఫ్ చాలా పొడవు

మీరు ‘గదర్’ మూవీ చూసి ఉండకపోతే .. మళ్ళీ దాన్ని చూడొద్దు. ఎందుకంటే ‘గదర్ 2’ మూవీ మొదట్లో ‘గదర్’ మూవీ  కథ మొత్తం చూపించారు. ఈ సినిమాలో చాలా పాటలు ఉన్నాయి. వాటి నిడివి కూడా చాలా ఎక్కువ. ఇది కథ యొక్క వేగాన్ని పాడు చేస్తుంది. సినిమా సెకండాఫ్ చాలా పొడవుగా ఉన్నట్లు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో చాలా ఛేజ్ సీక్వెన్స్‌లు ఉన్నాయి.  సెకండాఫ్‌లో చాలా బుల్లెట్‌లు పేలడం వల్ల బహుశా సినిమా సౌండ్ తక్కువ చూసి వినాల్సి వస్తుంది.