Sita Ramam Review: ‘సీతారామం’ కంప్లీట్ క్లీన్ అండ్ గ్రీన్ మూవీ!

  • Written By:
  • Updated On - August 25, 2022 / 08:22 PM IST

స్వాతిముత్యంలోని తొలి స‌న్నివేశం గుర్తుందా? గొబ్బెమ్మ‌ల సీను.
ఆ సీన్‌లోనే.. ఆ సినిమా క‌థ మొత్తం ఉంది. ఈ సంగ‌తి విశ్వ‌నాథ్ గారికి కూడా తెలీదు. ఓ జ‌ర్న‌లిస్టు రివ్యూ రాస్తే… ”అవును క‌దా.. నా క‌థేంటో… ఫ‌స్ట్ సీన్‌లోనే చెప్పేశా క‌దా” అనుకొన్నార్ట కె.విశ్వ‌నాథ్.

సీతారామం తొలి స‌న్నివేశం చూసినా నాకు అదే అనిపించింది. ఫ‌స్ట్ సీన్‌లోనే క‌థ మొత్తం చెప్పేశాడు ద‌ర్శ‌కుడు. అదేంటో చెప్పేస్తే.. సినిమా చూసే వాళ్ల‌కు కిక్ ఉండ‌దు కాబ‌ట్టి.. దాచి పెడుతున్నా.ప్రేమ క‌థ‌లంటే.. సీనుకు రెండు మూడు లిప్పు లాక్కులు
క‌థ‌కు అవ‌స‌రం ఉన్నా, లేక‌పోయినా రొమాంటిక్ సీన్లు
‘రావే.. పోరా’ అనిపించే డైలాగులూ – ఈమ‌ధ్య ఇవే క‌నిపిస్తున్నాయి. వాటి మ‌ధ్య `సీతారామం` ప్ర‌త్యేకంగా నిలుస్తుంది. ఎవ్వ‌రూ ఎక్క‌డా త‌ల‌దించుకొనే షాట్‌… ఒక్క‌టంటే ఒక్క‌టీ లేదు. ప్రేమించిన అమ్మాయిని ‘మీరు.. ఏవండీ’ అని పిలుచుకొనేంత సంస్కారం చూపించిన సినిమా `సీతారామం`.

హ‌ను ల‌వ్ స్టోరీలు బాగా తీస్తాడు. కానీ సీన్‌ని ప‌క‌డ్బందీగా, టైట్‌గా చెప్ప‌డంలో తేలిపోతాడు. సెకండాఫ్‌లో దొరికిపోతాడు. ఇవి రెండూ కంట్రోల్ చేసుకుంటే, ఎంత మంచి సినిమా తీయ‌గ‌ల‌డో… సీతారామం నిరూపించింది. స్క్రిప్టుని ఎంత ప‌ర్‌ఫెక్ట్ గా రాసుకొన్నాడో..? సీత‌, అఫ్రిన్ – ఈ రెండు పేర్లతో ఆడిన చిన్న మ్యాజిక్ ఈ సినిమా. ఆ పేర్ల వెనుక క‌థేమిట‌న్న‌ది సినిమా చూసిన వాళ్ల‌కు అర్థం అవుతుంది.
క‌ళ్ల‌తోనే న‌టించే దుల్క‌ర్‌,

న‌వ్వుతో మైమ‌ర‌పించే మృణాల్ – ఈ జంటని చూడ్డానికి రెండు క‌ళ్లూ స‌రిపోవు. సినిమా అంతా ఒక ఎత్తు.. క్లైమాక్స్ మ‌రో ఎత్తు అనిపించింది. ఈమ‌ధ్య కాలంలో.. ఇంత క్లీన్ అండ్ గ్రీన్ సినిమా ఇంకోటి రాలేదు.
నాకైతే న‌చ్చింది.
మీకూ ఇదే ఫీలింగ్ క‌లుగుతుంద‌ని నా న‌మ్మ‌కం!