Site icon HashtagU Telugu

Show Time : షో టైం మూవీ ఎలా ఉందంటే ..!!

Showtime

Showtime

అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రెజెంట్.. స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ గరికిపాటి నిర్మాతగా మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం షో టైం(Show Time ). నవీన్ చంద్ర (Naveen Chandra) హీరోగా కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్న వినూత్నమైన థ్రిల్లర్ చిత్రం జూలై 4న అనగా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాపై నమ్మకంతో గత రెండు రోజులుగా ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి షో టైమ్ తో నవీన్ చంద్ర భయపెట్టాడా లేదా చూద్దాం.

కథ : కథగా చెప్పుకోవానికి ఇది ఒక సింపుల్ లైన్. ఓ ఇంటిలో అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఫ్యామిలీ మొత్తం కూర్చుని సరదగా ముచ్చటించుకుంటుండగా అర్ధరాత్రి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ci లక్ష్మీకాంత్ ( రాజా రవీంద్ర) వార్నింగ్ ఇస్తాడు. అక్కడ సూర్య (నవీన్ చంద్ర), శాంతి ( కామాక్షి భాస్కర్ల ) సీఐ మధ్య వాగ్వాదం జరుగుతుంది. సీఐ లక్ష్మీ కాంత్ ఏదైనా చేస్తాడేమో అని సూర్య బయపడే టైమ్ లో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఈ కేసు నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు. వారికి లాయర్ వరదరాజులు ( VK నరేష్) ఎలా సేవ్ చేసాడు అనేది తెరపై చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ : ఈ కథ మొత్తం ఒక రోజులోనే జరుగుతుంది. సింపుల్ కథను నీట్ గా ప్రెజెంట్ చేసాడు దర్శకుడు మదన్. ఫస్ట్ హాఫ్ కేవలం 45 నిడివితో ముగించి అసలు కథను సెకండ్ హాఫ్ లో స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే కథలో నరేష్ ఎంటర్ అవుతాడో అక్కడి నుండి హిలేరియస్ గా నవ్వించాడు. అదే టీమ్ లో సస్పెన్స్ ను కూడా బాగా హ్యాండిల్ చేసాడు. ఇటువంటి సినిమాలు మలయాళంలో ఎక్కవ వస్తుంటాయి. అలంటి నేపథ్యంలోనే ఒక రూమ్ లోనే సినిమాను ఆసాంతం నడిపించి ఎంగేజ్ చేశాడు దర్శకుడు మదన్. సస్పెన్స్ లో కామెడీ మిక్స్ చేయడంలో డైలాగ్స్ లో పదును చూపిస్తే వర్కౌట్ అవుతుంది. ఆ విషయంలో టీమ్ సక్సెస్ అయింది. గవిరెడ్డి శ్రీనివాస్ డైలాగ్స్ బాగా పండాయి. రాజా రవీంద్ర, నరేష్ మధ్యలో ఉండే ఎపిషోడ్ సినిమాకే హైలెట్. ఇక క్లైమాక్స్ ఊహించిన దానికి బిన్నంగా ఉంటుంది.

నటీనటుల విషయానికి వస్తే నవీన్ చంద్ర ఇలాంటి పాత్రలు కొత్తేమి కాదు. ఆ అనిభావంతోనే ఈజ్ తో చేసేశాడు. VK నరేష్ తనదైన మార్క్ కామెడీతో అదరగొట్టాడు. రాజా రవీంద్ర సైకో పోలీస్ పాత్రతో సినిమాను నడిపించడంలో మేజర్ రోల్ పోషించాడు. కామాక్షి ఉన్నంతలో మెప్పించింది. ఇక జెమిని సురేష్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ పాత్రలో నవ్వించాడు. ఇక శేఖర్ చంద్ర నేపధ్య సంగీతం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్ : హిలేరియస్ గా నవ్విస్తూ.. భయపెట్టే.. షో.. టైమ్.. బాగుంది..3/5