Yashoda Review: యశోద మూవీ రివ్యూ ఇదే.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..?

  • Written By:
  • Publish Date - November 11, 2022 / 12:12 PM IST

సమంత నటించిన యశోద మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. సైన్స్ ఫిక్షన్‌గా సరోగసీ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే యుఎస్‌ ప్రీమియర్స్ చూసిన చాలా మంది ట్విట్టర్‌లో ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. సినిమా తొలి 20 నిమిషాలు కాస్త నిదానంగా వెళ్తున్నట్లు అనిపించినా.. ఇంటర్వెల్‌కి ముందే వచ్చే సీన్స్ చాలా బాగున్నాయని అంటున్నారు సామ్ ఫ్యాన్స్.

కథ: జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద అమ్మాయిలకు డబ్బు ఆశ చూపి సరోగసి తల్లులుగా మారుస్తూ ఉంటారు. సంతానం లేనటువంటి ధనవంతుల కోరికను తీర్చే యంత్రాలుగా వీరిని క్రియేట్ చేస్తారు. ఒక ల్యాబ్ పెద్ద మాఫియాతో డీల్ కుదుర్చుకుంటుంది. ఎంతో మంది యువతులలో దాని వెనుక ఉన్న అక్రమ వ్యాపారం ఏమిటనేది పాయింట్ చేసుకుని సినిమా నడుస్తుంది.

విశ్లేషణ: సరోగసి నేపథ్యంలో రూపొందించిన మూవీ యశోద. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే టీజర్, ట్రైలర్ తో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా యశోద. హరి హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. సరోగసి నేపథ్య కథతో రూపొందిన తెలుగు చిత్రం ఇది.

కొత్త కాన్సెప్ట్, ఫస్టాఫ్ డీసెంట్ మూవీ అంటూ ట్విట్టర్ వేదికగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సరోగసి ఆసుపత్రిలో ఓ మర్డర్ ఇన్వెస్టిగేషన్ తో సినిమా మలుపు తిరుగుతుందని మూవీ చూసిన వారంటున్నారు. ముఖ్యంగా మూవీ ఇంటర్వెల్ కు ముందు వచ్చే 20 నిమిషాల సన్నివేశాలు హైలెట్ అంటున్నారు. ఇక ఇంటర్వెల్ తర్వాత సినిమా థ్రిల్లర్ గా మారిందని.. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాతో సమంత మరోసారి ప్రేక్షకుల మనసు దోచిందని, ఎమోషనల్ థ్రిల్లర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రానికి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్:

– సమంత నటన
– స్క్రీన్ ప్లే
– ఇంటర్వెల్ సీన్స్
– బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

– స్లో స్క్రీన్ ప్లే