Dhamaka Review: రవితేజ ‘ధమాకా’ ఎలా ఉందంటే!

  • Written By:
  • Updated On - December 23, 2022 / 01:10 PM IST

మాస్ మహారాజా రవితేజ (Raviteja) నటించిన (Dhamaka) ‘ధమాకా’ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. యాక్షన్ అండ్ మాస్ అంశాలున్న ట్రైలర్, అంతకుమించి మాస్ బీట్ సాంగ్స్ ఈ మూవీపై ఎన్నో అంచనాలు ఏర్పడేలా చేశాయి. రిలీజ్ కు ముందే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే ఈ రివ్యూ (Review) చదవాల్సిందే!

స్టోరీ ఇదే
సచిన్ ఖేడేకర్ అనే వ్యాపార దిగ్గజం తన వ్యాపార సామ్రాజ్యానికి కొత్త CEOని ప్రకటించడంతోనే ఈ సినిమా కథ మొదలవుతుంది. ఆ తర్వాత స్వామి – ఒక మధ్యతరగతి వ్యక్తి (Raviteja), మరొక నాగరీకమైన రవితేజ డ్యూయల్ ట్రాక్ వెనుక ఎన్నో ట్విస్టులు, ప్రేమలుంటాయి. సినిమాలో రవితేజ ఎనర్జిటిక్ గా నటించాడు. రెండు పాత్రల్లోనూ షార్ప్‌గా కనిపిస్తూ చాలా బాగా ఎంటర్ టైన్ చేశాడు. కాకపోతే రొటీన్ సినిమానే భుజానికెత్తుకున్నాడు. శ్రీ లీల తన పాత్రకు న్యాయం చేస్తూ చక్కగా నటించింది. మాస్ సాంగ్స్‌లో రవితేజతో సమానంగా స్టెప్పులు వేసి మెస్మరైజ్ చేసింది. సచిన్ ఖేడేకర్, రావు రమేష్, జయరామ్, ఇతర ప్రముఖ నటీనటులు తమ తమ పాత్రల్లో నటించారు. ఇక ఈ ధమాకా (Dhamaka) మూవీలో మంచి స్టార్ కాస్ట్ ఉంది.

విశ్లేషణ
రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన కథలో కొత్తదనం ఏమాత్రం లేదు. ఈ సినిమాలో రొటీన్ టచ్ ఉంది. కొన్ని విషయాల్లో స్క్రీన్‌ప్లే చాలా బాగుంది. సినిమా అక్కడక్కడ ట్రాక్ తప్పిన సమయంలో ఎనర్జిటిక్ రవితేజ (Raviteja) తన నటనతో సినిమాను మోశాడు. కాబట్టి, రొటీన్ టచ్ ఉన్నప్పటికీ ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు (Songs) కూడా ఈ మూవీకి అదనపు బలం. ఇప్పటికే ఇందులోని పాటలు జనాల్లోకి వెళ్లాయి. సెకండాఫ్‌లో జింతాక్‌ తో పాటు మరో పాట ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాయి. ఎడిటింగ్ పర్వాలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫ్రేమ్‌లు రిచ్‌గా కనిపిస్తున్నాయి. అక్కడక్కడా కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా డ్యూయల్ రోల్ ట్రాక్‌కి సంబంధించినది. క్లైమాక్స్ వీక్ గా ఉంది. కానీ తగినంత వినోదం, కామెడీ సీన్స్ ఉండటంతో ఓకే అనిపించింది. కమర్షియల్ చిత్రాలలో లాజిక్‌లు పక్కనపెట్టి చూడాల్సిందే మరి. ధమాకా రొటీన్ టచ్‌తో కూడిన సాధారణ కమర్షియల్ ఎంటర్‌టైనర్. కానీ కామెడీ సీన్స్, మాస్ సన్నివేశాలు ఉండటంతో ఓకే అనిపిస్తోంది.

ఫ్లస్ పాయింట్స్ 
రవితేజ మార్క్ నటన
పాటలు బాగున్నాయి.
స్టార్ కాస్ట్

మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ
కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు
క్లైమాక్స్‌ గొప్పగా లేదు.

రేటింగ్: 2.75/5