Site icon HashtagU Telugu

Pushpa 2 Review & Rating : పుష్ప 2 రివ్యూ & రేటింగ్

Pushpa 2 Review & Rating

Pushpa 2 Review & Rating

అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

భన్వర్ సింగ్ ని అవమానించిన పుష్ప రాజ్ పై పగ తీర్చుకోవాలని చూస్తుంటాడు ఎస్పీ భన్వర్ సింగ్ షెఖావత్. అందుకే మారు వేశంలో వెళ్లి ఎర్ర చందనం గ్యాంగ్ ని అరెస్ట్ చేస్తాడు. అది తెలిసిన పుష్ప రాజ్ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ల వాళ్లని విడిపిస్తారు. ఇలా భన్వర్ సింగ్ తో పుష్ప రాజ్ ఫైట్ ఒకవైపు నడుస్తుంటే. సీఎం తో ఫోటో దిగమని చెప్పమని భార్య శ్రీవల్లి చెప్పగా అతను ఫోటో ఇవ్వలేదని సీఎం నే మార్చేయాలని అనుకుంటాడు. దానికి ఎర్రచందనం ని 2000 టన్నుల డీల్ సెట్ చేసుకుంటాడు. అది తెలిసిన భన్వర్ సింగ్ పుష్ప రాజ్ తో ఛాలెంజ్ చేసి దాన్ని పట్టుకోవాలని అనుకుంటాడు. ఇక భన్వర్ సింగ్ సాయంతో మంగళం శ్రీను పుష్ప రాజ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. ఇంతకీ భన్వర్ సింగ్ వర్సెస్ పుష్ప రాజ్ మధ్య ఫైట్ ఎక్కడిదాకా వెళ్లింది..? పుష్ప రాజ్ నెక్స్త్ టార్గెట్ ఏంటి..? పుష్పరజ్ జాతర వేషం ఎందుకు వేశాడు అన్నది సినిమాలో చూడాలి.

విశ్లేషణ :

పుష్ప రాజ్ పాత్రకు కనెక్ట్ అవ్వడం వల్ల అతను ఎంత వైలెంట్ గా ఉంటే ఆడియన్స్ అంత ఖుషి అవుతున్నారు. పుష్ప 1 సూపర్ హిట్ కాగా పుష్ప 2 మీద అంచనాలు పెరిగాయి. ఐతే పుష్ప 2 లో సుకుమార్ కథ ఏమాత్రం చెప్పలేదు. కేవలం అల్లు అర్జున్ మీద సినిమా నడిపించాడు. పుష్ప రాజ్ యాటిట్యూడ్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి.

సినిమాలో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చేశాడు. ఇక సినిమాలో శ్రీవల్లి పాత్ర కూడా హైలెట్ అయ్యింది. గ్లామర్ తో పాటు ఒక సీన్ లో రష్మిక కూడా అదరగొట్టేసింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక రేంజ్ లో ఉండగా. సెకండ్ హాఫ్ జాతర సీన్ వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆ తర్వాత అలా అలా అనిపించినా ప్రీ క్లైమాక్స్ ఫైట్ మరోసారి గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

అల్లు అర్జున్ ఊర మాస్ ఈ సినిమాలో ఆయన ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా చేసింది. ఐతే లెంగ్త్ 3 గంటల 15 నిమిషాల దాకా ఉండటం సినిమాకు కాస్త మైనస్ అయినట్టు ఉంది. అక్కడక్క కొన్ని సీన్స్ ట్రిం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది.

సుకుమార్ అల్లు అర్జున్ మరోసారి పుష్ప మేనియా కొనసాగేలా చేశారు. పుష్ప 2 చివర్లో పుష్ప 3 ర్యాంపేజ్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు.

నటన & సాంకేతిక వర్గం :

అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో అదరగొట్టాడు. అదేంటో పుష్ప రాజ్ పాత్ర ఆయన కోసమే అన్నట్టు పూనకాలు తెప్పించేస్తున్నాడు. శ్రీవల్లి పాత్రలో రష్మిక సూపర్.. శ్రీలీల సాంగ్ జస్ట్ ఓకే. రావు రమేష్, సునీల్, అనసూయ పాత్రలు మెప్పించారు. భన్వర్ సింగ్ షెఖావత్ గా ఫహద్ ఫాజిల్ తన మార్క్ చాటాడు. మిగత వారంతా పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. కుబా సినిమాటోగ్రఫీ సూపర్ అనిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. కథ పెద్దగా చెప్పలేదు కానీ సుకుమార్ స్క్రీన్ ప్లే బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు.

ప్లస్ పాయింట్స్ :

అల్లు అర్జున్

దేవి శ్రీ ప్రసాద్

జాతర ఎపిసోడ్

మైనస్ పాయింట్స్ :

సినిమా లెంగ్త్

బాటం లైన్ :

పుష్ప 2 వైల్డ్ ఫైర్.. గూస్ బంప్స్ ఫర్ అల్లు ఫ్యాన్స్..!

రేటింగ్ : 3/5