PS-1 Review: పొన్నియిన్ సెల్వన్ 1 రివ్యూ.. మణిరత్నం మూవీ ఎలా ఉందంటే?

  • Written By:
  • Updated On - September 30, 2022 / 02:14 PM IST

సినిమా పేరు: పొన్నియిన్ సెల్వన్ 1

దర్శకుడు: మణిరత్నం

నటీనటులు: ఐశ్వర్య రాయ్, త్రిష కృష్ణన్, జయం రవి, చియాన్ విక్రమ్, కార్తీ

రేటింగ్: 2.5 / 5

ఇప్పుడు ఇండియాలో హిస్టారికల్ మూవీస్ హవా నడుస్తోంది. ప్రేక్షకులు బాహుబలి లాంటి సినిమాలకు బ్రహ్మరథం పట్టడమే అందుకు నిదర్శనం.  అయితే డైరెక్టర్ మణిరత్నం అనగానే ప్రేక్షకులు ప్రతిసారి కొత్తదనం ఆశిస్తారు. ప్రస్తుతం చారిత్రత్మక సినిమాలు సందడి చేస్తుండటంతో మణిరత్నం అలాంటి సినిమా తీసి హిట్ కొట్టాలని ప్రయత్నించాడు. ఆ సినిమానే పొన్నియన్ సెల్వన్ 1. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ ను ఎలా తీర్చిదిద్దాడు? విక్రమ్, కార్తీ లాంటి హీరోలు ఏవిధంగా ఆకట్టుకున్నారు? త్రిష, ఐశ్వర్య ఓకే ప్రేమ్ లో కనిపించడం ఎలా ఉంది? అనే విషయాలను తెలుసుకోవాలంటే స్క్రీన్ పై ఈ సినిమాను చూడాల్సిందే..

ఇది 10వ శతాబ్దం కాలం నాటిది. చోళరాజులకు సంబంధించింది. పరాంతక చోళుడుకు ఆదిత్య కరికాలన్, అరుల్ మొలి వర్మన్ కుందవై అనే ముగ్గురు సంతానం. అదిత రాజు బంగారు భవనాన్ని నిర్మిస్తాడు. తండ్రిని బంగారు భవనంలో ఉండాల్సిందిగా కోరుతాడు. మిత్రుడు అయిన వందియతేవన్ సాయంతో కబురు పంపుతాడు. అయితే వెళ్లే దారిలో వందియతేవన్ కదంపూర్ భవనంలో కాసేపు బస చేస్తాడు. అక్కడే చోళ రాజ కోశాధికారి పలువెట్టయ్య కరికాలపై చేసిన కుట్ర గురించి తెలుస్తుంది. పినతండ్రి మధురాంతకన్‌ను గద్దె ఎక్కించేందుకు పలువెట్టయార్ కుట్రలు పన్నుతుంటాడు. ఆ పథకం ప్రకారమే.. కదంబూర్‌లోని భవనంలోకి ఆదిత్య కరికలన్‌ను రప్పించి హత్య చేస్తారు. ఈ హత్య నేరం వందియతేవన్‌పై ప‌డ‌గా,అత‌ను ఆ స‌మ‌స్య నుండి ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాడు. వందియతేవన్, కుందవై మధ్య లవ్ ట్రాక్ ఏంటి అనేది థియేట‌ర్ లో చూడాల్సిందే.

న‌టీన‌టుల పర్‌ఫార్మెన్స్

విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్ కీలక పాత్రల్లో న‌టించ‌గా, వారి వారి పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా విక్ర‌మ్ న‌ట‌న అదిరిపోయింద‌ని అంటున్నారు. ప‌దో శ‌తాబ్ధం కాలం న‌టి గెట‌ప్ లో అద్భుతంగా క‌నిపించ‌డ‌మే కాక న‌ట‌న‌తోను ఇంప్రెస్ చేశాడు విక్ర‌మ్. మిగ‌తా న‌టీనన‌టులు కూడా పోటీ ప‌డి న‌టించారు. పజువూరు రాణి అయిన నందిని (ఐశ్వర్య రాయ్ బచ్చన్)కు కొన్ని లేయర్డ్ పోర్షన్‌లు ఉన్నాయి. ఆమె క్లాస్సి పెర్ఫార్మెన్స్ అభిమానులను ఆకట్టుకుంది. త్రిష పాత్ర కూడా అందరికీ నచ్చుతుంది. ఈ మూవీ తెలుగు వర్షన్ కు చిరంజీవి వాయిస్ ఓవర్‌ ఇచ్చారు. ఎఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ గా నిలిచింది.

పస్ట్ పాయింట్స్
విక్రమం, ఐశ్వర్య వంటి భారీ స్టార్‌ కాస్ట్‌
మణిరత్నం మార్క్ డైరెక్షన్
రెహమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్,
చిరు వాయిస్ ఓవర్

మైనస్ పాయింట్స్
కొన్ని యుద్ధభూమిలో జరిగే సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోలేదు.
రెహామన్ మ్యూజిక్ అక్కడక్కడ గతి తప్పుతుంది
తెలుగు నేటివిటికీ తగ్గట్టుగా పాటలు లేకపోవడం, సినిమా మొత్తం తమిళ్ తగ్గట్టుగానే ఉంది.

బాహుబలిని, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని చూసిన కళ్ళతో ఈ సినిమా చూస్తే నిరాశకు గురికావాల్సిందే.