PAPA Review: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ రివ్యూ.. నాగశౌర్య మెప్పించాడా!

  • Written By:
  • Updated On - March 17, 2023 / 05:24 PM IST

యూత్ లో నాగశౌర్యకు మంచి రెస్పాన్స్ ఉంది. అదే సమయంలో అవసరాల శ్రీనివాస్, శౌర్య కాంబినేషన్ అనగానే ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీతో నాగశౌర్య తన మ్యాజిక్ రిపీట్ చేశాడా? మళ్లీ హిట్ కొట్టాడా? అనేది తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.

స్టోరీ ఏంటంటే..

ఒకే కాలేజీలో కొత్తగా చేరిన సంజయ్ (నాగశౌర్య)కు అనుపమ కస్తూరి (మాళవిక నాయర్) సినీయర్ ఫస్ట్ ఇయర్‌లో చేరిన సంజయ్‌ను సీనియర్ల ర్యాగింగ్ చేస్తుండటంతో అనుపమ ఆదుకొంటుంది. అలా ఏర్పడిన పరిచయం వారిని మరింత దగ్గర చేస్తుంది. ఇంజినీరింగ్ తర్వాత మాస్టర్ కోసం యూకేకు వెళ్లిన అనుపమ, సంజయ్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. అయితే చిన్న కారణంగా వారిద్దరి మధ్య మనస్పర్ధుల ఏర్పడి ఒకరికొకరు దూరం అవుతారు.

సీనియర్ అయిన అనుపమ ఏ పరిస్థితుల్లో సంజయ్‌కు దగ్గరైంది? సంజయ్, అనుపమ మధ్య స్నేహం ఎలా ప్రేమగా మారింది. ఏ కారణంగా సంజయ్‌కి అనుపమ దూరమైంది. ఎలాంటి పరిస్థితుల్లో అనుపమకు గిరి (అవసరాల శ్రీనివాస్) దగ్గరయ్యారు. సంజయ్ జీవితంలోకి వచ్చిన పూజ (మేఘా చౌదరి) నీలిమా (సింగర్ హరిణి) జర్నీ ఎలా సాగింది? చివరకు అనుపమను సంజయ్ పెళ్లి చేసుకొన్నాడా? వారిద్దరి మధ్య మనస్పర్థలు తొలిగిపోయాయా? గిరి లవ్ ప్రపోజల్‌‌ను అనుపమ అంగీకరించిందా? గిరి, అనుపమ, సంజయ్ మధ్య సాగిన ముక్కోణపు ప్రేమకథకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమా కథ.

సినిమా ఎలా ఉందంటే

పాప సినిమా కథ ఫన్, రొమాంటిక్ అంశాలతో సరదాగా మొదలవుతుంది. సంజయ్ జీవితంలో చోటు చేసుకొన్న ఓ కీలక సంఘటన అనుపమ, సంజయ్ కథకు ఓ టర్నింగ్ పాయింట్ మారి.. కథను ఫీల్ గుడ్‌గా ముందుకు తీసుకెళ్తుంది. కథలో వైవిధ్యం లేకపోవడం, ఎమోషన్స్ పెద్దగా పండకపోవడం, సీన్లు చాలా స్లో, రెగ్యులర్‌గా సాగడంతో మరీ సాగదీసినట్టుగా ఉంటుంది. స్టోరిలో బలమైన పాయింట్‌ ఉన్నప్పటికీ.. పూర్తి కథగా విస్తరించడంలో లోపాలు కనిపిస్తాయి. ఓ ఎమోషన్ పాయింట్ ఫస్టాఫ్ ముగిసినప్పటికీ.. ఆ తర్వాత స్టోరి టేకాఫ్ కాలేకపోయిందనిపిస్తుంది. కానీ చివర్లో కథ సాగడానికి కారణమైన ముగింపు పాయింట్ బాగుంది. కానీ చివరకు అంతసేపు లాగదీసి చెప్పడే కరెక్ట్ కాదనిపిస్తుంది.

నటీనటుల ఫర్మామెన్స్

నటీనటులు విషయానికి వస్తే.. నాగశౌర్య గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకొన్న యాక్టర్. సంజయ్ పాత్రలో మరోసారి ఓదిగిపోవడమే కాకుండా ప్రతీ సన్నివేశంలో వైవిధ్యాన్ని చూపించేందుకు ప్రయత్నించాడు. అలాగే గెటప్ పరంగా ఆకట్టుకొన్నాడు. మాళవిక నాయర్ మరోసారి అనుపమగా ఎమోషనల్ పాత్రలో నటించి మెప్పించింది. కీలక సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకొంటుంది. సంజయ్ ఫ్రెండ్‌గా నటించిన వాలైంటెన్ సినిమాను వినోదభరితంగా మార్చారు. మిగితా పాత్రల్లో నటించిన వారు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. అయితే సినిమాలో ల్యాగ్ ఎక్కువగా ఉండటం మైనస్ గా చెప్పవచ్చు.