Payal Rajput: ర‌క్ష‌ణ మూవీ రివ్యూ

  • Written By:
  • Updated On - June 7, 2024 / 09:08 PM IST

సినిమా పేరు : రక్షణ

విడుదల తేదీ : జూన్ 07, 2024

తారాగణం: పాయల్ రాజ్ పుత్, శివన్నారాయణ, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాలా

దర్శకత్వం, నిర్మాత: ప్రదీప్ ఠాకూర్

తెలుగులో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ పాయ‌ల్ రాజ్ పుత్‌.. ఆర్ ఎక్స్ 100, మంగ‌ళ‌వారం సినిమాల‌తో త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ ర‌క్ష‌ణ అనే మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే ఈ రివ్యూ చ‌దువాల్సిందే..

కథ: కిరణ్ (పాయల్ రాజ్‌పుత్)కు ప్రియా అనే స్నేహితురాలు ఉంటుంది. ఆమె చదువుల్లో టాపర్ కావడంతో హయ్యస్ట్ ప్యాకేజీతో ఉద్యోగం వస్తుంది. కానీ ఆమె తెలియని కారణాలతో పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంటుంది. అది సూసైడ్ కాదని, ఎవరో మర్డర్ చేశారని కిరణ్ నమ్ముతుంది. ఇక ఏపీసీగా ఛార్జ్ తీసుకోక ముందే ఆ కేసు గురించి రీసెర్చ్ చేస్తుంది. కానీ అది సూసైడ్ అని పోలీసులు కేసుని క్లోజ్ చేస్తారు. ఏసీపీగా కిరణ్ ఛార్జ్ తీసుకున్న తరువాత.. ఆమెకు సవాళ్లు ఎదురవుతుంటాయి. నగరంలో అమ్మాయిలు హతం అవుతుంటారు. కానీ అవన్నీ యాక్సిడెంట్లు, సూసైడ్‌ కేసులుగా క్లోజ్ అవుతుంటాయి. అయితే పాయ‌ల్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది? మ మిస్ట‌రీ వ్య‌క్తికి ఎలా బుద్ధి చెబుతుంది? అనే విష‌యాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతాయి.

ప్లస్ పాయింట్స్: చాలా వరకు సీరియల్ కిల్లర్ సినిమాలు నేరాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియజేయడంలో విఫలమవుతున్నాయి. కానీ ఇక్కడ రక్షణలో ప్రతినాయకుడి పాత్రను నీట్ గా డిజైన్ చేశారు. విలన్ లక్షణాలు మనకు తగినంతగా కనిపిస్తాయి. పాయల్ రాజ్ పుత్ రెగ్యులర్ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ పోలీస్ గా చాలా బాగానే నటించింది. ఆమె బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్  చాలా బాగుంటాయి. వినోద్ బాలా పాయల్ కు మంచి సపోర్ట్ ఇస్తాడు. మానస్ తన ఆకట్టుకునే నటనతో తనదైన ముద్ర వేస్తాడు. మరో ముఖ్య పాత్ర పోషించిన రోషన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.

సాంకేతిక అంశాలు: మహతి స్వర సాగర్ తన music స్కోర్ తో కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ తో ఆటక‌ట్టుకుంటాడు.  అనిల్ బండారి విజువల్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. దర్శకుడు ప్రదీప్ కథ విషయంలో మంచి ప్రయత్నం చేసాడు. ఫస్ట్ హాఫ్ చాలా డల్ గా గా ఉన్న సినిమా అయితే బాగుటుంది. మొత్తమ్మీద రక్షణ అనేది క్రైమ్ థ్రిల్లర్. కొన్ని సన్నివేశాల్లో మాత్రమే మన దృష్టిని ఆకర్షించగలిగింది. పాయల్ రాజ్ పుత్ పాత్ర బాగుందని అంటున్నారు.

రేటింగ్ : 2.75/5