OMG 2 Movie Review : బాత్రూం ఘటనతో స్టార్ట్.. అక్షయ్ కుమార్ ఎంట్రీతో ఎండ్

  • Written By:
  • Updated On - August 11, 2023 / 02:37 PM IST

OMG 2 Review: శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించిన  ఓఎంజీ 2 (OMG 2) మూవీ ఇవాళ రిలీజ్ అయింది. 2012 లో రిలీజ్ అయిన “ఓ మై గాడ్” మూవీ సీక్వెల్ గా వచ్చిన ఈ  సినిమా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ దగ్గర అనుమతి పొందడానికి చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది. సెన్సిటివ్ కాన్సెప్ట్, వివాదాస్పద కథాంశంతో తెరకెక్కడంతో ఈ మూవీకి  క్లియరెన్స్ ఇవ్వడానికి ముందు రివిజన్ కమిటీకి పంపించారు. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకొని పూర్తి పర్మిషన్ తో ఓఎంజీ 2  ఆగస్టు 11న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. 2012 లో రిలీజ్ అయిన “ఓ మై గాడ్” మూవీకి, ఓఎంజీ 2  మూవీకి కామన్ పాయింట్ తండ్రులు తమ కొడుకుల కోసం సమాజంపై చేసే యుద్ధమే కావడం గమనార్హం.  సన్నీ డియోల్ అమీషా పటేల్ కాంబినేషన్లో వచ్చిన గదర్ 2 మూవీతో ఇప్పుడు ఓఎంజీ 2 (OMG 2 Movie Review) తలపడుతోంది.

Also read : MLC Kavitha: నిజామాబాద్ లోక్‌సభ బరిలో కల్వకుంట్ల కవిత, తేల్చేసిన కేసీఆర్ కూతురు!

అక్షయ్ పాత్ర కంటే పంకజ్ పాత్రే ఎక్కువ కనిపిస్తుంది

ఓఎంజీ 2లోని స్టోరీ  విషయానికి వస్తే.. ఇందులో అక్షయ్ కుమార్ పాత్ర కంటే పంకజ్ త్రిపాఠి క్యారెక్టర్ చాలా  ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మూవీలో కాంతి శరణ్ ముద్గల్ అనే పాత్రను పంకజ్ త్రిపాఠి పోషించాడు. ఒక బాధ్యతాయుతమైన తండ్రి గా, కుటుంబం కోసం పాటుపడే వ్యక్తిగా, గొప్ప శివ భక్తుడిగా కాంతి కనిపిస్తాడు. ఒకరోజు కాంతి కొడుకు వివేక్ స్కూల్ బాత్రూంలో అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డాడన్న ఆరోపణతో అతని స్కూల్ నుంచి రస్టికేట్ చేస్తారు. అతను చేస్తున్న పనిని వీడియో కూడా తీసి రిలీజ్ చేయడంతో.. దాన్ని అందరూ చూస్తారు. దీంతో ఊరును  వదిలి వెళ్లిపోవాలని కాంతి  నిర్ణయించుకుంటాడు.

Also read : Viral Video : చెన్నై వీధుల్లో బాలిక ఫై ఆవు దాడి..చూస్తే హృదయం తరుక్కుపోతోంది

ఈశ్వరుడి నిర్ణయంతో కొత్త మలుపు..  

ఊరు వదిలి వెళ్లిపోవాలని కాంతి నిర్ణయించుకున్న టైంలో.. అతడి జీవితాన్ని గాడిన పెట్టాలని ఈశ్వరుడు నిశ్చయించుకుంటాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈక్రమంలో అక్షయ్ కుమార్ ను కాంతి  కాలుస్తాడు. అవగాహన లోపం, తప్పుడు సమాచారం కారణంగా తన కొడుకు విషయంలో ఇలా జరిగిందని గుర్తించి రస్టికేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోర్టుతో కాంతి కోర్టులో పిటిషన్ వేస్తాడు. అక్కడ నుంచి కథ మొత్తం ఫస్ట్ పార్ట్ లాగే కంటిన్యూ అవుతుంది. ఇందులో ప్రస్తుత స్కూలింగ్ వ్యవస్థ , యువత ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎంతో స్పష్టంగా ప్రశ్నిస్తారు. సెక్స్ ఎడ్యుకేషన్ యొక్క ఆవశ్యకతపై కూడా  ప్రశ్నలను సంధిస్తారు.

ఏయే పాత్రలో ఎవరెవరు ? 

కాంతి శరణ్ ముద్గల్ తరఫున వాదించేందుకు లాయర్లు ఎవరూ ముందుకు రారు. దీంతో అతడు తన కేస్ ను తానే వాదించుకుంటాడు. శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ పక్కనే ఉండి అతడికి  గైడ్ చేస్తుంటాడు. అయితే దీన్ని చక్కగా చూపించారు. హీరోయిన్ యామి గౌతమ్ ధర్ .. కామిని పేరుతో న్యాయవాది పాత్రను పోషించారు. ఈ మూవీలో కంజి లాల్జీ మెహతా అనే పాత్రను పరేష్ రావల్ పోషించాడు. దేవుడి మీద నమ్మకం లేని  వ్యక్తిగా అతడిని చూపించారు. కాంతి భార్య ఇందుమతిగా గీతా అగర్వాల్ శర్మ చక్కగా నటించారు. రాముడి పాత్రలో చాలా ప్రజాదరణ పొందిన అరుణ్ గోవిల్ కఠినమైన పాఠశాల ప్రిన్సిపాల్‌గా యాక్ట్ చేశారు. మొత్తం మీద ఓ సెన్సిటివ్ టాపిక్ ని టచ్ చేస్తూ దూసుకొస్తున్న ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూద్దాం.