Site icon HashtagU Telugu

Spy Review: నిఖిల్ మరో హిట్ కొట్టాడా.. ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే!

Nikhil Siddhartha Spy Trailer Released Rana Guest Appearance thrilled

Nikhil Siddhartha Spy Trailer Released Rana Guest Appearance thrilled

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నిఖిల్ సిద్దార్థ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమా సినిమాకు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నిఖిల్ తాజా యాక్షన్ థ్రిల్లింగ్ స్పై ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దూకుడు మీదున్న నిఖిల్ మరో హిట్ కొట్టాడా? అనేది తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదువాల్సిందే.

స్టోరీ ఏంటంటే?

విజయ్ (నిఖిల్) ఒక అండర్ కవర్ ఏజెంట్, తన అన్న ఏజెంట్ సుభాష్ (ఆర్యన్ రాజేష్) ని ఎవరు చంపారో తెల్సుకోవాలని ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో విజయ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఖాదిర్ ఖాన్ , అతను చేసే మారణహోమం ని అడ్డుకొని, అతడిని ఇండియా ప్రభుత్వానికి అప్పచెప్పే మిషన్ విజయ్ కి వస్తోంది. తన అన్నయ్య సుభాష్ కూడా ఈ మిషన్ లోనే పాల్గొని చనిపోయాడని తెలుస్తోంది. ఇంతకీ సుభాష్ ని ఎవరు చంపారు ?, అలాగే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కి సంబంధించి మిస్ అయిన ముఖ్యమైన ఫైల్ ఏమిటి ? ఇంతకీ, విజయ్ తన టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేశాడా? లేదా ? అనేది తెరపై చూడాల్సిందే

బలాలు

నిఖిల్ సిద్ధార్థ్ తన గత చిత్రాలు కంటే భిన్నంగా ఉగ్రవాద నేపథ్యంలో ఈసారి యాక్షన్ మైండ్ గేమ్ డ్రామాతో స్పై గా వచ్చాడు. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ తన లుక్స్ లో అండ్ యాక్షన్ లో ఫ్రెష్ నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా రా ఏజెంట్ గా నిఖిల్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఐశ్వర్య మీనన్ తో నడిచే ప్రేమ సన్నివేశాలు మరియు కొన్ని సీన్స్ లో వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ఇక రచయిత కె రాజశేఖర్ రెడ్డి రాసుకున్న మెయిన్ పాయింట్, కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. నిఖిల్ – అభినవ్ గోమఠంకి మధ్య వచ్చే కొన్ని పంచ్ లు కూడా కొన్ని చోట్ల నవ్విస్తాయి. అతిధి పాత్రలో రానా దగ్గుబాటి మెప్పించాడు. హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్ అలరించింది. విలన్ గా నటించిన జిషు సేన్ గుప్తాతో పాటు సాన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

బలహీనతలు

సినిమాలో తీసుకున్న మెయిన్ పాయింట్ బాగున్నా.. ఈ స్పై లో పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యూలర్ మరీ లాజిక్స్ లేకుండా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిదంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక ఖాదీర్ ఖాన్ అనే టెర్రరిస్ట్ చుట్టే కథను మొత్తం చుట్టేయడం..అలాగే సినిమాలో చైనా – ఇండియా మధ్య జరిగే అటాక్ సీన్స్ కూడా ఏమీ బాగాలేదు. నిజానికి సినిమాలో కొన్ని సోషల్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో చాలా చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రస్ట్ అంశాలు ఉన్నప్పటికీ.. నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తోంది. సినిమాలో ఉన్న ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ పై ఎక్కువ వర్క్ చేయాల్సింది.

నిఖిల్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రమే

మంచి అంచనాల మధ్య పక్కా యాక్షన్ డ్రామాతో స్పై గా వచ్చిన నిఖిల్, తన యాక్టింగ్ అండ్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. అయితే.. సినిమాలో సింపుల్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్ తో సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.

Also Read: Hardik Pandya Trolling: రెచ్చిపోయిన పాండ్యా భార్య, రెండో బిడ్డకోసం ప్రాక్టీస్ అంటూ నెటిజన్స్ ట్రోలింగ్!

Exit mobile version