Nenu Student Sir Review: ఈ స్టూడెంట్ ప్రేక్షకులను మెప్పించాడా!

  • Written By:
  • Updated On - July 14, 2023 / 12:38 PM IST

తండ్రి పేరున్న నిర్మాత, అన్న కమర్షియల్ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి మాస్ హీరోగానే గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ బెల్లంకొండ గణేశ్ మాత్రం తనకు తగ్గ కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే స్వాతిముత్యం సినిమాతో మెప్పించిన గణేశ్ నేను స్టూడెంట్ సర్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకొచ్చాడు. స్టూడెంట్ గా నటించిన బెల్లంకొండ ప్రేక్షకులను మెప్పించాడా? అంటే ఈ రివ్యూ చదువాల్సిందే.

కథ

సుబ్బు (గణేష్ బెల్లంకొండ) ఓ కాలేజ్ స్టూడెంట్ కాగా తాను ఎప్పుడు నుంచో ఓ మంచి ఐఫోన్ కొనుకోవాలని అనుకుంటాడు. అలా ఫైనల్ గా తాను కస్టపడి సంపాదించిన డబ్బుతో అయితే ఐఫోన్ 12ని కొనుకోగా ఈ ఫోన్ కొన్నాక దాని వల్ల ఊహించని విధంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అంతే కాకుండా తన బ్యాంక్ అకౌంట్ లో భారీ అమౌంట్ కూడా పడడం తో తన చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తుంది. మరి ఇలాంటి సమస్య నుంచి తాను ఎలా బయట పడతాడు? ఇంతకీ దీని వెనుక ఉన్నది ఎవరు అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్

మెయిన్ గా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో కాన్సెప్ట్ ఒకింత ఆసక్తిగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీ కాలంలో ఫైనాన్సియల్ గా స్కామ్ లు ఎలా జరుగుతున్నాయి అనే అంశం సినిమాలో బాగా చూపించారు. అలాగే దీని అనుగుణంగా చూపించిన మెసేజ్ కూడా ఆకట్టుకుంది. నటుడు సునీల్ పాత్రతో ఇచ్చిన ఎండింగ్ కూడా బాగుంది. ఇక గణేష్ బెల్లంకొండ తన మొదటి సినిమా కంటే ఇందులో బెటర్ గా తనని తాను ప్రెజెంట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది అని చెప్పాలి. ఓ యంగ్ ఇనోసెంట్ స్టూడెంట్ గా అయితే సెన్సిబుల్ పెర్ఫామెన్స్ ని తాను ఈ చిత్రంలో కనబరిచాడు. అలాగే క్లైమాక్స్ లో తన నటనలో మరింత పరిణితి కనబరిచాడు.

 మైనస్ పాయింట్స్

ఈ థ్రిల్లర్ లో కాన్సెప్ట్ స్క్రీన్ ప్లే బాగానే ఉన్నా అసలు సమస్య ఫస్టాఫ్ లో ఉందని చెప్పాలి. ఈ మొదటి సగం కాస్త బోరింగ్ గా సాగదీతగా అనిపిస్తుంది. మెయిన్ గా మెయిన్ లీడ్ మధ్య ఉన్న లవ్ ట్రాక్ ఏమంత గొప్పగా అనిపించదు. దీంతో ఆడియెన్స్ కి అయితే చికాకు తెప్పించవచ్చు. ఇక సినిమాలో మరో పెద్ద బ్లండర్ ఏమిటంటే కొందరు నటీనటులకు వారిపై సీన్స్ లో వారి నటనకి వినిపించే డబ్బింగ్ కి అసలు సింక్ కూడా ఉండదు అంత జాగ్రత్తగా మేకర్స్ సినిమాని తెరకెక్కించారు. అలాగే సినిమా మెయిన్ కాన్సెప్ట్ లోకి వెళ్ళడానికి సెకండాఫ్ లో కూడా సమయం ఎక్కువే తీసుకున్నారు. ఇంకా కొన్ని లాజిక్స్ కూడా బాగా మిస్ అయ్యాయి.

టెక్నికల్ అంశాలు

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే టెక్నికల్ టీం లో అయితే మహతి స్వర సాగర్ సంగీతం బాగుంది. అలాగే తన మాయే మాయే సాంగ్ విజువల్ గా బాగుంది. ఇక అనిత్ సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ గా ఉంది. ఇంకా ఎడిటింగ్ వర్క్ బాగాలేదు, సినిమాలో డైలాగ్స్ కూడా బెటర్ చేయాల్సింది. డబ్బింగ్ లో జాగ్రత్తలు లేవు. ఇక దర్శకుడు రాఖి ఉప్పలపాటి విషయానికి వస్తే.. తాను ఈ థ్రిల్లర్ ని పూర్తి స్థాయిలో హ్యాండిల్ చేయలేకపోయారని చెప్పాలి. సినిమాలో మంచి థీమ్ ఉన్నప్పటికీ కూడా దానిని చాలా అనవసర సన్నివేశాలతో నింపేసి చాలా సమయాన్ని వేస్ట్ చేశారు. బెటర్ సీన్స్ ని ఈ థ్రిల్లర్ డ్రామాలో ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. కరెక్ట్ నరేషన్, స్క్రీన్ ప్లే గాని పడి ఉంటే ఈ సినిమా అవుట్ పుట్ మరింత బెటర్ గా వచ్చి ఉండేది.

సినిమా ఎలా ఉందంటే..

మొత్తంగా చూసినట్టు అయితే ఈ “నేను స్టూడెంట్ సర్” లో మంచి కాన్సెప్ట్ అండ్ మెసేజ్ కనిపిస్తాయి అలాగే యంగ్ హీరో బెల్లం కొండ గణేష్ మంచి నటనను కూడా కనబరిచాడు. సినిమా లాస్ట్ లో కొన్ని ఎలిమెంట్స్ తప్ప ఫస్ట్ నుంచి అయితే పూర్తి స్థాయి ఎంగేజింగ్ డ్రామాగా అయితే ఇది మెప్పించదు. సరైన స్క్రీన్ ప్లే లేదు, దర్శకుని వైఫల్యంతో అయితే ఈ చిత్రం ఈ వారాంతానికి జస్ట్ ఓకే ట్రీట్ మాత్రమే ఇస్తుంది.

హైలైట్స్

హీరో బెల్లంకొండ గణేష్ యూనిక్ కథతో ద్వితీయ విఘ్నం దాటాడు.

“నాంది” తర్వాత ఈ సినిమా కూడా కొత్త పాయింట్ తో నిర్మించి మెప్పించారు నిర్మాత సతీష్ వర్మ.

కొత్త దర్శకుడు రాకేష్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో గా అనిపించిన సెకండ్ హాఫ్ లో స్పీడ్ పెంచి మెప్పించాడు.

రేటింగ్ : 2.75/5

Also Read: Peda Kapu: పొలిటికల్ ఎలిమెంట్స్ తో ‘పెద కాపు-1’.. ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్!