Review : ‘Miss Shetty Mr Polishetty’ – ఎమోషనల్ & కామెడీ ఎంటర్టైనర్

అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) జంటగా నటించిన మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mr Polishetty). యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించగా.. మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ (Agent Srinivasa Athreya), ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన సినిమా కావడం..’భాగమతి’ (Bhagamathi) తర్వాత ఐదేళ్లకు అనుష్క తెరపై కనిపిస్తుండడం తో […]

Published By: HashtagU Telugu Desk
Miss. Shetty Mr. Polishetty Review

Miss. Shetty Mr. Polishetty Review

అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) జంటగా నటించిన మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mr Polishetty). యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించగా.. మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ (Agent Srinivasa Athreya), ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన సినిమా కావడం..’భాగమతి’ (Bhagamathi) తర్వాత ఐదేళ్లకు అనుష్క తెరపై కనిపిస్తుండడం తో సినిమా ఫై ఆసక్తి పెరిగింది. అలాగే ట్రైలర్ , ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమా ఫై అంచనాలు పెరగడం తో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రుత అందరిలో కలిగింది. ఆ అంచనాలు , ఆతృతకు తగ్గట్లే మేకర్స్ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున సినిమా ను ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి సినిమా ఎలా ఉంది..? కథ ఏంటి..? అనుష్క – నవీన్ ల యాక్టింగ్ ఎలా ఉంది..? డైరెక్టర్ సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కించారు..? అనేవి ఇప్పుడు చూద్దాం.

కథ (Miss Shetty Mr Polishetty Story) విషయానికి వస్తే.. ట్రైలర్ లోనే సినిమా కథ ఏంటి అనేది తెలిపారు మేకర్స్. అదే సినిమాలో ఉంది. అన్విత ఆర్. శెట్టి (అనుష్క) షెఫ్. పెళ్లి అంటే అస్సలు ఇష్టం ఉండదు. జీవితంలో పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అవుతుంది. కాకపోతే..పెళ్లి చేసుకోకుండా..ఓ బిడ్డ కు తల్లి కావాలని అనుకుంటుంది. ఇదే తరుణంలో తన తల్లి (జయసుధ) మరణించడం తో ఒంటరిదనియ్యాననే ఫీల్ అవుతుంటుంది. తనకు ఓ తోడు కావాలని, ఆ తోడు తన బిడ్డ అవ్వాలని అనుకోని.. ఎలాగైనా ఓ బిడ్డకు జన్మనివ్వాలని…దానికి ఓ మంచి పర్సన్ కోసం వెతకడం మొదలుపెడుతుంది.

ఓ రోజు సిద్ధూ పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి) స్టాండప్ కామెడీ షో చూస్తుంది. తన బిడ్డకు అతడు తండ్రి కావాలని భావిస్తుంది. ఆ తర్వాత..సిద్దు తో పరిచయం పెంచుకుంటుంది. అన్విత పరిచయం కాస్త..సిద్దు లో ప్రేమ పుట్టేలా చేస్తుంది. ఓ రోజు సినిమాటిక్ స్టైల్ లో అన్విత కు ప్రపోజ్ చేస్తాడు సిద్దు. సిద్దు ప్రేమ ప్రపోజ్ కు అన్విత సమాధానం షాక్ ఇస్తుంది. పెళ్లి కాకుండా పిల్లల్ని కనాలని అనుకోవడం సమాజానికి విరుద్ధమని, యాంటీ సోషల్ ఎలిమెంట్ అని సిద్దు తన అభిప్రాయాలు చెబుతాడు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఆ తర్వాత అన్విత దేశం వదిలి లండన్ వెళుతుంది. మరి అన్విత లండన్ కు ఎందుకు వెళ్ళింది ? లండన్ వెళ్లిన తర్వాత సిద్ధూ లేని లోటును, తన తోడు లేడని ఎందుకు ఫీలయ్యింది ? అసలు, ఆమె తల్లి అయ్యిందా? లేదా? చివరకు, ఇద్దరూ కలిశారా? లేదా? అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది.

ప్లస్ (Miss Shetty Mr Polishetty Highlights ) :

* అనుష్క – నవీన్ యాక్టింగ్

* కామెడీ

* నేపధ్య సంగీతం

* సినిమా ఫొటోగ్రఫీ

మైనస్ :

* తెలిసిన కథే

* ఫస్ట్ హాఫ్ లో సాగదీత సన్నివేశాలు

Read Also : Srisailam-Hyderabad: భారీ వర్షాల ఎఫెక్ట్, శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి ధ్వంసం

నటీనటుల తీరు ( Miss Shetty Mr Polishetty Actors Acting) :

అనుష్క చాల గ్యాప్ తర్వాత వెండితెరపై కనిపించింది. కానీ ఆమె నటనలో ఏమాత్రం గ్యాప్ కనిపించలేదు. తనదైన నటనతో ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో నవీన్ – అనుష్క మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

ఇక నవీన్ సైతం తన కామెడీ తో ప్రేక్షకులను నవ్వించాడు. స్టాండప్ కామెడీలో తనకు తిరుగు లేదన్నట్లు కొన్ని సన్నివేశాల్లో విపరీతంగా నవ్వించారు. ముఖ్యంగా సెకండాఫ్ అంతా స్టాండప్ కామెడీ సీన్లు బావున్నాయి. ఎమోషనల్ సీన్స్ కూడా చక్కగా చేశారు.

అనుష్క తల్లిగా జయసుధ నటించగా..ఆమె పాత్ర చాల తక్కువే ఉంది. నాజర్, మురళీ శర్మ, తులసి తదితరులు వారి వారి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక వర్గం (Miss Shetty Mr Polishetty Technical Team Work) :

గోపి సుందర్ నేపధ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. రధన్ సాంగ్స్ జస్ట్ ఓకే అనిపించాయి తప్ప పెద్దగా ఏమిబాగాలేవు. నిరవ్ షా సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ప్రతి ఫ్రెమ్ ఎంత అందంగా చూపించి ప్రేక్షకులకు కొత్తదనం చూపించారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా ఫై వారు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది.

Read Also : India Name Change : ఇండియా పేరు మార్పుపై ఐరాస ఏమంటుందంటే..

ఇక డైరెక్టర్ మహేష్ విషయానికి వస్తే..రొటీన్ కథనే రాసుకున్నప్పటికీ..ఎక్కడ కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా..సినిమాను నడిపించి సక్సెస్ అయ్యారు. పెళ్లి కాకుండా ఓ మహిళ ప్రెగ్నెంట్ కావడానికి చాలా పద్ధతులు ఉన్నప్పటికీ..దర్శకుడు మాత్రం ఎక్కడా హద్దు మీరకుండా..ఫ్యామిలీ అంత కలిసి సినిమా చూసేలా చక్కటి వినోదాన్ని అందించారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో హీరో హీరోయిన్లను కనెక్ట్ చేసిన విధానం, వాళ్ళ నేపథ్యాలను వాడిన తీరు బావుంది. తనలో భయాల గురించి అనుష్క చెప్పే సీన్ కన్నీరు పెట్టిస్తుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సాగదీత సన్నివేశాలు కాస్త ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. అవి కాస్త చూసుకునే బాగుండు.

ఓవరాల్ (Miss Shetty Mr Polishetty Final Report) గా సినిమా మాత్రం ఫుల్లెన్త్ కామెడీ & సెంటిమెంట్ తో ప్రేక్షకులను అలరించేలా ఉంది.

  Last Updated: 07 Sep 2023, 12:59 PM IST