Manjummel Boys Review : ‘మంజుమ్మల్ బాయ్స్’ రివ్యూ.. కమల్ హాసన్ లవ్ సాంగ్ వెనుక ఇంత కథ ఉందా..!

  • Written By:
  • Updated On - April 6, 2024 / 02:42 PM IST

Manjummel Boys Review : 2006లో జరిగిన ఓ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన మలయాళ సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్’. చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సౌబిన్ సాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు తదితర మలయాళ నటులు ముఖ్య పాత్రలు పోషించారు. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 230 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది.

దీంతో ఈ సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ కి కూడా చూపించడానికి తీసుకుచ్చారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో నేడు (ఏప్రిల్ 6) రిలీజ్ చేసారు.

కథ విషయానికొస్తే..

ఈ కథ గురించి చెప్పాలంటే, ముందుగా కమల్ హాసన్ నటించిన ‘గుణ’ సినిమాలోని పాట గురించి చెప్పాలి. ‘కమ్మని ఈ ప్రేమ లేఖలే’ సాంగ్ అందరి ఫేవరెట్ ప్లే లిస్టులో వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటని తమిళనాడులోని కొడైకెనాల్ ప్రాంతంలో ఉన్న ‘డెవిల్ కేవ్స్’ లో చిత్రీకరించారు. ఇండియన్ హిస్టరీలో ఆ గుహ లోయలో పడి చాలామంది చనిపోయారు. ఆ లోయలో పడి బ్రతికి తిరిగి వచ్చిన వారు లేరు. గుణ సినిమా వచ్చిన తరువాత నుంచి ఆ గుహలను డెవిల్ కేవ్స్ అనడం మానేసి గుణ కేవ్స్ అనడం స్టార్ట్ చేసారు.

ఇక గుణ మూవీతో ఫేమస్ అయిన ఈ కేవ్స్ ని చూడడం కోసం కేరళలోని కోచి ప్రాంతానికి చెందిన మంజుమ్మల్ బాయ్స్ అనే పదిమంది స్నేహితులు కొడైకెనాల్ వెళ్తారు. అయితే అక్కడికి వెళ్లిన తరువాత ఆ గ్యాంగ్ లోని సుభాష్ (శ్రీనాథ్ బాసి) అనే కుర్రాడు ప్రమాదవశాస్తు లోయలో పడిపోతాడు. ఆ లోయలోకి వెళ్లి అతని కాపాడడం కోసం అక్కడి పోలీసులు, లోకల్స్ భయపడుతుంటారు. కానీ స్నేహితుడిని కాపాడటం కోసం ఆ మంజుమ్మల్ బాయ్స్ ఏం చేసారు అనేది సినిమా కథ. చివరికి తమ స్నేహితుడిని మంజుమ్మల్ బాయ్స్ కాపాడుకున్నారా..? అసలు లోయలో పడిన సుభాష్ ప్రాణాలతో ఉన్నాడా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

సినిమా విశ్లేషణ..

రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కావడంతో.. ప్రతి సీన్ ని చాలా నేచురల్ గా తెరకెక్కించారు దర్శకుడు చిదంబరం. మద్యమద్యలో ఎమోషన్ కోసం చూపించిన కొన్ని సినిమాటిక్ సీన్స్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ఇక స్నేహితుల మధ్య వచ్చే కామెడీ సీన్స్, ఎమోషన్స్ ని నేచురల్ గా తెరకెక్కించి ఆడియన్స్ ని కథకి బాగా కనెక్ట్ అయ్యేలా చేసారు. ముఖ్యంగా ‘కమ్మని ఈ ప్రేమ లేఖలే’ లవ్ సాంగ్ లోని కేవ్స్ వెనుక ఉన్న ఇంటరెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ కథని తెలుగు ఆడియన్స్ కి చెప్పి థ్రిల్ చేసారు అనే చెప్పాలి.

సాంకేతిక అంశాలు..

సినిమాలోని ప్రతి సాంకేతిక అంశం చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి. డైరెక్టర్ తన టేకింగ్ తో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తే, సినిమాటోగ్రాఫర్ షైజు ఖలీద్ అద్భుతమైన విజవల్స్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ని కలిగించారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సుషిన్ శ్యామ్ అయితే.. థ్రిల్లర్ సినిమాకి ఇవ్వాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తూనే, ‘కమ్మని ఈ ప్రేమ లేఖలే’ పాటని సీన్ కి తగ్గట్లు ఉపయోగించిన తీరు క్లాప్స్ కొట్టిస్తుంది. నటీనటులు కూడా తమ తమ పాత్రలను చాలా నేచురల్ గా చేసి ఆకట్టుకున్నారు.

మొత్తంగా ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా స్నేహంలోని లోతుని, భయంకరమైన లోయ లోతుతో పోలుస్తూ చూపించి థ్రిల్ చేసారు. ఈ మూవీకి 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.