Kushi Review: ఖుషి మూవీ రివ్యూ, సమంత, విజయ్ హిట్ కొట్టారా!

  • Written By:
  • Updated On - September 1, 2023 / 01:09 PM IST

ఒకరు వైవిధ్యమైన పాత్రలకే కేరాఫ్ అడ్రస్, మరొకరు రొమాంటిక్, యూత్ సినిమాలకు క్రేజ్. అలాంటి ఇద్దరు కలిసి నటిస్తే సినిమాపై సహజంగా అంచనాలు ఉండటం సహజం.  ‘లైగర్’ తరువాత విజయ్ దేవరకొండ, శాకుంతలం తర్వాత సమంత కలిసి నటించారు. సినిమా టైటిల్ నుంచి సాంగ్స్ వరకు ప్రతిదీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వీరి కాంబినేషన్లో వచ్చిన ఖుషి ఇవాళ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ ఎలా ఉందో ఓ లుక్ వేద్దాం.

కథ ఇదే

ఖుషి సినిమా కథ విషయానికి వస్తే.. కథ కాశ్మీరులో మొదలవుతుంది. బురఖాలో ఉన్న బేగం (సమంత)ని చూసి ఇది నా పిల్ల అని ఫిక్స్ అయిపోతాడు. విప్లవ్ (విజయ్ దేవరకొండ) తొలిచూపులోనే బేగం ప్రేమలో పడతాడు విప్లవ్. అనూహ్య పరిస్థితుల్లో బ్రాహ్మిన్ అయిన ఆరాధ్య సమంత బేగంగా మారాల్సి వస్తుంది. చంద్రరంగం (మురళీ శర్మ) గారి అమ్మాయి ఆరాధ్య ప్రేమను పొందడానికి లెనిన్ సత్యం (సచిన్ కేడేకర్) గారి కొడుకు విప్లవ్ పెద్ద పోరాటమే చేస్తాడు. ఆరాధ్య ప్రేమను సాధిస్తాడు. ఆరాధ్యది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. విప్లవ్ ది నాస్తిక కుటుంబం కావడంతో సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడరు. ఈ ప్రేమ పోరాటంలో పెద్దలనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పెద్దలను ఎదిరించి ఎలా పెళ్లి చేసుకుంటారో తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్

విజయ్ దేవరకొండ – సమంత కూడా తమ పాత్రలకు ప్రాణం పోశారు. అలాగే శివ నిర్వాణ రాసిన కథ మరియు పాత్రలు కూడా కొత్తగా పెళ్లి అయిన వారి జీవితాల్లోని సంఘటనలు పరిస్థితుల ఆధారంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. భర్త పాత్రలో విజయ్ దేవరకొండ చక్కని నటనను కనబరిచాడు. పెళ్లి అయిన తర్వాత ఓ సగటు భర్తగా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. మెయిన్ గా సెకెండ్ హాఫ్ లో సమంత వెళ్ళిపోయాక వచ్చే సీన్స్ లో విజయ్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. అలాగే విజయ్ కి – సమంతకి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. ఇక కథానాయకగా నటించిన సమంత తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. చదరంగం శ్రీనివాసరావుగా మురళీ శర్మ, నాస్తికుడు సత్యంగా సచిన్ ఖేడేకర్ తమ నాచ్యురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఇతర నటులు కూడా బాగా నటించారు.

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్ లోని కశ్మీర్ సీక్వెన్స్ అలాగే సెకెండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే స్లోగా సాగుతుంది. ఇక హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స కూడా రెగ్యులర్ గానే సాగుతాయి. మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది.

ఎలా ఉందంటే

తెలుగులో ఈ తరహా కథలు చాలా వచ్చాయి, ఇకపై కూడా వస్తాయి. కాకపోతే.. శివనిర్వాణ మార్క్ సన్నివేశాలు, ఎమోషన్స్ & సెంటిమెంటల్ సీన్స్ ‘ఖుషి’ చిత్రాన్ని ఎంటర్ టైనింగ్ గా మలిచాయి. రన్ టైమ్ ఇంకాస్త ట్రిమ్ చేసి.. ఎమోషన్స్ మీద ఇంకాస్త వర్క్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచేది. మొత్తానికి (Kushi) ‘ఖుషి’తో విజయ్ కి మోస్ట్ నీడెడ్ హిట్ దొరికినట్లే.