Karthikeya 2 Review: మైథాలజికల్, అడ్వెంచరస్ రైడ్ ‘కార్తీకేయ-2’

  • Written By:
  • Updated On - August 25, 2022 / 08:16 PM IST

దర్శకుడు చందూ మొండేటి థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘కార్తికేయ’తో మంచి పేరు తెచ్చుకున్నాడు. సీక్వెల్ చేయడానికి అతనికి ఎనిమిదేళ్లు పట్టింది. ఈ సినిమా ట్రైలర్ సంచలన విజయం సాధించింది. ఈ థ్రిల్లర్‌తో పాన్-ఇండియన్ విజయాన్ని అందుకోవాలని నిఖిల్ ఆశిస్తున్నాడు. కార్తీకేయ-2 సినిమా షూటింగ్ కంప్లీట్ అయి నెలలు గడుస్తున్నా.. అయితే అనేకసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు కార్తీకేయ-2 ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయ్యింది.

కథ:

కార్తికేయ 2″ ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ కథ. ఇక సినిమా మొదలవటమే ద్వారకా హిస్టరీ తో మొదలవుతుంది. సినిమా కథ మొత్తం శ్రీకృష్ణుడి కి చెందిన ఒక నగ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కార్తికేయ (నిఖిల్ సిద్ధార్థ్) వైద్యుడు. మేయర్‌ని కొట్టినప్పుడు ఆసుపత్రి నుండి సస్పెండ్ అవుతాడు. అతని తల్లి మొక్కు కోసం గుజరాత్‌లోని ద్వారకకు తీసుకువెళుతుంది. ద్వారకలో ఓ పురావస్తు శాస్త్రవేత్త చనిపోయే ముందు కార్తికేయతో ఏం చెప్తాడు? డాక్టర్ కార్తికేయ ఈ ఇష్యూలో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్

నటుడిగా నిఖిల్ బాగా ఆకట్టుకున్నాడు. పాత్ర కోసం చాలా రిస్క్ లు తీసుకున్నాడు. ఎక్కడ కూడా ప్రేక్షకుల అటెన్షన్ దెబ్బతినకుండా తన యాక్టింగ్ లెవల్ తో సినిమాపై ఆసక్తిని కల్గిగేలా చేశాడు. శ్రీనివాస రెడ్డి, హర్ష , అనుపమ పరమేశ్వరన్ ఆకట్టుకునే నటనను ప్రదర్శించారు. అయితే ఆదిత్య మీనన్ పాత్రలో క్లారిటీ లేదు. అనుపమ్ ఖేర్ అంధ ప్రొఫెసర్‌గా కనిపిస్తాడు.

టెక్నికల్ అంశాలు

ఈ రకమైన థ్రిల్లర్‌లకు సంగీతం, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్‌లో ఉండాలి. దర్శకుడు చందూ మొండేటి మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ నుండి సరైన అవుట్‌పుట్ రాబట్టడంలో విఫలమయ్యాడు. కాల భైరవ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కొన్ని సీన్స్ ను ఎలివేట్ చేయలేకపోయాడు. కానీ అక్కడక్కడ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. డిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. డైలాగ్ రైటింగ్ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ సరిపోతాయి. సినిమా గ్రాండ్ లుక్ కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు పెట్టారు.

హైలైట్స్

స్టోరీ థీమ్

చివరి 30 నిమిషాలు

ప్రొడక్షన్ రిచ్ గా ఉండటం

మైనస్ పాయింట్స్

కొన్ని సన్నివేశాల్లో లాజిక్ లేకపోవడం

కొన్ని సన్నివేశాలు రష్ చేయడం