Bharateeyudu 2 Review : శంకర్(Shankar) దర్శకత్వంలో కమల్ హాసన్(Kamal Haasan) హీరోగా వచ్చిన భారతీయుడు సినిమాకు 28 ఏళ్ళ తర్వాత భారతీయుడు 2 సీక్వెల్ గా వచ్చింది. భారతీయుడు 2 సినిమా నేడు జులై 12న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది. ఈ సినిమాలో కమల్ తో పాటు సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహ, SJ సూర్య, సముద్రఖని.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
కథ విషయానికొస్తే.. బార్కింగ్ డాగ్స్ అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటారు చిత్ర అరవింద్(సిద్దార్థ్), అతని స్నేహితులు. తమ చుట్టుపక్కల జరుగుతున్న దారుణాలు, అవినీతి, ఆత్మహత్యల కారణాలు.. ఇలాంటి సంఘటనల మీద వీడియోలు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల సమాజంలో ఎంతోకొంత మార్పు తీసుకురావాలనుకుంటారు. కానీ రోజురోజుకి ఇండియాలో దారుణాలు ఎక్కువైపోవడంతో వీళ్ళు ఏమి చేయలేక ఎప్పుడో ఇండియాని వదిలేసి వెళ్లిపోయిన సేనాపతి(కమల్ హాసన్) రావాలనుకుంటారు. దీంతో చిత్ర అరవింద్, అతని స్నేహితులు #comebackindian అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడంతో థాయిలాండ్ లో ఉంటున్న సేనాపతి వరకు ఈ విషయం వెళ్లి అతను ఇండియాకు తిరిగొస్తాడు. సేనాపతి నేను చేసే పని నేను చేస్తాను మీరు కూడా మీ చుట్టుపక్కల అవినీతి చేసేవాళ్ళని పట్టించండి, మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేసినా వదలకండి అంటూ యువతకి సందేశం ఇచ్చి పెద్ద పెద్ద అవినీతి చేసిన వాళ్ళని చంపుతూ ఉంటాడు. మరో పక్క ఫస్ట్ పార్ట్ లో సేనాపతిని పట్టుకోవడానికి ట్రై చేసిన CBI ఆఫీసర్ కృష్ణస్వామి కొడుకు ప్రదీప్(బాబీ సింహ) CBI ఆఫీసర్ గా సేనాపతిని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ సేనాపతి ఇండియాకు రావాలని కోరుకున్న జనాలే అతనిని వెళ్లిపోవాలని అంటారు. సేనాపతి ఇండియాకు ఇన్నాళ్ల తర్వాత ఎందుకొచ్చాడు? జనాలు మళ్ళీ ఎందుకు వెళ్లిపొమ్మన్నారు? ఇండియాలో సేనాపతి ఏం చేశాడు? చిత్ర అరవింద్, అతని స్నేహితులు సేనాపతిని కలిసారా? పార్ట్ 3కి లీడ్ ఏమిచ్చారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. 28 ఏళ్ళ క్రితం లంచం అంతమవ్వాలని వచ్చిన భారతీయుడు సినిమా మంచి విజయం సాధించింది. కానీ ఇప్పుడు వచ్చిన భారతీయుడు 2 సినిమాలో లంచంతో పాటు దేశంలోని పలు సమస్యలపై కూడా చర్చిస్తారు. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా మీ ఇంట్లో కూడా తప్పు చేస్తారు, మీరు తప్పు చేస్తారు అనే పాయింట్ ని గట్టిగా చెప్పడంతో మనదాకా వచ్చినప్పుడే మనకు తప్పు అనిపించదు అనే పాయింట్ బలంగా తగులుతుంది. ఫస్ట్ హాఫ్ లో చిత్ర అరవింద్ అతని స్నేహితులు దారుణాలపై పోరాడటం, సేనాపతిని పిలవడం, సేనాపతి కోసం ప్రదీప్ వెతుకులాట, సేనాపతి కొంతమందిని చంపడం చూపిస్తారు. ఇంటర్వెల్ సింపుల్ గానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో సేనాపతి చెప్పిన సిద్ధాంతంతో ఇంట్లోవాళ్ళని పట్టించడంతో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, అందరూ సేనాపతిని ఎందుకు వెళ్లిపొమ్మంటారు అనేది చూపించారు. అయితే క్లైమాక్స్ లో కథ మధ్యలోనే ఆపేసి పార్ట్ 3 లీడ్ ఇచ్చారు. ఇందులో కమల్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ లు తప్ప చెప్పుకోడానికి పెద్దగా ఏమి లేదు. శంకర్ మ్యాజిక్ కచ్చితంగా మిస్ అయింది. శంకర్ సినిమాల్లో సాంగ్స్ గ్రాండ్ గా ఉంటాయని తెలిసిందే. అది మాత్రం మిస్ అవ్వకుండా మెయింటైన్ చేసారు. ఇక ఈ సినిమాకి అన్ని చోట్ల మిక్స్‌డ్ టాక్ వస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. కమల్ హాసన్ గొప్ప నటుందని అందరికి తెలిసిందే. ఈ సినిమాలో 100 ఏళ్ళు పైబడిన ముసలి వ్యక్తిగా డిఫరెంట్ గెటప్స్ వేస్తూ అదరగొట్టారు కమల్. సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, అతని స్నేహితులు సమాజంలో జరిగే దారుణాలని ప్రశ్నించే పాత్రలో బాగానే నటించి మెప్పించారు. రకుల్ ప్రీత్ మాత్రం సిద్దార్థ్ లవర్ పాత్రలో అక్కడక్కడా కనిపించి వెళ్ళిపోతుంది. బాబీ సింహ సీరియస్ CBI ఆఫీసర్ గా బాగా నటించాడు. సముద్రఖని సిద్దార్థ తండ్రిగా మెప్పిస్తారు. SJ సూర్య కాసేపు హడావిడి చేస్తారు. బ్రహ్మానందం ఓ రెండు సార్లు డైలాగ్స్ కూడా లేకుండా జస్ట్ అలా కనిపిస్తారు. ఇక వివేక్, నెడుముడి వేణు షూటింగ్ సమయంలోనే చనిపోవడంతో AIతో వారి పాత్రల్ని రీ క్రియేషన్ కొన్ని సీన్స్ లో చేసారు. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపిస్తారు.
సాంకేతిక అంశాలు.. డైరెక్టర్ శంకర్ సినిమాలు సాంకేతికంగా రిచ్ గానే ఉంటాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. పాటలు మాత్రం వర్కౌట్ అవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో తప్ప మిగిలిన సినిమాలో అంతగా అనిపించదు. యాక్షన్ సీక్వెన్స్ బాగా డిజైన్ చేసారు. ఇక కథ పరంగా లంచం, అవినీతిపై పోరాటం అయినా మీ ఇంట్లో కూడా తప్పు చేస్తారు, వాళ్ళని కూడా పట్టించండి అని ఓ కొత్త పాయింట్ ని చెప్పాలనుకున్నా స్క్రీన్ ప్లే మాత్రం అంతగా వర్కౌట్ అవ్వలేదు. దర్శకుడిగా శంకర్ పర్ఫెక్ట్ అని ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టింది తెరపై కనిపిస్తుంది.
ఫైనల్ గా భారతీయుడు 2 సినిమాలో మనము, మన చుట్టుపక్కల ఎవరో ఒకరు ఏదో ఒక తప్పు చేస్తున్నాము, అక్కడ్నుంచి కూడా మీరు మార్పు తీసుకురావాలని అనే కథాంశాన్ని చెప్పారు. ఇక క్లైమాక్స్ లో భారతీయుడు 2 ట్రైలర్ ప్లే చేసి ఫ్లాష్ బ్యాక్ బ్రిటిష్ కాలం కథ ఉండబోతుందని ఆసక్తి కలిగించారు.
Also Read : Allu Arjun Pushpa 2 : పుష్ప 2.. ఆ విషయం తేల్చని మేకర్స్..!