Jawan Review : జవాన్ – ఫుల్ ప్యాక్ యాక్షన్ ఎంటర్టైనర్

  • Written By:
  • Publish Date - September 7, 2023 / 02:18 PM IST

బాలీవుడ్ లో సరైన హిట్ పడి చాల రోజులు అవుతుంది. ఈ క్రమంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan)..జవాన్ సినిమా అనగానే అంచనాలు తారాస్థాయికి చేరాయి. తమిళంలో మాస్ డైరెక్టర్ గా పేరున్న అట్లీ (Atlee) ..జవాన్ కు డైరెక్టర్ అనగానే అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని నార్త్ ప్రేక్షకులే కాదు ఇటు సౌత్ ఆడియన్స్ సైతం ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గరి నుండి ట్రైలర్ వరకు ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి పెంచుతూ వచ్చింది. నేడు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున పలు భాషల్లో జవాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి జవాన్ కథ ఏంటి..? అట్లీ ..షారుఖ్ ను ఎలా చూపించాడు..? విజయ్ సేతుపతి – నయనతార లను ఎలా వాడుకున్నాడు..? జవాన్ తో షారుక్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడ్డట్లేనా..? అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ (Jawan Story) :

భారత్, చైనా సరిహద్దులో ఉన్న ఒక గ్రామం దగ్గర ఉండే నదిలోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి (షారుక్ ఖాన్) కొట్టుకొస్తాడు. తలకు పెద్ద దెబ్బ, ఒంటి నిండా బుల్లెట్లతో స్పృహ లేకుండా పడి ఉన్న అతడ్ని..ఆ గ్రామస్థులు కాపాడతారు. ఇదే తరుణంలో ఆ గ్రామానికి ఒక కష్టం వచ్చినప్పుడు వారిని అతను కాపాడతాడు. కానీ అతడి గతం మరచిపోతాడు.

30 సంవత్సరాల తర్వాత అతను ఆరుగురు అమ్మాయిలతో (ప్రియమణి, సాన్యా మల్హోత్రా గ్యాంగ్) మెట్రో ట్రైన్ హైజాక్ చేస్తాడు. తన పేరు విక్రమ్ రాథోడ్ అని అందరికీ ప్రకటిస్తాడు. హైజాకర్లతో మాట్లాడటానికి ప్రభుత్వం తరఫున నర్మద (నయనతార) వస్తుంది. అదే మెట్రోలో ప్రముఖ బిజినెస్‌మ్యాన్, వెపన్స్ డీలర్ కాళీ గైక్వాడ్ (విజయ్ సేతుపతి) కూతురు ఆలియా (ఆశ్లేష ఠాకూర్) కూడా ఉంటుంది. దీంతో విక్రమ్ రాథోడ్ అడిగిన మొత్తం రూ.40 వేల కోట్లను కాళీనే చెల్లిస్తాడు. అసలు కాళికి..విక్రమ్ రాథోడ్ కు సంబంధం ఏంటి..? విక్రమ్ రాథోడ్ ఎందుకు హైజాక్ చేస్తాడు..? హైజాక్ తో వచ్చిన డబ్బులను ఏంచేస్తాడు..? విక్రమ్ ను పట్టుకోవాల్సిన నర్మద..అతన్నే ఎందుకు పెళ్లి చేసుకుంటుంది..? అనేవాన్ని కూడా మీరు సినిమా చూస్తే తెలుస్తుంది.

ప్లస్ (Jawan Highlights):

* యాక్షన్ సీన్లు

* షారుక్ యాక్టింగ్

* ఇంటర్వెల్ – క్లైమాక్స్ సీన్లు

* నేపధ్య సంగీతం

మైనస్ :

* రొటీన్ కథ

* దీపికా సాంగ్

* అనిరుద్ సాంగ్స్

నటీనటుల తీరు (Jawan Actors Acting) :

కింగ్ ఖాన్ షారుఖ్ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. విక్రమ్ గా జైలర్ గా రెండు పాత్రల్లో కుమ్మేసాడు. డైరెక్టర్ అట్లీ సైతం షారుక్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారా ఆలా చూపించి ఆకట్టుకున్నాడు.

నయనతార తన రేంజ్‌కు తగిన పాత్రలో ఒదిగిపోయింది. బాలీవుడ్ ఎంట్రీకి కావాల్సిన ఫర్‌ఫెక్ట్ క్యారెక్టర్‌తో మెప్పించింది. దీపిక పదుకొనె పాత్ర నిడివి తక్కువైనా గుర్తుండిపోయే ఎమోషనల్ పాత్రలో నటించింది. ఇక విజయ్ సేతుపతి విలన్ పాత్రలో విశ్వరూపమే చూపించాడు. సంజయ్ దత్ చిన్న అతిథిపాత్రలో మెరిసాడు. మిగతా పాత్రల్లో తదితరులు వారి వారి పరిధిలో మెప్పించారు.

Read Also : UPI-ATM: ఇకపై యూపీఐ స్కాన్ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు.. యూపీఐ ఏటీఎం ఎలా పని చేస్తుందంటే..?

సాంకేతిక వర్గం (Jawan Technical Team work) :

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. జైలర్ మూవీ కి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన అనిరుద్..జవాన్ విషయంలో మాత్రం కాస్త తడబడ్డాడు. నేపధ్య సంగీతం అదిరిపోయింది కానీ సాంగ్స్ మాత్రం మామూలుగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాలు పనితీరు అద్బుతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ హై రేంజ్‌లో ఉన్నాయి. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. మాస్ ఆడియెన్స్ పల్స్ పట్టుకొని.. రాసిన డైలాగ్స్ సినిమాను మాస్ మూవీగా చేశాయి.

ఇక డైరెక్టర్ అట్లీ (Jawan Atlee Kumar) విషయానికి వస్తే..

దర్శకుడు అట్లీ ఎంచుకొన్న పాయింట్ గతంలో తండ్రి, కొడుకుల పగ, ప్రతీకారంతో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ అట్లీ రాసుకొన్న సీన్లు, కథకు ఇచ్చిన ట్రీట్‌మెంట్, యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేసిన విధానంతో ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యేలా చేసింది. కథలో పాత్రలను డిజైన్ చేసిన విధానంతో సక్సెస్ ఫార్ములా వర్కవుట్ అయ్యేలా చేశాడు. కథలో పెద్దగా కొత్తదనం కనిపించదు కానీ.. స్క్రీన్ ప్లే, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కొత్తదనం తీసుకొచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

షారుక్ ఫ్యాన్స్‌కు ‘జవాన్’ గూస్‌బంప్స్ తెప్పిస్తుండడం లో ఎలాంటి సందేహం లేదు. ఆ రేంజ్ లో అట్లీ సినిమాను తెరకెక్కించారు. ఒక సౌత్ ఇండియన్ మాస్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ స్టార్‌ను చూడటం అక్కడి ఆడియన్స్‌కు కచ్చితంగా కొత్తగా ఉంటుంది. నిజానికి ఈ సినిమాతో షారుక్ టార్గెట్ కూడా అదే. దానికి అట్లీ 100 శాతం న్యాయం చేశారు.

Read Also : Review : ‘Miss Shetty Mr Polishetty’ – ఎమోషనల్ & కామెడీ ఎంటర్టైనర్

ఇక సినిమాలో హీరోను ఎలాగైతే బలంగా చుపించాడో..అదే రేంజ్ లో విలన్ పాత్రను కూడా చాలా బలంగా చూపించాడు. సినిమాలో యాక్షన్ సీన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినిమాలో ఐదు ప్రధాన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. వీటన్నిటినీ అద్భుతంగా తెరకెక్కించారు. ప్రీ-క్లైమ్యాక్స్‌లో వచ్చే ఛేజ్, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాస్ ఎలివేషన్లతో గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. చిన్నపిల్లలకు అట్లీ సినిమాల్లో మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో కూడా అది కనిపిస్తుంది.

ఫస్టాఫ్‌ను డైరెక్టర్ చాలా ఎంగేజింగ్‌గా నడిపించినా ఇంటర్వల్‌లో ట్విస్ట్ రివీల్ అవ్వడంతో సెకండాఫ్ ప్రేక్షకుడి ఊహకి అందేస్తుంది. అయినప్పటికీ మంచి ఎలివేషన్ సీన్స్, ఊహించని ఎంట్రీలతో దర్శకుడు బోర్ కొట్టించలేదు. యాక్షన్ సీన్స్, ఎమోషనల్ కంటెంట్‌తో మోత మోగించేశారు.

ఓవరాల్ (Jawan Final Report) గా..జవాన్ మూవీలో లవ్, ఎమోషన్స్, అవినితీపై పోరాటం, దేశంలో రైతుల సమస్యలు, వాతావరణ కాలుష్యం, ఓటు విలువ లాంటి అంశాలను జోడించి చక్కటి మాస్ ఎంటర్టైనర్ ను ప్రేక్షకులకు అందించాడు అట్లీ.