Jailer movie Review: జైలర్ మూవీ రివ్యూ.. రజినీకాంత్ హిట్ కొట్టినట్టేనా

  • Written By:
  • Updated On - August 10, 2023 / 03:43 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి సినిమా వస్తుందంటే చాలు కేవలం తమిళే ప్రేక్షకులే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్, ఇతర దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటీవల ఆయన నటించిన దర్బార్, పెద్దన్న, కబాలి లాంటి సినిమాలు ఘోరంగా నిరాశపర్చాయి. ఈ నేపథ్యంలో జైలర్ మూవీతో ఇవాళ మన ముందుకొచ్చాడు రజీనీకాంత్. భారీ అంచనాలు ఈ మూవీతో రజినీ హిట్ కొట్టాడా? అనేది తెలుసుకోవాలంటే రివ్యూ చదువాల్సిందే.

స్టోరీ ఇదే

టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) ఒక కఠినమైన జైలర్. తన జైలు లో ఉన్న ఖైదీలను క్రమశిక్షణ లో పెట్టి, వాళ్ళని తన కంట్రోల్ లో పెట్టుకునే రేంజ్ సత్తా ఉన్నవాడు. ఆయన విధించిన నియమాలను అతిక్రమించే ధైర్యం ఏ ఖైదీ కి కూడా లేదు. అయితే వృత్తిపరంగా ఎంత కఠినంగా ఉంటాడో, ఫ్యామిలీ మ్యాన్ గా అంతటి ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే ఒక రోజు తన జైలు లో ఉన్న గ్యాంగ్ స్టర్ ని తప్పించబోతుంటే ముత్తువేల్ పాండియన్ అడ్డుకొని, మళ్ళీ జైలుకు పంపుతాడు. అప్పుడు ఆ గ్యాంగ్ స్టర్ కి సంబంధించిన అనుచరులు ముత్తువేల్ కుటుంబం పై దాడి చేసి, అతని కొడుకుని అతి కిరాతకంగా చంపేస్తారు. తన కొడుకుని చంపింది వారిపై పగ తీర్చుకోవడానికి ముత్తువేల్ క్రూరుడిగా మారుతాడు. ఒకవైపు వృత్తి మరోవైపు పగ, ఈ రెండిటి మధ్య ముత్తువేల్ పడిన సంఘర్షణే ఈ జైలర్ సినిమా.

సినిమా ఎలా ఉందంటే

సినిమా ప్రథమార్థం చాలా స్లో గా ప్రారంభం అవుతుంది. అలా 40 నిమిషాల వరకు సినిమా స్లో గా నడవడం తో అభిమానులు రజినీకాంత్ కి మళ్ళీ ఫ్లాప్ పడబోతోందా అని బయపడొచ్చు. కానీ ఆ తర్వాత నుండి అసలు సినిమా ప్రారంభం అవుతుంది. నెల్సన్ మార్కు కామెడీ కొన్ని చోట్ల బాగా పేలింది. అలా ఫస్ట్ హాఫ్ మొత్తం మీద రెండు మూడు అదిరిపోయే సన్నివేశాలు పడ్డాయి. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ అయ్యేలా చేసింది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ మొత్తం అదిరిపోయే రేంజ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో డీసెంట్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కేవలం సూపర్ స్టార్ రజినీకాంత్ మీదనే నడుస్తుంది. ఆయన మార్క్ మ్యానరిజం, హీరోయిజం అభిమానులకు కనుల పండుగే అని చెప్పొచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ లో ఎక్కడా కూడా మనకి టీజర్ , ట్రైలర్ లో చూపించిన ప్రధాన పాత్రలు ఎక్కడా కనిపించదు. తమన్నా, మోహన్ లాల్ , సునీల్ తదితరులు ఫస్ట్ హాఫ్ లో కనిపించరు.

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తాడు. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభం నుండే రజినీ కాంత్ విశ్వరూపం మొదలు అవుతుంది. మొదటి 20 నిమిషాల్లో వచ్చే జైలు సన్నివేశాలు, రజినీకాంత్ మ్యానరిజమ్స్, డైలాగ్స్ ఆడియన్స్ రోమాలు నిక్కపొడిచేలా చేస్తాయి. ఇది కదా సూపర్ స్టార్ నుండి ఇన్ని రోజులు మేము కోరుకున్నది అని ప్రతీ ఒక్కరు అనుకుంటారు.ఆ రేంజ్ లో సన్నివేశాలను రాసుకున్నాడు డైరెక్టర్ నెల్సన్. రజినీకాంత్ ని చాలా కాలం తర్వాత ఒక డైరెక్టర్ అద్భుతంగా వాడుకున్నాడు అనే అనుభూతి ప్రతీ ఒక్కరిలో కలుగుతుంది.

ఫైనల్ టచ్

జైలర్ అంటూ భారీ తారాగణంతో వచ్చిన ఈ చిత్రంలో రజినీకాంత్ నటన, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ గెస్ట్ అప్పీరియన్స్ మరియు యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కానీ సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ, ఆ ఎమోషన్ లో, ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. కానీ రజినీ మేనియా కారణంగా ఈ మూవీ హిట్ అయ్యే అవకాశాలున్నాయి.

రేటింగ్ : 2.75/5