Das Ki Dhamki: ధమ్కీతో విశ్వక్ సేన్ హిట్ కొట్టినట్టేనా?

  • Written By:
  • Updated On - March 22, 2023 / 07:08 PM IST

Das Ki Dhamki:  టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చాలా వారాల తర్వాత విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేతా పెత్తురాజ్ హీరోయిన్ గా నటించిన “దాస్ కా ధమ్కీ” ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే డబుల్ రోల్ విశ్వక్ సేన్ సత్తా చాటాడా? టాలీవుడ్ మంచి ధమ్కీ ఇచ్చాడా? అనేది తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే

స్టోరీ ఏంటంటే..

ఇక కథలోకి వస్తే.. కృష్ణ దాస్(విశ్వక్ సేన్) ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్ గా పని చేస్తూ ఉంటాడు కానీ తనకి మాత్రం లైఫ్ లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరో పక్క ఎస్ ఆర్ ఫార్మా చైర్మన్ గా డాక్టర్ సంజయ్ రుద్ర(మరో విశ్వక్ సేన్) తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి ఈ ఇద్దరూ ఒకరికి ఒకరు లింక్ ఉంటుందా? లేక వేరే వేరేనా? కథలో సంజయ్ రుద్ర కి ఏమవుతుంది? తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? ఇంతకీ కీర్తీ(నివేతా పెత్తురాజ్) ఎవరితో లింక్ ఉంటుంది? అనే విషయాలు తెలియలంటే బిగ్ స్క్రీన్ ఈ మూవీపై చూడాల్సిందే

సాలిడ్ పెర్ఫామెన్స్

విశ్వక్ సేన్ సాలిడ్ పెర్ఫామెన్స్ తో ఇంప్రెస్ చేస్తాడు. ఇది వరకు కూడా ఇలాంటి యూత్ ఫుల్ అగ్రెసివ్ రోల్స్ లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్ లో అయితే మంచి సెటిల్డ్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్ లో కూడా మంచి వేరియేషన్స్ ని ఎమోషన్స్ ని బాగా చేసాడు. ఇక హీరోయిన్ నివేతా తన గత సినిమాలు తెలుగు లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్డ్ గా కనిపించింది కానీ ఈ సినిమాలో తన గ్లామ్ షో అయితే మాస్ ఆడియెన్స్ కి ట్రీట్ ఇస్తుంది అని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పెర్ఫామెన్స్ ని విశ్వక్ తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని “పాగల్” తర్వాత చూపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికీ మంచి ట్రీట్ ఇస్తుంది. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్ లతో విశ్వక్ ల పలు కామెడీ సీన్స్ హిలేరియస్ గా ఉంటాయి.

నెగిటివ్ పాయింట్స్

ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైనింగ్ నరేషన్ అక్కడక్కడా ఉన్నప్పటికీ కథ పరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన డ్యూయల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్ లో సినిమా కనిపిస్తుంది. దీనితో అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఈ సినిమా కథ పరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది.

కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్ లో సెకండాఫ్ అనిపించదు. ట్విస్ట్ లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి పైగా ఇన్ని ట్విస్టులు ఆడియెన్స్ కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండాఫ్ లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అంతే కాకుండా రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు. ఇంకా పలు బోరింగ్ సన్నివేశాలు తీసేయాల్సింది. ఎంతో కీలకమైన సెకండాఫ్ ఇంకా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

సినిమా ఎలా ఉందంటే..

ఇక మొత్తంగా చూస్తే ఈ “దాస్ కా ధమ్కీ” విశ్వక్ నుంచి గాని నివేతా నుంచి కూడా ఆశించే అన్ని అంశాలు కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు పైగా చాలా ఇంప్రెస్ చెయ్యని ట్విస్ట్ లు బోర్ అనిపిస్తాయి. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్లొచ్చు.