Site icon HashtagU Telugu

Devil Review: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ మూవీ రివ్యూ!

Devil

Devil

Devil: నందమూరి కళ్యాణ్ రామ్ అనగానే వైవిధ్యమైన సినిమాలు గుర్తుకువస్తుంటాయి.  ‘బింబిసార’ మూవీతో స్వింగ్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్.. ఆ తర్వాత వచ్చిన ప్రయోగాత్మక చిత్రం ‘అమిగోస్’తో పర్వాలేదనిపించాడు. తాజాగా అతడు నటించిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. బ్రిటీష్ పరిపాలన కాలం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 29న) థియేటర్లలోకి వచ్చింది. డెవిల్ మూవీలో ఎంత మేరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదువాల్సిందే.

స్టోరీ ఎంటంటే
రాసపాడు దివాణంలో జరిగిన హత్య. ఎవరు చేసారో తెలీదు. అది కనుక్కునే ప్రయాణంలో (నందమూరి కళ్యాణ్ రామ్ ) వస్తాడు. ఏజెంట్ అయిన DEVIL అసలు ఈ దివాణం లో జరిగిన హత్య కోసం రావటం ఏంటి ? అసలు నైషద (సంయుక్త) ఎవరు ? మాళవిక నాయర్ కి నేతాజీ కి ఉన్న సంబంధం ఏంటి ? అసలు హత్య ఎందుకు జరిగింది ? కళ్యాణ్ రామ్ అసలు కనుక్కున్న నిజాలు ఏంటి ? అబద్ధాలు ఏంటి ?చూడాలంటే , తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

బలాలు
చిత్ర నేపథ్యం మొత్తం బ్రిటీష్ కాలం నాటి కధలా చెప్పటం బాగుంది . నందమూరి కళ్యాణ్ రామ్ నటన బాగుంది. కొత్త స్క్రిప్ట్స్ ఎలాంటి బెరుకు లేకుండా నటించటం కళ్యాణ్ రామ్ కి అలవాటైపోయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది హర్షవర్ధన్ రామేశ్వర్ మంచి సంగీతం అందించాడు. ఇతర నటుల యాక్టింగ్ కూడా బాగుంది

బలహీనతలు
డైరెక్టర్ నవీన్ మేడారం కథని పేపర్ మీద రాసుకున్న విధానం బాగుందేమో, కానీ చిత్రీకరించిన వైనం అంత గొప్పగా లేదు. కధలో ట్విస్ట్ ముందే ఊహించేంత బేలగా ఉంది ఆర్టిస్ట్స్ నటన, మరియు డైరెక్షన్ . మాళవిక నాయర్, సంయుక్త మీనన్, ఎస్తేర్, అంతా వారి వారి పరిధిలో నటించారు. ఇంకాస్త మంచి నటించే అవకాశం ఈ కధలో ఉంది, కానీ డైరెక్టర్ అంత మేర వారికీ అవకాశం ఇచ్చినట్టు కనపడలేదు.

చివరకు ఎలా ఉందంటే..

కళ్యాణ్ రామ్ వైవిధ్యమైన కథనాలను , కధలను ఎన్నుకునే విధానాన్ని మరో సారి తెలియారిచేలా ఉంది. కానీ నేతాజీ పేరుని వాడుకున్నంతగా , ఆ పోరాట స్ఫూర్తి ఈ చిత్రం లో కనపడదు. అసలు ఆర్టిస్ట్స్ అంత మంది ఉన్నా ఎవరు మనకి గుర్తుండిపోయే నటన లేదు అంటే నిజమనే చెప్పాలి. మొదటి సారి సత్య కామెడీ టైమింగ్ కూడా మనకి ఇబ్బంది కలిగిస్తుంది. సీత (పూర్వపు చిత్రాల హీరోయిన్) అసలు ఈ చిత్రం లో ఎందుకున్నారో ఆవిడ రోల్ ఎందుకనో తెలీదు. కానీ చివరగా, “డెవిల్” చిత్రం ఒక ఆసక్తికరమైన పరిశోధనాత్మక థ్రిల్లర్, ఇది మిమ్మల్ని భారత స్వాతంత్ర్య యుగంలోకి తీసుకెళ్తుంది. కొన్ని ఊహించని మలుపులతో మిమ్మల్ని కట్టిపడేస్తుంది.