Site icon HashtagU Telugu

Bhola Shankar Review : భోళా శంకర్.. బాబోయ్..!

Bhola Shankar Telugu Movie Review 2.5

Bhola Shankar Telugu Movie Review 2.5

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నుండి సినిమా అంటే మెగా అభిమానులకు పెద్ద పండగే. అది ఈరోజుది కాదు..గత కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నదే. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా మొదటి రోజు థియేటర్స్ వద్ద రచ్చే చేయాల్సిందే అంటారు ఫ్యాన్స్. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన చిరు..కుర్రహీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు. గాడ్ ఫాదర్ , వాల్తేర్ వీరయ్య వంటి సినిమాలతో అలరించిన చిరు..ఈరోజు భోళా శంకర్ (Bhola Shankar) మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో సూపర్ హిట్ అయినా వేదాళం చిత్రానికి రీమేక్ గా భోళా శంకర్ ను తెరకెక్కించారు డైరెక్టర్ మెహర్ రమేష్.

తమన్నా , కీర్తి సురేష్ , సుశాంత్ , హైపర్ ఆది , వెన్నెల కిషోర్ , మురళి శర్మ, బ్రహ్మానందం మొదలగు భారీ తారాగణం నటించిన ఈ మూవీ కి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించగా..AK ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించారు. సినిమాలోని పాటలు బాగుండడం..ట్రైలర్ , టీజర్ ఆకట్టుకోవడంతో సినిమా ఫై అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. మరి వారి అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..? గత కొన్నేళ్లుగా హిట్ లేకుండా , సినిమా ఛాన్సులు లేకుండా ఉన్న మెహర్ ..ఈ సినిమా తో హిట్ కొట్టాడా..? AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ హిట్ పడ్డట్లేనా..? చిరంజీవి మాస్ యాక్షన్ ఎలా ఉంది..? తమన్నా గ్లామర్ యూత్ కు కిక్ ఇచ్చిందా..? అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ (Bhola Shankar Story) :

శంకర్ (Chiranjeevi) కి, తన చెల్లులు మహాలక్ష్మి (కీర్తి సురేష్) అంటే ఎంతో ఇష్టం..తన సంతోషం కోసం ఏమైనా చేస్తాడు. మహాలక్ష్మి ఉన్నంత చదువుల కోసం కోల్‌కత్తాకు వస్తారు. కోల్‌కత్తాకు వచ్చిన శంకర్..టాక్సీ నడుపుతుంటాడు. అప్పటికే కోల్‌కత్తాలో అమ్మాయిలను కిడ్నాప్ లు చేస్తుంటాడు మాఫియా హెడ్ అలెగ్జాండర్ (తరుణ్ అరోరా).

అలెగ్జాండర్ మాఫియా ను పోలీసులు కట్టడి చేయలేకపోతుంటారు. సిటీలో జరిగే కిడ్నాపుల వెనుక ఉన్న క్రిమినల్స్ గురించి సిటీలోని టాక్సీ డ్రైవర్లందరికీ అవగాహన కల్పిస్తారు పోలీసులు. దీంతో ఓ గ్యాంగ్‌లోని వ్యక్తిని చూసి పోలీసులకు సమాచారం అందిస్తాడు శంకర్. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? లాస్య (తమన్నా) కు శంకర్ కు సంబంధం ఏంటి..? లాస్య ఎందుకు శంకర్ ఫై కోపం పెంచుకుంటుంది..? శ్రీకర్..ఎవరు…? శ్రీకరు కు మహాలక్ష్మి కి సంబంధం ఏంటి..? శంకర్ నిజంగా మహాలక్ష్మి చదువు కోసమే కోల్‌కత్తా కు వస్తాడా..? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read:  Gadar 2 Movie Review : దుమ్ము లేపిన సన్నీ డియోల్.. పాకిస్తాన్ జైలు చుట్టూ నడిచిన కథ

ప్లస్ (Bhola Shankar Highlights) :

మైనస్ (Bhola Shankar) :

నటీనటుల తీరు (Bhola Shankar):

సినిమాలో భారీ తారాగణం ఉన్నప్పటికీ డైరెక్టర్ మెహర్ ఎవర్ని పెద్దగా వాడుకోలేకపోయాడు. ముఖ్యంగా కమెడియన్స్ విషయంలో. హైపర్ ఆది , వెన్నెల కిషోర్ , బ్రహ్మానందం , రఘు బాబు, హర్ష , సత్య, బిత్తిరి సత్తి, లోబో, వేణు, తాగుబోతు రమేష్ ఇలా స్క్రీన్ మీద ఎంత మంది కనిపించినా ఎవ్వరినీ కూడా సరిగ్గా వాడుకోలేకపోయారు రమేష్. అసలు డైరెక్టర్ కామెడీ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు.

మెగా స్టార్ చిరంజీవి యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనేలేదు. కామెడీ , డాన్స్ , ఫైట్స్ , రొమాంటిక్ ఇలా ఏదైనా సరే అవలీలగా చేసి తన పాత్రకు న్యాయం చేస్తాడు. ఈ సినిమాలో కూడా అలాగే శంకర్ పాత్రకు న్యాయం చేసాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానిగా అభిమానులను అలరించాడు. అలాగే ఖుషి నడుము సీన్ లో ఇరగదీసాడు. ఇక డాన్సుల విషయంలో చెప్పాల్సిందేమి లేదు..చిరు డాన్స్ కు తమన్నా తోడవ్వడంతో డాన్స్ ప్రియులకు ఫుల్ మిల్స్ దొరికినట్లు అయ్యింది. మరోసారి చిరు తన మేనరిజం, స్టయిల్స్‌తో తన వరకు రఫ్ ఆడించాడు. మహానటి ఫేమ్ కీర్తి సురేష్..తన పాత్రకు న్యాయం చేసింది. ఇక సుశాంత్ , తమన్నా పత్రాలు జస్ట్ ఆలా ఉన్నాయి అం. తమన్నా (Tamannaah) అయితే కేవలం గ్లామర్ కే పరిమితం అయ్యింది. ఇక విలన్ గా నటించిన తరుణ్ అరోరా కూడా ఏదో విలన్ అన్నట్లు ఉన్నాడు తప్ప ఏమిలేదు.

Also Read:  OMG 2 Movie Review : బాత్రూం ఘటనతో స్టార్ట్.. అక్షయ్ కుమార్ ఎంట్రీతో ఎండ్

సాంకేతిక విభాగం (Bhola Shankar) :

ఫస్ట్ టైం మణిశర్మ తనయుడు సాగర్ (Mahati Swara Sagar)..చిరంజీవి సినిమా కు పనిచేసాడు. సినిమాలో రెండు , మూడు సాంగ్స్ బాగున్నాయి. నేపధ్య సంగీతం పర్వాలేదు అనిపించింది. డడ్లీ కెమెరా వర్క్ బాగుంది. సెట్స్ కూడా భారీగా చూపించాడు. ఎడిటింగ్ కూడా పెద్దగా గొప్పగా లేదు. చాల సీన్లు జంప్ అవుతూ అతికించినట్టుగా అనిపిస్తాయి. మమిడాల తిరుపతి రాసిన డైలాగ్స్ బాగా పేలాయి. అనిల్ సుంకర నిర్మాణ విలువలు తెరపై కనిపించాయి. ఖర్చు కు ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా నిర్మించారు.

ఇక డైరెక్టర్ మెహర్ విషయానికి వస్తే..మెహర్ తెరకెక్కించిన సినిమాల్లో గొప్ప సినిమా ఒకటి లేదు. అన్ని భారీ ప్లాపులే. కంత్రి , బిల్లా , శక్తి, షాడో ఇలా అన్ని కూడా డిజాస్టర్లే. ఇన్ని డిజాస్టర్లు ఉన్నప్పటికీ మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చాడంటే గొప్ప విషయమనే చెప్పాలి. అలాంటి అవకాశాన్ని మెహర్ ఉపయోగించుకోలేకపోయాడు. కథ విషయంలోనే కాదు నటి నటులను కూడా వాడుకోలేకపోయాడు. రొటీన్ సన్నివేశాలు , నవ్వు రాని కామెడీ తో బోర్ కొట్టించాడు. క్లయిమాక్స్ ఎమన్నా బాగుంటుందా అంటే అది లేదు. సెకండాఫ్‌లో చిరంజీవి, కీర్తి సురేష్ మధ్య వచ్చే సిస్టర్ సెంటిమెంట్ సీన్లు మెప్పించేలా ఉండటం కొంత ఊరట. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సెంటిమెంట్ సీన్ల కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

ఫైనల్ గా (Bhola Shankar) :

భారీ అంచనాలతో వెళ్తే సినిమా ఏమాత్రం నచ్చదు. మాములుగా వెళ్తే మాత్రం చిరు కామెడీ , రెండు , మూడు సాంగ్స్ , ఖుషి రీ సీన్ , సిస్టర్ సెంటిమెంట్ ఇలా కొన్ని కొన్ని నచ్చుతాయి.

Read Also : Jailer Collections: జైలర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. సూపర్ స్టార్ ఊచకోత షురూ..!

Exit mobile version