Agent Review: అఖిల్‌ కి మళ్లీ డిజాస్టరా? హిట్టా? ఏజెంట్ మూవీ ఎలా ఉందంటే!

  • Written By:
  • Updated On - July 14, 2023 / 12:40 PM IST

అఖిల్ అక్కినేని (Akhil Akkineni).. అక్కినేని బ్యాక్ గ్రౌండ్ నుంచి టాలీవుడ్ కు పరిచయమైన యంగ్ హీరో. నాన్న నాగార్జున నటనను, నాగేశ్వర్ రావు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న హీరో. బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అఖిల్ కు హిట్స్ పడకపోవడం అటు అక్కినేని అభిమానుల్లో, ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న అఖిల్ తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ (Agent) సినిమాతో ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం కోసం స‌రికొత్త‌గా మేకోవ‌ర్ అయిన అఖిల్ హిట్ కొట్టాడా? మళ్లీ ఫ్లాపునే జేబులో వేసుకున్నాడా? అనేది తేలియాలంటే ఈ రివ్యూ (Review) చదువాల్సిందే

క‌థ‌:
రా ఏజెన్సీ ప్రధానంగా సాగే సినిమాగా చిత్రాన్ని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. రా ఆఫీసర్ అయిన మమ్ముట్టి ఓ మాఫియా ముఠాని పట్టుకోవడంలో విఫ‌లం అవుతుంటాడు. ఇక అప్పుడు వాళ్ల‌ని ప‌ట్టుకోవ‌డానికి కొంటె ప్రవర్తన కలిగిన వ్య‌క్తి (అఖిల్‌) అయితే బెటర్‌ అని, అలాంటి వాడే ఇలాంటి పెద్ద పెద్ద క్రిమినల్స్ ని పట్టుకోగలరని భావిస్తాడు. దాంతో ఆ ఆపరేషన్‌ (Operation) ఏజెంట్‌ని అఖిల్‌కి అప్పగిస్తారు. దీంతో అఖిల్‌ తన కొంటెతనంతో, అల్లరితో వారిని ఎలా పట్టుకున్నాడనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

నటీనటుల విశ్లేషణ

ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడని సినిమా చూస్తే త‌ప్ప‌క అర్ధ‌మ‌వుతుంది. యాక్ష‌న్ సన్నివేశాల‌లో అద‌ర‌గొట్టాడు. అయితే న‌ట‌న‌లో కొద్దిగా తేలిపోయాడు. ఇక క‌థానాయిక సాక్షి వైద్య త‌న న‌ట‌న‌తో ప‌ర్వాలేద‌నిపించింది. మ‌మ్ముట్టితో పాటు ఇత‌ర న‌టీన‌టులు కూడా త‌మ పాత్రల‌కి న్యాయం చేశారు. ఇక ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి (Surendar Reddy) మూవీని అందంగా మ‌ల‌చ‌డంతో విఫ‌ల‌మ‌య్యాడ‌నే చెప్పాలి. ఈ సినిమాకి క‌థ‌లో మ్యాట‌ర్ లేదు. సోల్ పూర్తిగా మిస్ అయింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ ప‌ర్వాలేదు కాని లవ్ స్టోరీ, మ్యూజిక్, బీజీఎమ్, విలన్ రోల్ మాత్రం బిస్కెట్ అయింద‌నే చెప్పాలి.

ప్ల‌స్ పాయింట్స్
ఇంట‌ర్వెల్
టెర్రీఫిక్‌ యాక్షన్‌ స్టంట్స్ (Action Stunts)
మ‌మ్ముట్టి న‌ట‌న‌

మైన‌స్ పాయింట్స్:
క‌థ‌
ల‌వ్ స్టోరీ (Love Story)
బీజీఎమ్

ఎలా ఉందంటే
భారీ ఖ‌ర్చుతో ఏజెంట్ సినిమాని తెర‌కెక్కించ‌గా, ఈ సినిమాకు భారీ ఖర్చు చేశారని అది ప్రతి ఫ్రెములో కనిపిస్తుంది. హై వోల్టేజ్ సీన్ తో సినిమా క్లైమాక్స్ (Climax) కి చేరుకుంటుంది. ఆ స‌మ‌యంలో ప్రేక్ష‌కుల‌కి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మిషన్‌ని పూర్తి చేసే క్రమంలో అఖిల్‌కు ఎదురైన సవాళ్లు , ఆఇ క్రమంలో వచ్చే యాక్షన్ సీన్స్ బాగుంటాయి .స్పై యాక్షన్‌ ఫిల్మ్స్‌ లో ఉండవలసిన గన్‌తో బుల్లెట్ల వర్షం కురిపించడం, అదిరిపోయే స్టంట్స్ ప్రేక్ష‌కుల‌కి కొంత మ‌జా ఇస్తుంది. సినిమాలో కొన్ని సీన్స్ త‌ప్ప మిగ‌తా అంతా బోరింగ్ గానే ఉంటుంది. అభిమానుల‌కి మాత్ర‌మే ఈ సినిమా న‌చ్చుతుంది.

రేటింగ్: 2.0/5