Hit 2 Review: మేజర్ తర్వాత ‘హిట్’ కొట్టిన అడవి శేష్!

  • Written By:
  • Updated On - December 2, 2022 / 02:17 PM IST

విభిన్నమైన కథలు చేసుకుంటూపోతే ఏ ప్రేక్షకులు అయినా తప్పక ఆదరిస్తారు. దీన్ని నిజం చేసి చూపిస్తున్నాడు టాలెండ్ యాక్టర్ అడివి శేష్. టాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. ఇక మేజర్ పాన్ మూవీ తర్వాత మరోసాని హిట్ రూపంలో మరో హిట్2 కొట్టాడు.

స్టోరీ:

ఓ యువతి దారుణ హత్యతో వైజాగ్ నగరం ఉలిక్కిపడింది. కేసును ఛేదించడానికి ఎస్పీ కృష్ణ దేవ్ (అడివి శేష్) రంగంలోకి దిగుతాడు. తనదైన స్టయిల్ లో కేసును దర్యాప్తు చేస్తాడు. దాని వెనుక ఉన్న వ్యక్తిని కూడా పట్టుకుంటాడు. కానీ సంఘటన వెనుక అనేక విషాద మలుపులు చోటుచేసుకుంటున్నాయి. చివరకు హంతకుడు ఎవరో అతను తెలుసుకుంటాడు. అయితే ఈ హంతకుడు ఎవరు? అతను మహిళలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు? సమాధానాలు తెలుసుకోవాలంటే థియేటర్ లో ఈ సినిమాను చూడాల్సిందే.

ప్లస్ పాయింట్లు:

HIT సిరీస్ లో భాగంగా శైలేష్ కొలను పార్ట్ -2 దర్శకత్వం వహించాడు. ఆయన తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. విశ్వక్ సేన్ నటించిన HIT మరింత పరిశోధనాత్మకంగా ఉంటే, ఈ భాగంలో ఎక్కువ ఎమోషన్స్, క్షణ క్షణం ఉత్కంఠతను రేపే సీన్స్, అంతకుమించి థ్రిల్స్ ఉన్నాయి. ఇక మీనాక్షి చౌదరి అందంగా కనిపించి అభిమానులను అలరించింది.  హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. కోమలీ ప్రసాద్‌కి మంచి పాత్ర లభించడంతో పాటు సిన్సియర్‌గా నటించింది. రావు రమేష్ పోలీస్ పాత్రలో అద్భుతంగా నటించాడు.

సినిమా సెకండాఫ్ అంతా యాక్షన్ చుట్టూ ఎక్కువగా తిరుగుతుంది. కిల్లర్ రివీల్ చేసిన విధానం చాలా బాగుంది. ఈ చిత్రం చాలా స్టైలిష్‌గా ఉంది. దర్శకుడు శైలేష్ రెండు భాగాల్లో కూడా ఎటువంటి డల్ మూమెంట్ లేని విధంగా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. చివరగా చెప్పాలంటే.. అడివి శేష్ ఇప్పుడు థ్రిల్లర్‌లకు రారాజుగా మారాడు. ఈ జానర్‌లో ఆయన సబ్జెక్ట్‌లను ఎంచుకునే విధానం అద్భుతమైనది. HIT 2 క్లైమాక్స్‌లో అతని లుక్స్, బాడీ లాంగ్వేజ్, హీరోయిజం, ఎమోషనల్ తో కేక పెట్టించాడు.

మైనస్ పాయింట్లు:

HIT 2 ఒక సాధారణ సీరియల్ కిల్లర్ చిత్రం. అయితే కొత్తగా ఏమీ లేదు. కాకపోతే ఇన్విస్టిగేషన్ కొత్త పద్ధతిలోసాగుతుంది. కానీ శేష్ చిత్రాలతో మీరు ఆశించే అద్భుతమైన అంశం ఇందులో లేదు.

కీ పాయింట్:

‘హిట్ 2’ డీసెంట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఫస్టాఫ్‌లో కథ కంటే కథనం ఉత్కంఠ కలిగిస్తుంది. సెకండాఫ్ స్టార్ట్ అయిన తర్వాత, అసలు కథలోకి వెళ్ళాక… సాగదీసిన ఫీలింగ్ ఉంటుంది. నార్మల్ థ్రిల్లర్‌ను అడివి శేష్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చూసేలా ఉంటుంది. ఈ థ్రిల్లర్ జానర్ ఆడియన్స్ ఓసారి కచ్చితంగా ట్రై చేయొచ్చు.