Adipurush Review: మోడ్రన్ రామాయణం.. ప్రభాస్ ఆదిపురుష్ మూవీ ఎలా ఉందంటే!

  • Written By:
  • Updated On - July 14, 2023 / 12:38 PM IST

బాహుబలి మూవీతో పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్. సాహో, రాధేశ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో భారీ మైథలాజికల్ మూవీ అయిన ఆదిపురుష్ తో ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్ ఆదిపురుష్ ఎలా ఉంది?  ఔంరౌత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మోడ్రన్ రామాయణం ఏవిధంగా ఉందో ?తెలుసుకోవాలంటే ఈ రివ్యూను చదువాల్సిందే.

స్టోరీ ఇదే

రాఘవ (ప్రభాస్) తన సతీమణి జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసంలో ఉండగా రావణ (సైఫ్ అలీ ఖాన్) సాధువు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. తన సోదరి శూర్పణఖ చెప్పిన మాటలకు తోడు సహజంగా తన స్వభావం కారణంగా రావణ జానకి పై ఆశ పెంచుకుంటాడు. అనంతరం రాఘవ తన సతీమణి జానకిని దక్కించుకోవడానికి ఏం చేశాడు?, ఈ మధ్యలో హనుమంతుడి శక్తి ఎలా సాగింది ?, అలాగే ఈ యుద్ధంలో వానర సైన్యం పోరాట పటిమ ఎలా సాగింది ? అనేది మిగిలిన కథ.

3డిలో రామాయణ యుద్ధ ఘట్టాలు

రామాయణంలోని ప్రధాన ఘట్టాలను యుద్ద నేపథ్యంలో పూర్తిగా 3డిలో తెరకెక్కించడమే ఈ సినిమా ప్రధాన ప్లస్ పాయింట్. పైగా అన్ని ముఖ్య పాత్రలకు అగ్ర నటీనటులు నటించడం.. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో చాలా బాగా నటించారు. పైగా అత్యంత భారీ అంచనాలతో పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్, భారీ నిర్మాణ విలువలు ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్లు.

ఇన్నాళ్లు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓం రౌత్ ఈ సినిమా రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు. సినిమా చూస్తున్నంత సేపూ ఓ అత్యుత్తమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ప్రభాస్ తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. హీరోయిన్ కృతి సనన్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది.  అలాగే సన్నీ సింగ్, సోనాల్ చౌహన్, దేవదత్ నాగ్ లాంటి నటులు అద్బుతంగా నటించారు

సెకండ్ హాఫ్ స్లో

సినిమాలో పాత్రల గెటప్ లు అండ్ సెటప్ కూడా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావు. దర్శకుడు ఓం రౌత్ 3డి విజువల్స్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథాకథనాలు మీద పెట్టలేదనిపిస్తుంది. సినిమాలోని ఒక్కో సన్నివేశం విడిగా చూస్తే, ఆ సన్నివేశాలన్నీ పాత సినిమాల్లో చూసిన ఫీలింగే కలుగుతుంది. దీనికి తోడు సినిమా మొత్తం స్లోగా సాగుతూ ఉండటం వల్ల..ప్రేక్షకులు కొంత అసహనానికి గురి అవుతారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను అనవసరంగా లాగడం వల్ల ఆ సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అయింది. అయితే విజువల్స్ వండర్స్ భాగానే ఉన్నా ఎమోషన్స్ మిస్సింగ్ అయ్యాయి.

టెక్నికల్ అంశాలు

సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను చాలా అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా బాగుంది. సంగీత దర్శకులు అజయ్ – అతుల్ మరియు సంచిత్ బల్హార, అంకిత్ బల్హార సమకూర్చిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు కూడా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. 3డి ఎఫెక్ట్స్, ప్రభాస్ – కృతి సనన్ ల నటన, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. అయితే, తెలిసిన కథ కావడం, పైగా సెకెండ్ హాఫ్ పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ గా సాగకపోవడం వంటి అంశాలు సినిమాని బలహీనపరుస్తాయి.

ఫైనల్ టచ్

విజువల్స్ వరీ గుడ్, ఎమోషన్స్ మిస్సింగ్

నో రేటింగ్, మస్ట్ వాచ్