Site icon HashtagU Telugu

World’s Dirtiest Man Dies: వరల్డ్‌ డర్టీ మ్యాన్‌ ఇక లేరు..!

974408 D2

974408 D2

వరల్డ్ డర్టీ మ్యాన్‌గా పేరు గాంచిన ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ(94) కన్నుమూశారు. దశాబ్దాలుగా స్నానం చేయని కారణంగా “ప్రపంచంలోని అత్యంత మురికి మనిషి” అనే మారుపేరుతో ఉన్న ఇరాన్ కు చెందిన అమౌ హాజీ (94) మరణించినట్లు ప్రభుత్వ మీడియా మంగళవారం నివేదించింది. అర్ధ శతాబ్దానికి (67 ఏళ్లు) పైగా స్నానం చేయని అమౌ హాజీ దక్షిణ ప్రావిన్స్ ఫార్స్‌లోని డెజ్‌గా గ్రామంలో ఆదివారం మరణించినట్లు IRNA వార్తా సంస్థ పేర్కొంది.

హాజీ కొన్ని నెలల కిందట తొలిసారి స్నానం చేశారు. డెజ్‌గా గ్రామంలో నివాసం ఉంటున్న హాజీ ఆదివారం తుదిశ్వాస విడిచారని ఇరాన్‌ అధికారిక మీడియా IRNA పేర్కొంది. ఇరాన్ మీడియా సంస్థల ప్రకారం.. 2013లో ఆయన జీవితంపై “ది స్ట్రేంజ్ లైఫ్ ఆఫ్ అమౌ హాజీ” అనే చిన్న డాక్యుమెంటరీని సైతం నిర్మించారు.