Ayodhya world record: ప్రపంచ రికార్డులోకి మళ్లీ అయోధ్య. దీపావళికి లక్షదీపాలు, 1.25లక్షల పేడ దీపాలు..!!

శ్రీరాముడు నడయాడిన అయోధ్య నగరం దీపావళి వేడుకలు సిద్దమౌతోంది. ఈ దీపావళిని ప్రత్యేకంగా నిర్వహించాలని ఉత్తరప్రదేశ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

  • Written By:
  • Updated On - October 20, 2022 / 10:28 AM IST

శ్రీరాముడు నడయాడిన అయోధ్య నగరం దీపావళి వేడుకలు సిద్దమౌతోంది. ఈ దీపావళిని ప్రత్యేకంగా నిర్వహించాలని ఉత్తరప్రదేశ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అద్భుతమైన ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉంది. బుధవారం సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా అయోధ్యలో పర్యటించారు. దీపావళి సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. మూడు గంటలపాటు అక్కడే గడిపారు సీఎం. రామాలయంలో ముఖ్యమంత్రి ఇంజనీర్లకు పలు సూచలను చేశారు. ఆలయ నిర్మాణ పురోగతిని పరిశీలించారు యోగి ఆదిత్యనాథ్.

ఈ సారి అంగరంగవైభంగా నిర్వహించేలా దీపోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆవు పేడతో చేసిన 1.25 లక్షలకు పైగా దీపాలన వెలిగించనున్నారు. దాదాపు 17లక్షల మట్టిదీపాలు అయోధ్యను మెరిసేలా చేయనున్నాయి. ఇది సరికొత్త ప్రపంచ రికార్డు కానుంది. గతేడాది అయోధ్యలో 12ఏళ్ల పాటు దీపాలను వెలిగించారు. రాముడి పాదాలపై 9లక్షల దీపాలు వెలిగించారు. మిగతా ప్రాంతాల్లో 3 లక్షల దీపాలు వెలిగించారు. రామజన్మభూమి కాంప్లెక్స్ లో 51వేల వేల దీపాలను వెలిగించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇప్పుడు కూడా దీపోత్సవానికి మెరుగైన ఏర్పాట్లు చేయాలని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయులు కూడా సహకరించాలని తెలిపారు. వీఐపీల కోసం మూడు హెలీ ప్యాడ్ లను తయారుేశారు. వాటిని కూడా సీఎం పరీశీలించారు. దీపోత్సవానికి పీఎం నరేంద్రమోదీ కూడా హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అంతేకాదు దీపావళిరోజున ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ ఆలపించిన శ్రీ హనుమాన్ చాలీసా కొత్త ఎడిషన్ను ఆయోధ్యలో సీఎం యోగి ఆవిష్కరించనున్నారు.