Site icon HashtagU Telugu

Women Bullet Bike: అర్ధరాత్రి బుల్లెట్ బండిపై చక్కర్లు కొట్టిన మహిళలు, షాకైన నెటిజన్స్!

Viral

Viral

బుల్లెట్ బండి అనగానే సాధారణంగా అబ్బాయిలు రయ్ రయ్ మంటూ దూసుకుపోవడం చాలా కామన్. కానీ ఆడవాళ్లు కూడా తగ్గేదే లే అంటూ కష్టమైన బుల్లెట్ బండిని నడుపుతున్నారు. మహిళలు ద్విచక్ర వాహనాలు నడపడం సర్వసాధారణమే అయినా, చీరలు ధరించి బండ్లు నడపడం కష్టంతో కూడుకున్న పని. కానీ ఓ ఇద్దరు మహిళలు చీరలో అర్ధరాత్రి బుల్లెట్ ను నడుపుతూ కనిపించారు. ఓ మహిళ హైస్పీడ్ తో బండిని నడుపుతుండగా, మరో మహిళ జర్నీని ఆస్వాదిస్తూ కేరింతలు కొడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘గుజ్జర్ కి హోద్’ పాటతో ‘సోనా_ఓమి’ అమ్మాయి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 940k పైగా వ్యూస్ తో పాటు, 57k లైక్‌లతో వైరల్‌గా మారింది. మగవాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ధైర్యంగా, బోల్డ్ గా బుల్లెట్ ను నడిపి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆడవాళ్లు బుల్లెట్ బండిని డ్రైవ్ చేయడాన్ని ఇష్టపడ్డారు నెటిజన్స్. కొంతమంది నెటిజన్స్ మాత్రం ‘‘బాబి రోడ్డు భద్రత కోసం హెల్మెట్ ధరించండి’’ అని ఉచిత సలహాలు ఇస్తున్నారు.

Exit mobile version