Site icon HashtagU Telugu

Female Truck Driver: లారీ నడుపుతూ.. కుటుంబానికి అండగా నిలుస్తూ!

Woman Truck Driver

Woman Truck Driver

సమాజంలో ఆడ,మగ ఇద్దరూ కూడా సమానమే. కొన్ని సందర్భాలలో ఆడవారిది పై చేయి కాగా, మరికొన్నిసార్లు మగవారిదిపై చేయి అవుతుంది. ప్రస్తుత సమాజంలో అయితే మగవారితో పాటు ఆడవారు ఏ విషయంలో తీసిపోరు అన్న విధంగా అన్ని విషయాలలో కూడా పోటీ పడుతున్నారు. చాలామంది ఆడవారు అయితే మగవారు చేసే పనులను కూడా చేస్తూ మగవారికి మేము ఏమాత్రం తక్కువ కాదు అన్న విషయాన్ని నిరూపిస్తున్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మన భారత దేశంలో ఆడవారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. దీనితో స్త్రీలు కూడా వారికి నచ్చిన నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

కాగా ఇప్పటికే మగవారితో సమానంగా ఆడవారు ట్రైన్, విమానం, కార్లు, బస్సులు, లారీలను నడుపుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఒక మహిళ లారీ నడుపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా లారీలను ఎక్కువగా మగవారు నడుపుతూ ఉంటారు. ఆడవారు ఇతర వాహనాలతో పోల్చుకుంటే లారీలు చాలా తక్కువగా నడుపుతూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ మహిళ ఎంతోమంది మహిళలకు రోల్ మోడల్ అని అంటున్నారు నెటిజన్లు. అయితే అందుకు గల కారణం కూడా లేకపోలేదు.

 

ఆమె ధైర్యంతో కాన్ఫిడెన్స్ తో లారీని డ్రైవ్ చేయడమే కాకుండా తన ఆనందంతో ఎంతోమంది మహిళలను ప్రోత్సహిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక మహిళ హైవేలో వేగంగా లారీ నడుపుతోంది. ఆమె మరొక వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో ఆ లారీ వాహనంలోని వ్యక్తి ఆమెను చూస్తూ ఆశ్చర్యపోతూ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ వ్యక్తి వీడియో చేస్తున్న సమయంలో ఆ మహిళ అతని వైపు చూస్తూ సరదాగా నవ్వింది. ఆ మహిళ నవ్వులో ఏమాత్రం బెదురు అన్నది కనిపించడం లేదు. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ ఆ మహిళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఆ వీడియోకి లక్ష్మల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వచ్చాయి.