Site icon HashtagU Telugu

Viral Photo: పులికి రాఖీ కట్టిన మహిళ.. ఎలా సాధ్యమైందంటే..!?

Leopard Rakhi Imresizer

Leopard Rakhi Imresizer

స్త వెరైటీగా చెట్లు, మూగ జీవాలకు మహిళలు రాఖీ కట్టడాన్ని మనం ఇప్పటివరకు చూశాం.

కానీ రాజస్థాన్ లో ఒక మహిళ వెరీ వెరైటీ గా రాఖీ కట్టింది.

ఇంతకీ ఆమె రాఖీ కట్టింది ఎవరికో తెలుసా ? పులి రాజాకి!!

అడవిలో రారాజుగా వెలుగొందే పులి ముందు కాలికి ఆమె ఓపిగ్గా రాఖీ కట్టింది. ఇందుకు సంబంధించిన ఒక ఫోటోను ప్రముఖ ఇండియన్ ఫారెస్ట్ అధికారి (ఐ ఎఫ్ ఎస్) సుశాంత నంద ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.

ఈ ఫోటో తో పాటు దాని వివరాలను కూడా సుశాంత నంద వెల్లడించారు. రాజస్థాన్ లోని ఒక జూలో అనారోగ్యంతో బాధపడుతున్న పులిని.. ప్రత్యేక చికిత్స నిమిత్తం అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ సమయంలో జూ కు వచ్చిన ఒక మహిళ స్వయంగా వెళ్లి పులి ముందటి కాలికి రాఖీ కట్టింది.

దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ వివిధ రకాల కామెంట్స్ పెట్టారు.”పులికి రాఖీ కట్టి వ‌న్య‌ప్రాణుల ప‌ట్ల ప్రేమ‌, సోద‌ర‌భావాన్ని ప్ర‌ద‌ర్శించారు” అని
ఐ ఎఫ్ ఎస్ సుశాంత నంద అభిప్రాయపడ్డారు.మ‌హిళ వ‌న్య‌ప్రాణి ప‌ట్ల చూపిన ప్రేమ‌, ఆప్యాయ‌త‌ల‌ను ఇంట‌ర్‌నెట్ స్వాగ‌తిస్తుంద‌ని ఓ నెటిజ‌న్ వ్యాఖ్యానించారు.చిరుత‌కు రాఖీ క‌ట్ట‌డం ప్రేమ, ఆప్యాయ‌త‌ల‌కు సంకేత‌మ‌ని మ‌రో యూజ‌ర్ ప్ర‌శంసించారు. దేవుడు ఎన్నో జీవుల‌ను సృష్టించాడ‌ని, ప్రపంచం కేవ‌లం మ‌నుషుల‌కే కాద‌ని మ‌రో యూజ‌ర్ రాసుకొచ్చారు.

Exit mobile version